Saturday, December 22, 2012

భగవంతుడా ఎందుకిలా చేసావు


ఢిల్లీ గగ్గోలు పెడ్తోంది. దేశమంతా ఉరి తీయాలి చంపేయాలి అంటూ ఆవేశంతో ఊగిపొతున్నారు. అవును చంపెయాలి ఎవరిని ద్రౌపది చీరలాగిన కౌరవులందరిని, సరె పాండవులు క్రిష్ణుడు కలిసి చంపేసారు, తరువాత ఆగిందా ఈ మృగ దారుణం. యాసిడ్ పోసారు ఎంకౌంటెర్ చేసేసాం. ఆగిందా లేదు. మలాలా చదువుకో కూడదు బయటకొస్తే చంపెస్తాం తాలిబాన్లు,వాళ్ళని ఆపేదెవరు,

దీనంతటికి కారణం అమ్మాయిల వస్త్రధారణ కారణం అంటారు కొంతమంది పెద్దమనుషులు.అంటే బురకాలు ధరించే అమ్మాయిలు కూడా బయటకు రావద్దు చదువుకోవద్దు అనే వాళ్ళని ఏమందాం .

పురాణ కాలం  నుండి ఇప్పటికి ఇదే సమస్య స్త్రీలని వేధిస్తుంటే ఎవరిని
తప్పుపడదాం. ఏమొ పురుషుడికి బలాన్ని స్త్రీలకి ఎదురుకోలేని బలహీన శరీరాన్ని ఇచ్చిన భగవంతుడినా

తల్లి కడుపునుండే వచ్చినా ఆడ శరీరం అనగానే అదే ద్రుష్టితో చూసే మగవాడి కళ్ళనా, నాలుగు రోజులు గగ్గొలు పెట్టి సరైన చర్యలు తీసుకోలేక అడపిల్లలకి రక్షణ కలిపించలేని సమాజాన్నా ప్రభుత్వాన్నా, ఎవరిని,అమ్మాయిలుగా పుట్టినందుకు ఈ శాపాలు భరించేదెలా.


జరుగుతున్న అన్యాయాలకి బయటకెల్లి అరవలేక ఇలా వెల్లబొసుకుంటున్నా నా భాధ.

 భగవంతుడా ఎందుకిలా చేసావు

Monday, December 17, 2012

స్నేహమా ఎక్కడున్నావు


స్నేహమా ఎక్కడున్నావు
భాధలో వెతికా
సంతోషంలో వెతికా
దుఖం లో వెతికా
కనిపించవేంటి


చెలియలికట్ట దాటే
దుఖం నీ కొరకేనా
మనసు తెరిచి చూస్తే
నీ రూపేనా
నాలోనే ఉన్నా
దూరంగా అనిపిస్తావు

ఎదురుగా కనిపించే ఏ మనిషిలో
నువ్వు కనిపించడం మానేసావు

నీ రూపు మారిపోయిందా
ప్లాస్టిక్ సర్జరి చేయించుకుని
నువ్వెళ్ళి
పోతే నెను
గుర్తుపట్టలేక పోయానా

మరో సారి నువ్వు నేనెరిగిన నేస్తంగా
స్వచ్చంగా కనిపిస్తావేమోనని
వెతుకుతున్నా

Thursday, September 13, 2012

Saturday, September 8, 2012

స్నేహమేరా జీవితం


ఎవేవో కారాణాల చేత మనం కొందరి స్నేహితులకి దూరం అయిపోతాం. నిజమైన స్నేహితులు మనల్ని మన స్నేహాన్ని గుర్తు పెట్టుకుని కలవటానికి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి ప్రయత్నమే నా స్నేహితురాలు పద్మ చేసి, ఇదు ఏళ్ళ తరువాత, నన్ను ఈ మధ్యే కలిసింది. తనకి ఒక పాప మానస. ఆ చిన్నిది ఎప్పుడో పసిగా ఉన్నప్పుడు నన్ను చూసింది. మళ్ళీ ఇదు యేళ్ళ తరవాత కూడా నన్ను కొంచెమైన మరిచిపోలేదంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళమ్మ నిరంతరం నన్ను గుర్తు చేస్తూ ఐనా ఉండాలి లేదా నేను ఆ పసి మనసులో చెరగని ముద్ర ఐనా వేసి ఉండాలి. ఏది ఏమైన ఆ చిన్నిదాని మనసులో నాకు చోటు ఉండటం నాకు చాలా అనందం కలిగించింది. వాళ్ళని చూడగానే నా కళ్ళళ్ళో ఏదో మెరుపు, నా పెదవులపై చిన్ని నవ్వు. ఏమి ఇచ్చినా కొనలేని ఆనందం అది.

నాకు మా గాన పెసూనతోనే అవినాభావ సంబంధం అనుకున్నాను. కాని అంతటి చనువు, అంతటి చొరవ నాకు పద్మతోను ఉంటుంది. తన స్నేహానికి కండిషన్స్ ఉండవు అదే నాకు బాగా నచ్చే విషయం తనలో.నేను నేనులా ఉండొచ్చు తనతో.    ఫాషన్, చదువులు, ఉద్యోగాలు, వంటలు, సినెమాలు, పుస్తకాలు, వ్యాపకాలు, వ్యవహారాలు, పిల్లలు, తల్లి తండ్రులు, మనషులు మనస్తత్వాలు ఇలా ఎన్ని విశయాలైన, ఎంత సేపైనా అనర్ఘలంగా, మాట్లాడుకోగలం కాకపోతే టైమె దొరకదు.

ఇంక ఎలాగు అందరం కలుద్దామని నిష్చయం చేసుకున్నాక, ఇంట్లో కన్నా పలు ప్రదేశాలు తిరుగుదామని అనుకున్నాము. ఇక అదో పెద్ద ప్రహసనం ఐపోయింది. ఒకరికి వీలు దొరికినప్పుడు ఇంకొకరికి దొరకదు. పద్మ వాళ్ళతో పాటు, మా విమ్మిగాడూ, వాడి స్నేహితులు బాబీ, విశాల్ కూడా మాతో రావటానికి రెడి అయ్యారు. ఇక్కడ ప్రాబ్లెం లేనిది ఒక్క పద్మకే. మిగితా అందరికి చాలా చాల లింకులు పనులు వున్నాయి. నెల రొజుల ముందైన ప్లాన్ చేయాలి. నాకు అసలు సెలవ లేదు, పద్మ వాళ్ళ ఆయనెమొ రెండూ రోజుల ముందే తిరుగు ప్రయాణం కావాలన్నారు, మానస యేమొ నా స్కూల్ అంటుంది, పద్మ వాళ్ళ నాన్నగారేమో నన్ను ఇండియా ఎప్పుడు పంపిస్తున్నావ్ అమ్మాయ్ అని ఆదుగుతారు. పద్మ వాళ్ళ తమ్ముడేమో, నేను బిసినెస్ త్రిప్ వెల్తూన్నాను, నేను తిరిగి వచ్చాక నాన్నని ఇండియా పంపిద్దామే అని ఆంటారు, మా అయనేమో నాదేముంది మీరంతా ముందు ప్లాన్ చేసుకొండి అంటారు, అసలు విషాల్ కి, బాబి కి మా ట్రిప్ లో వాళ్ళు కూడా ఉన్నారన్న సంగతి వాళ్ళకె తెలియదు, వాళ్ళ టైం కూడా మేమే నిర్ణయించేసాము. మొత్తానికి ఒక వారం రోజులు కూర్చుని టైం టేబుల్ వేసాము. నయాగర, న్యూయార్క్, అట్లాంటిక్ సిటి తిరిగేసాము. అసలు ఆ ఉత్సాహానికి అంతు లేదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఎంటంటే, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అని. ఈ రోజుల్లో అందరు బిజీనే. ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి. నిజం చెప్పాలంటే నాకు క్షణం తీరక ఉండదు. ఉంటే అసలు నాకు తోచదు. ఐనా నాకు బిజీ అనేది అసలు నచ్చని పదం. నీకు నచ్చక పోతే మాకేంటట అని అనేసుకోమాకండి కాస్త అలోచించండి మీ బిజి కాస్త తగ్గించుకుని అవతలి వాళ్ళతో కలిసి చూడండి, ఏదైన కొత్తదనం ఉంటుందేమో.

--విజయ

Wednesday, July 25, 2012

సరదాగా స్నేహితులతో

అబ్బ ఎంత తేడా? వెన్నెల్లో, ఇసుక తిన్నెల్లో... 'ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి' అంటూ గోదావరి అందాలు మాత్రమె తెలుసు ఇన్ని నాళ్ళు. ఆ అందం ఆస్వాదించటమే తప్ప వర్ణణ చాలా కష్టం. మరి తేడా ఏంటి అంటే, లేక్ ఓజార్క్స్. ఇది మిస్సోరిలో ఉంది. ఇదంతా ఒక స్పీడ్ ప్రపంచం. తీరిగ్గా ఇసుక తిన్నె మీద కూర్చుని 'ఉప్పొంగెలే గోదావరి' అని అస్సలు పాడుకోలేము. ఒక జెట్ స్కీ వేసుకుని స్పీడ్ గా వెళ్తూ 'నువ్వు నాతో రా, తమషాలో తేలుస్తా ' అని పాడుకునే వాళ్ళే ఈ లేక్ కి వెళ్ళాలన్న మాట. భారతం వదిలేసి ఇన్ని నాళ్ళు అయినా ఇంక గోదావరి ఙ్నాపకాలతోనే ఏమి బ్రతికేస్తాములే అని లేక్ ఒజార్క్ లో జెట్ స్కీ వేసుకుని, 'నువ్వు నాతో రా' అంటు నా స్నేహితురాలిని ఎక్కించుకుని మరీ వెళ్ళిపోయాను. యే మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. గోదావరిది ఒకరకమైన అందమైతే, లేక్ ఓజార్క్ ది ఇంకో రకమైన అందం. ఒకటి బాల మురళి పాట ఐతే, ఇంకొకటి మైకేల్ జాక్సన్ పాట. ఐతే రెండింటిని ఇష్టపడగలిగే మనస్తత్వం నాది. అందుకే లేక్ ఒజార్క్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చేసాము.

మేము గుంపుగా అందరం వెళ్ళటం మూలంగా ఇంకా ఎంతో సరదాగ ఉండింది. మొదటి రోజు సాయంకాలం కల్లా అక్కడకి చేరుకున్నాము. ఐతే ఆ రొజు 'అన్ని బేబి ' పుట్టిన రోజు. దొరికిందే చాన్సు అనుకుని, మేము నగలు, చీరలు వేసుకుని 'అందంగా లేనా, అస్సలేమి బాలేనా' అంటూ తెగ హడవిడి చేసాము. అబ్బాయిలేమొ డెకరేషను అంతా గోడలపై సర్దేసారు ఫాస్ట్ ఫార్వార్డ్ లాగా. కాని బేబీ మాత్రం ఓసి పిచ్చి మొహాలు నా పుట్టిన రోజుకి మీ హడవిడి ఏంటి అన్నట్లు మమ్ములందరిని ఒక చూపు చూసి, తనకి, ఆ రోజుకి ఏమి సంబంధం లేనట్లు ఢమాల్ మని నిద్రలోకి జారుకుంది. మేము ఏమి చేయాలో తెలియక కాసేపు బుర్ర గీరేసుకుని, ఎలగొలా కేక్ కట్ చేపించాము (చేసాము). చీర సర్దుకోటానికి పట్టినంత సేపు లేదు ఆ పుట్టిన రోజు వేడుక. కాని ఆ పేరుతో పూర్తిగా భారతీయ వంటకాలన్ని తెగ మెక్కేసాము.

మరుసటి రోజు ఉదయాన్నే కఫీ కప్పులు పట్టుకుని బయట కాలు పెట్టగానె కళ్ళ ఎదురుగానే అతి పెద్ద లేక్. అప్పటికే అందరు నీళ్ళలో బోట్లు, స్కీయింగ్ వేసుకుని మేఘాల్లో తేలిపోతున్నట్లుగా వెళ్ళిపోతున్నారు. మెల్లిగా కాఫిని ఆస్వదించి, బ్రెడ్ ఆంలెట్ ఉపాహారం కానించి బీచ్ వైపు వెళ్ళాము. ఆ బీచ్ లో నీళ్ళు కాస్త మడ్డిగా ఉన్నా అలాగే అందరం చేపల్లా ఈదేసాము. అలా రెండు గంటలు గడిపేసి బయటకి రాగానె. మా మొహాలు ఎండకి రంగు మాసి ఫోటోలో తెల్లటి పళ్ళు తప్పించి ఇంకేమి కనిపించలేదు. జెట్ స్కీయింగ్, బోటింగ్, గో కార్టింగ్, స్విమ్మింగ్ ఇలా రొజుకొకటి చొప్పున అందరం భలే హుషారుగా చేసేసము. పగలంతా ఇలా సరిపోతే సాయాంకాలం అంతా ఆటా పాటలతో గడిపేయటం. ఎలాగైన అందరిని కవులని, రచయితలని, గాయకులని, నటులని చేయాలని విశ్వ ప్రయత్నం చేసాను. సగం ప్రయత్నాలు ఫలించాయి.ఇంకో సగం మళ్ళీ ఇంకెప్పుడైనా ప్రయత్నించాలి. మొదటి ప్రయత్నగా అందరిని కవులని చేసాను. 'వెన్నెల ' మీద చిన్న కవిత రాయమన్నప్పుడు ఒక్కొక్కరి కవితా హౄదయం భలే అందంగా వికసించి రకరకాలైనా కవితలు వినిపించాయి. అవి ఎంతో ఆహ్లదంగా ఆశ్చర్యంగా అనిపించాయి నాకు. అదీ కాక, 5 నిముషాల్లో అందరు రాసేసారు అప్పటికప్పుడు. మరి విశేషమే కదా, కీ బోర్డు పట్టుకుని కోడింగు రాసుకునే వాళ్ళు, నా కోసం కలం పట్టుకుని కవితలు రాయటం. అవి ఇక్కడ అందరి కోసం.

Friday, May 11, 2012

మరవలేని సౌరభాలు


నాకు మొక్కలు పూలు పూయటమే తెలుసు. కాని ఈ దేశంలో చెట్లు పూలు పూస్తాయి. విరగబడి మరీ పూస్తాయి. వెళ్ళే దారంతా పూ దారే. అటు ఇటు పూల చెట్లు చూస్తూ, మంద్రంగా పాట వింటూ, మెల్లిగా కారు నడపటం భలే సరదాగా ఉంటుంది.  అప్పుడప్పుడు గుల్ దస్తా తెచ్చి ఇంట్లో పెట్టుకుని మరీ పూలని తదేకంగా చుస్తూ ఉంటాను. నాలాంటి వాళ్ళు గడ్డి పూలని కూడా విడిచిపెట్టరు. ప్రతి కొమ్మలో పూలని వెదుకుతు, ప్రతి రెకులొ అందాన్ని వెతుకుతూ తిరిగెస్తూ వుంటాను. ఇక్కడి పూల సొబగులు ఎంత చెప్పినా తక్కువే. అదో అద్భుత పూల ప్రపంచం. ఇన్ని వేల పూలు, ఎన్నో రంగుల్లో నా చుట్టూ ఉన్నా,  నాకేమో సన్నజాజులు, మల్లెలు, మరువాలే గుర్తొస్తూ ఉంటాయి.  వాటి సౌరభం  వీటికెక్కడిది అనుకున్నాను. ఒక్కసారిగా మా అమ్మ, ఇంకా తను పెంచిన మల్లెలు, మరువాలు, రాధా మనోహరాలు, మాలతి లతలు గుర్తు వచ్చాయి. మా అమ్మ పట్టు లంగాలు వేసి, జడ కుప్పెలు వేసి, బొలేడు పూలు మా జడల్లో తురుమేది. మేము జింక పిల్లల్లా చెంగు చెంగున తిరుగుతూనే ఉండే వాళ్ళం.  ఈ మధ్య అమ్మ గుర్తు వస్తే వయసు మీరుతున్న అమ్మ, అరోగ్యం దెబ్బ తిన్న అమ్మ, ఇంక తొందర్లొ మమ్ముల్ని విడిచి వెల్లిపొతుందేమొ అన్న బాధ ఎక్కువైపోయి కళ్ళు నీరు కమ్మేస్తున్నాయి.  మా చిన్నిది కూడా ఒక బొండు మల్లెలా ఉంటుంది. అప్పుడప్పుదు పట్టులంగా కూడా వేసుకుంటుంది. కాని, మల్లెలు జడ గంటలు తీరని కోరికే. ఈ నేపద్యంలో నాకు కూడా కంచిపట్టు చీర కట్టుకుని, జడ నిండా మల్లెలు పెట్టుకోవాలనిపించింది. అయ్యో జడ లేదే? మల్లెలు అంతకన్నా లేవు.  పాశ్చాత్య వస్త్ర ధారణకి అలవటు పడిపోయి, కంచిపట్టు చీర కట్టుకుంటే అరువు తెచ్చుకున్నట్లుగా అనిపించింది.   పెద్ద జడ లేదు, జడలో మల్లెలు లేవు ఇంకేమి లాభం? అలంకారం నాకు పెద్దగా అతికినట్లు అనిపించలేదు. ఐనా చీర చుట్టేసుకున్నాను. అప్పటి బాపు బొమ్మలు ఇప్పుడు అసలు వున్నారా అనుకున్నాను. భారతంలో యే మూలో వుండి వుంటరులే. కాని, ఇప్పుడేమో అందరు మోడ్రన్ మహాలక్ష్ములే. యే కాలానికి అదే అందమేమో అనుకున్నాను. మొత్తానికి నేను బాపు బొమ్మలా లేనని మూతి విరిచేసి, అటు ఇటు కాని హ్రుదయంతోని ఎందుకురా ఈ వేదన నీకు అనుకుంటూ మళ్ళీ జీన్స్ తగిలించేసుకున్నాను. 

--విజయ

Monday, March 26, 2012

వింటూనే ఉండండి www.radiokhushi.com with RJ VIMAL

ఇవాళ ఉదయం లేస్తూనే రేడియో లో విమల్ గొంతు ప్రవాహాంగా వినిపించింది. నా చెవులని నేను నమ్మలేకపోయాను. ఒక్కసారి కళ్ళు నులుముకుని జుట్టు వెనక్కి అనుకుని మరీ విన్నాను. అవును అది విమల్ ' radiokhushi.com first ever live from New Jersey with RJ Vimal ' అని జెట్ జోష్ గా చెప్తున్నాడు. నా పెదవుల పై ఒక చిన్ని నవ్వు, నా కళ్ళల్లో ఓ చిన్న మెరుపు. 'Yes he is Vimal and he is doing the program'. నేనెప్పుడు అనుకోలేదు. విమల్ తో న్యూ జెర్సీ తెలుగు రేడియో కల సాధ్యం చేయొచ్చు అని. కాని నా ప్రయత్నం ఆపలేదు. అది ఈనాటికి నిజమైంది. జెట్ జోష్ లో విమల్ గొంతు అలా వస్తూనే ఉంది నేను లేచి నా పనులు పూర్తి చేసుకుంటూనే ఉన్నాను. విమల్ కి చాలా ఎనర్జి. ఎక్స్ప్రెస్ లా వెళ్ళిపోతూనే ఉన్నాడు కొంచెం స్పీడ్ తగ్గించమని చెప్పాలి అని అనుకున్నాను. Vimal ' I am living my dream once again and my Radio days are back ' అని రేడియో లో చెబుతున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. నాకు ఒక్కసారిగా గుజారిష్ చిత్రంలో Ethan Mascarenhas గుర్తు వచ్చేసాడు. విమల్ కూడా అలాగే ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేయగలగాలి అని కోరుకున్నాను. విమల్ వాయిస్ ఇంకా కామెంటరీ రెండు కూడా మోనొటనీ నీ పోగొట్టి హూషారు పెంచుతాయి. అందులో పొద్దు పొద్దున్నే , RJ Vimal says good morning, good evening, good afternoon to all the folks across the globe ఆంటూ మంద్రంగా చెప్పగానే నిద్ర మత్తు వదిలి హుషారు వచ్చేసింది నాకు. ప్రోగ్రాం స్కెడ్యూల్స్ ఇంకా చేస్తూనే ఉన్నాడు. పబ్లిసిటి కోసం కూడా భారి ఎత్తున సన్నాహాలు చేస్తున్నాడు. తన ప్రయత్నాలు అన్ని విజయవంతం అయ్యి అందరు ఆదరించే రేడియో కార్యక్రమాలు ఎన్నిటినొ తాయారు చేసి మన అందరి ముందుకు వస్తాడని నా ఆశ. నాకు కూడ ప్రతి ఆదివారం 'Coffee with Karan' టైపులో 'అమ్ములుతో అరగంట ' అనే ప్రోగ్రాం చేయాలని ఉంది. ప్రొగ్రాం ఎలా ఉంటే బాగుంతుందో మీరందరు నాకు సలహా ఇస్తే ఇంకా బాగుంటుంది.

It is surely a good start in the morning to listen to Vimal's jet speed, high energy voice which boosts our energies too.

మీ ఆనందం కోసం వింటూనే ఉండండి http://www.radiokhushi.com/ with RJ Vimal Live from New Jersey USA North East from morning 7:00am to 9:00am EST

Send your comments, requests via facebook or phone call.
www.radiokushi.com/jersey and www.facebook.com/radiokhushi
7-9AM EST and 4:30 to 6:30 PM IST

--విజయ

Tuesday, February 14, 2012

Love All

Happy Valentine's Day



Monday, January 23, 2012

నా డెయిరీ లో ఒక ఉదయం

కిటికి తెర తీసి బయట ప్రపంచాన్ని చూట్టానికి, వెచ్చటి వెల్వెట్ బ్లాంకెట్ అలానే చుట్టేసుకుని లేచి కూర్చున్నాను. రాత్రి అంతా మంచు కురిసిందేమో, తెల్లటి మంచు వెండి కొండలై మెరిసిపోతోంది. ఇంకా మంచు పూలుగా పడుతూనే ఉంది. సూర్యుని కిరణాలు తగిలి ఇంకా మెరిసిపొతోంది. ఒక బ్లూ జే పక్షి అలా ఎగురుతూ వెళ్ళింది. నా కళ్ళు దాని వెనకాలే తిరిగాయి. అబ్బా నేను ఒక విహంగం ఐపోతే అని అనిపించింది. నా అంత పెద్ద విహంగం ఆకాశంలో ఎగిరితే చుట్టానికి అంత బాగోదులే అని సరిపెట్టుకున్నాను. ఐనా ఆ బ్లూ జే కి వెల్వెట్ బ్లాంకెట్ లేదు కదా, పాపం దానికి చలి వెస్తుందేమొ దాని జీవితం కన్న నా జీవితమే బెటర్ అని కూడా అనుకున్నాను. మరో వైపు నుంచి ఒక ఉడుత వచ్చింది దొంగ చూపులు చూస్తూ. దాన్ని చూడగానే 'ఉడతా ఉడతా ఊచి, ఎక్కడకెళ్ళావు ఊచి ' అని అడిగేసా, అదేమొ బెదురుగా చూస్తూ తుర్రుమన్నది. పక్కింటి బిల్లీ తన కుక్కని (తప్పు కుక్కని కుక్క అనకూడదు, వాళ్ళ బాయ్ ని) తీసుకుని బయటకి వచ్చాడు. మళ్ళీ నాకు 'కుక్క కావాలి ' అనే పాట గుర్తు వచ్చింది. విశ్వాసంగా, ఆటలాడుతూ ఒక చిన్ని శునకం ఇంట్లో తిరుగుతూ ఉంటే బానే ఉంటుంది, కాని మరి దాని వెనకాల ఉండే పని మాటేమిటి అని అనిపించి ఆ ఆలోచనని విరమించుకున్నాను. ఇంతలో, నా ఆలోచనలతో తనకేం పనిలేనట్లు, ఒక నల్లని కారు సర్రున దూసుకు పోయింది. అంతేలే, ప్రపంచానికి నాతో పని ఏంటి అనుకున్నాను. అయినా ఇంత చిన్ని కిటికిలో నుంచి చాలా ప్రపంచమే కనిపిస్తోంది.

బిజినెస్ మాన్ సినిమా చూసిన మహాత్యం ఏమో (దేవుడిని అది కావాలి ఇది కావాలి అని అడగటమే తప్ప, నువ్వు ఎలా ఉన్నావు దేవుడా అని ఒక్కరు అడగరు అని డయిలాగు) శివయ్యా, కేవలం పులి చర్మంతో ఆ కైలాసంలో అంత మంచులో ఎలా ఉంటున్నావయ్యా అని అనుకున్నాను. పైగా మిసెస్ శివ తో తాండవం కూడా చేస్తూ ఉంటాడు అంత చలిలోను. పాపం మిసెస్ శివ కి కూడా వెల్వెట్ బ్లాంకెట్ ఉండదు, పైగా శివుడు డాన్సు కి రమ్మంటే 'నో ' కూడా చెప్పలేదు. నేనైతే, ' నో వే హోసే ' అని చాలా ఈజిగా చెప్పేయగలను. తనకన్నా నా జీవితమే మెరుగు అని ఇంకోసారి అనుకున్నాను.

ఒకసారి విశ్వం మీద అనుమానం వచ్చింది. నాకు ఇక్కడ ఇంత అందంగా కనిపిస్తున్నా, ఇంకెక్కడో ఎవరికో సునామి చూపిస్తూ ఉంటుందేమో అని. పోవే నువ్వొట్టి మోసకారివి, ఎప్పుడు ఒకేలా ఉండవు, అందరికి ఒకేలా కనిపించవు అని తిట్టేసుకున్నాను. ఈ భూమి, ఆ మాటకొస్తే ఈ విశ్వం అందరి సొత్తు కదా? అందరు సమాన హక్కులతో పుట్టలేదా? అదంతా ఏమో కాని, everyone has right to live productive life అని అనిపించింది. 'సర్వే జనా సుఖినో భవంతూ ' అని మనసారా ఆ వెంకన్నకి దండం పెట్టుకున్నాను.
--విజయ