Showing posts with label భారతి కవితలు. Show all posts
Showing posts with label భారతి కవితలు. Show all posts

Monday, December 17, 2012

స్నేహమా ఎక్కడున్నావు


స్నేహమా ఎక్కడున్నావు
భాధలో వెతికా
సంతోషంలో వెతికా
దుఖం లో వెతికా
కనిపించవేంటి


చెలియలికట్ట దాటే
దుఖం నీ కొరకేనా
మనసు తెరిచి చూస్తే
నీ రూపేనా
నాలోనే ఉన్నా
దూరంగా అనిపిస్తావు

ఎదురుగా కనిపించే ఏ మనిషిలో
నువ్వు కనిపించడం మానేసావు

నీ రూపు మారిపోయిందా
ప్లాస్టిక్ సర్జరి చేయించుకుని
నువ్వెళ్ళి
పోతే నెను
గుర్తుపట్టలేక పోయానా

మరో సారి నువ్వు నేనెరిగిన నేస్తంగా
స్వచ్చంగా కనిపిస్తావేమోనని
వెతుకుతున్నా

Monday, December 21, 2009

నువ్వు నాతో లేవని

నువ్వు నాతో లేవని దిగులుగా ఉన్నాను
నేనెక్కడున్నా ప్రతినిముషం నువ్వు పక్కనేలేవేంటని వెతుకుతున్నా,
మనసేంటో మాట వినట్లేదు,
నీ ఆలోచనలతో నా నుండి దూరం వెళ్ళిపోయింది,
ఎన్నో చెప్పాలని ఉంది,
కాని మనసు మాటకు పదాలు కరువయ్యాయి .
నా పెదవులు నీ పేరే పిలవాలని ఆరాటపడ్తున్నాయికాని,
నా ఎదుట నీవు లేవని మాటలని, లోపలికి నెట్టేస్తున్నాయి.
నా కన్నీళ్ళు లోపలే ఉండాలా బయటకి రావాలా అని,
నిర్ణయించుకోలెక సతమతమవుతున్నాయి,
నీవు చూడకపోతేబయటకు వచ్చినా వ్యర్ధమని తటపటాయిస్తున్నాయి .
నా చేతులు నీ స్పర్శ అందక
ఒకదాన్ని మరోటి పెనవేసుకున్నాయి,
నా హృదయం ఆరాటపడ్తుంది ,
నువ్విక్కడేఎక్కడో వున్నావని చెప్తుంది,
నీ మీద నా ప్రెమెంతో నేనెలా నేనెలా చూపించను?
కొలతలు కొలమానాలు ఏవి లేవే?
నా గుండె చప్పుడు వినేంత దగ్గరగావచ్చి చూడు ,
ఇలా ఇంకో సారి నన్ను విడిచి వెళ్ళవు .

--భారతి

Monday, December 7, 2009

ప్రేమనేది



ప్రేమనేది ఒక అందమైన అబద్దం
నాకు నువ్వు, నీకు నేను అన్న భ్రమ...
కాలంతో పాటు మసిబారి మాయమవుతుంది!!
ఇద్దరి మధ్య హిపోక్రసీ ముసుగులా మొదలై...
అడ్డుగోడలా మారిపోతుంది!!
నువ్వూ, నేను చెరో పక్క పరిగెడతాం
అలిసిపోయి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే...
కనిపించేవి కేవలం ఙ్ఞాపకాల నీడలు!!

--భారతి

Wednesday, November 11, 2009

అనురాగగీతాన్ని


నేనొక అనురాగ గీతాన్ని
నీ హృదయ వీణ పై
నన్ను ఆలపించి చూడు
మోహన రాగాన్ని ఆలపిస్తాను

నేనొక మలయ సమీరాన్ని
నీ పిల్లన గ్రోవిపై
పలికించి చూడు
మంజుల నాధమై వినిపిస్తాను

నేనొక సువాసన ధూపాన్ని
నీ గుండె గుడిలొ
వెలిగించి చూడు
సుగంధాలని వెదజల్లుతాను

నేననె అస్థిత్వం
నీవు ఆస్వాదించగలిగితేనె
సహజ లక్షణాలని
ప్రకాశిస్తుంది