Showing posts with label భారతి అవీ ఇవీ. Show all posts
Showing posts with label భారతి అవీ ఇవీ. Show all posts

Monday, September 1, 2014

సెలవంటూ వెళ్ళిన రాతని వెతుక్కుంటు గీత వెళ్ళింది (బాపురమణీయం)



ఒక రాత ఒక గీత చెలిమి చేసాయి. ఒకటిగ ఉన్నాయి నువ్వు రాస్తే నేను గీస్తాను, నువ్వు గీస్తేనే నేను రాస్తాను
అనుకుని ఒకటిగ బ్రతికాయి . దేముడు ఏదో పనున్నట్లు రాతని ముందు పిలిచాడు. దేముడే పిలిచాక వెళ్ళక తప్పదుగ అని రాత, గీతకి వీడ్కొలు చెప్పి దేముడి దగ్గరకెల్లింది.

పాపం ఒంటరైన గీత కొన్నాళ్ళు అటు ఇటు చూసి ఎహె ఏం దేముడివి నువ్వు మమ్మల్నిలా విడదీయడమేంటి, ఒకరు లేకుండ ఒకరం ఎలా వుంటామనుకున్నావు. నేను వస్తున్నా ఉండూ అంటూ దేముడితో పోట్లాడి వెళ్ళింది.

అయ్యో ఇప్పుడు మనమేం చేద్దాం వాళ్ళిద్దరూ లేకుండా? కళకి అంతం వుండదు అంటారు కాని ముగింపు వుంటుంది అని తెలిసింది. వేలాది గీతలని రాతలని మనకి వదిలి వాళ్ళిద్దరు ఊసులాడుకోవడానికి ఒకచోట చేరారు.

--భారతి

Saturday, December 22, 2012

భగవంతుడా ఎందుకిలా చేసావు


ఢిల్లీ గగ్గోలు పెడ్తోంది. దేశమంతా ఉరి తీయాలి చంపేయాలి అంటూ ఆవేశంతో ఊగిపొతున్నారు. అవును చంపెయాలి ఎవరిని ద్రౌపది చీరలాగిన కౌరవులందరిని, సరె పాండవులు క్రిష్ణుడు కలిసి చంపేసారు, తరువాత ఆగిందా ఈ మృగ దారుణం. యాసిడ్ పోసారు ఎంకౌంటెర్ చేసేసాం. ఆగిందా లేదు. మలాలా చదువుకో కూడదు బయటకొస్తే చంపెస్తాం తాలిబాన్లు,వాళ్ళని ఆపేదెవరు,

దీనంతటికి కారణం అమ్మాయిల వస్త్రధారణ కారణం అంటారు కొంతమంది పెద్దమనుషులు.అంటే బురకాలు ధరించే అమ్మాయిలు కూడా బయటకు రావద్దు చదువుకోవద్దు అనే వాళ్ళని ఏమందాం .

పురాణ కాలం  నుండి ఇప్పటికి ఇదే సమస్య స్త్రీలని వేధిస్తుంటే ఎవరిని
తప్పుపడదాం. ఏమొ పురుషుడికి బలాన్ని స్త్రీలకి ఎదురుకోలేని బలహీన శరీరాన్ని ఇచ్చిన భగవంతుడినా

తల్లి కడుపునుండే వచ్చినా ఆడ శరీరం అనగానే అదే ద్రుష్టితో చూసే మగవాడి కళ్ళనా, నాలుగు రోజులు గగ్గొలు పెట్టి సరైన చర్యలు తీసుకోలేక అడపిల్లలకి రక్షణ కలిపించలేని సమాజాన్నా ప్రభుత్వాన్నా, ఎవరిని,అమ్మాయిలుగా పుట్టినందుకు ఈ శాపాలు భరించేదెలా.


జరుగుతున్న అన్యాయాలకి బయటకెల్లి అరవలేక ఇలా వెల్లబొసుకుంటున్నా నా భాధ.

 భగవంతుడా ఎందుకిలా చేసావు

Thursday, February 24, 2011

కలం గుండె ఆగింది


కలం గుండె ఆగింది అక్షరాలని అలవోకగా రంగరించి తెలుగువాడి గుండెలలో రసరమ్య కావ్యాలని అందించిన కలం పాళి ములుకు విరిగిపోయింది, అయితే మనదందరం కుంచె వైపు దిగాలుగా చూస్తున్నాం, కలంతో స్నెహం చెసిన కుంచె ఆ కావ్యాలకి రంగులద్దిన కుంచె, కలం లొంచి జాలువారిన అలొచనలకు ఆక్రుతి నిచ్చిన కుంచె ఇప్పుడెం చెస్థుంది అన్నదె ప్రతి తెలుగువాడి భాధ.బాపురే అంటే కడురమణీయం. అని ఆస్వాదించే తెలుగు ప్రజలకి అన్యాయం చెసాడా దేముడు.


భారతి

Friday, October 1, 2010

భయం గుప్పెట్లో మనం

మనం భారతీయులం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో పుట్టాము, మన పూర్వికులు చాలా కష్టాలు పడ్డారు, ఆంగ్లేయొలు వచ్చి మనని ౨౦౦ ఏళ్ళకుపైగా పరిపాలించారు, మహాత్ముని పుణ్యమా అని వచ్చిన స్వాతంత్ర్యాన్ని, మితి మీరిన స్వేచ్చగా అనుభవిస్తూ ఎవరికి వాళ్ళు మా ఇష్టం, మా మతం, మా ప్రాంతం , మా భాష అంటూ విభజించాలని ఎవరికి వాళ్ళు అధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు,

దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు, అయోధ్య లో రామమందిరాన్ని కట్టించమని రాములవారు అడిగారా, రక్తపుటేరులు పారించి శవాల గుట్టలమీద మసీదు కూలగొట్టి రామ మందిరం కట్టారు, ఈ రోజు దేశమంతా భయం గుప్పెట్లో వుంది,
నీ పక్కవాడే నీకు శత్రువు ఐపోతాడు, హిందు ముస్లిమ్ భాయి భాయి నినాదమ్ మంట కలుస్తుంది, బెటాలియన్ల కొద్దీ పోలిసులు మీరు తప్పకుండా కొట్టుకోండి, అని చెప్పకనే చెప్తున్నట్లు కనిపిస్తుంది,

ఇది తెల్లారితే కె సి ఆర్ బెదిరిస్తున్నాడు, డిసెంబర్ తరువాత అటు చీమని ఇటు కూడా కదలనివ్వనని, అంతర్యుద్దం తప్పదని, సామాన్య ప్రజలకి పొద్దున లేస్తే బ్రతుకు బండి నడిపించడానికి ఎన్నో సమస్యలు, ఒక వైపు ధరలు ఇంకో వైపు వరదలు, తెల్లారితే పాలు దొరకవు నీళ్ళు రావు, కూరల ధరలకి రెక్కలొచ్చాయి, ఎలారా భగవంతుడా రోజు గడిచేది అని బ్రతుకుబండి లాగే సామాన్యులకి రోజుకో అదనపు సమస్య, చదువుకోమని పట్నం పంపించిన కొడుకు తెలంగాణా కోసం శవమై పోయాడని తెలిసిన తల్లి తండ్రులకి ఈ సో కాల్డ్ రాజకీయనాయకులు ఏం న్యాయం చేయగలరు.

ఎట్టకేలకు న్యాయమూర్తులు సమన్యాయం తీర్పు ఇచ్చారు, అలాగే తెలంగాణా విషయం లో కూడా సరైన న్యాయాన్ని జరిపించగలిగిన శక్తి శ్రీ క్రిష్ణ కమిటీకి వుండాలని దానికి ప్రజలందరు కట్టుబడి వుండాలని, ఈ భయం నీడ నుండి బయట పడీ పిల్లలందరు చక్కగా చదువుకోవాలని ఆశిద్దాం.

భారతి

Tuesday, September 28, 2010

మరువలేని రోజులు మరల రాని రోజులు


గుర్తుకొస్తున్నాయి అంటు ఏమైనా రాయాలంటే, గూడంటే గూడూ కాడు మేడంటే మేడా కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అనే పాట కి ప్రతిరూపం మా ఇల్లు, నిజంగా పొదరిల్లు మాదిరే ఇంటి ముందు పందిరి వుండెది, సన్నజాజులు రాధామనొహరాలు మాధవిలత కలగలిపి అల్లుకున్న పందిరి, ఇంక అమ్మ పెంచిన తోట గులాబీలు లిల్లీలు మల్లెలు, వీటన్నింటితో పాటు మేము ముగ్గురం అమ్మాయిలం కలిసి పెరిగాం.


అతి గారాబం చేసే నాన్న, అదుపులో పెంచాలని చూసే అమ్మ, కస్టమంటే తెలియకుండా ఎప్పుడు పెరిగిపోయమో కాలానికే కాని మాకు తెలియదు,ముగ్గురం చాలా ఫొడవుగా వుండటం తో ఎంతో పెద్దవాళ్ళమైపొయామని భావించే వాళ్ళు అందరు.

అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ముగ్గురిని వదిలేసి వెళ్ళేది. అప్పుడొచ్చేది కొట్టుకునే స్వేచ్చ అందరి గిల్లికజ్జాలూ తీరేలా కొట్టేసుకుని అమ్మొచ్చేసరికి గప్ చిప్ ఐపోయేవాళ్ళం, ఇక్కడొ విషయమేంటంటె మా చిన్ని రాక్షసి మాత్రం దెబ్బలాటలో గొంతు పెంచి ఏడ్చి చీమిడి ముక్కుతో దుబ్బు తలతో నాన్న పనిచేసే మిల్లు పక్కనే వుండటం తో నాన్న దగ్గరికి వెల్తా అని పరిగెత్తేది, ఇంక తనని పట్టుకుని బ్రతిమిలాడి ఎంత చేసినా
అమ్మొచ్చే దాకా ఏడుస్తూనే వుండేది ఇంకేముంది అమ్మతో అందరికి పడెవి తన్నులు,ఐనా అల్లరి మానేవాళ్ళమా.

ఎప్పుడూ ఆటలే పక్కన వెంకట లక్ష్మి ఆంటి పిల్లలు ముగ్గురు మేము మొత్తం ఆరుగురితో పెరడంతా హోరెత్తిపోయేది, ఎప్పుడు పెద్దవాళ్ళ్మయ్యామో తెలియదు, ఒకరోజు హటాత్తుగా నేను ఇంటికొచ్చే సరికి ఇంట్లొ ఎవరో కూర్చుని వున్నారు ఆ అంటు నోరు తెరుచుకు వెళ్ళిన నాకు అతనే పెళ్ళికొడుకు వారం రోజుల్లో నీ పెళ్ళి అని చెప్పారు, దాంతో బలవంతంగా బాల్యానికి గుడ్ బై చెప్పి హైదరాబాద్ వచ్చిపడ్డాను.



కొసమెరుపేంటో చెప్పాలా మా చిన్నికి ఇంకో బుల్లి రాక్షసి పుట్టి అచ్చు తను ఏడ్చినట్లే పెద్ద గొంతుకేసుకుని ఏడుస్తూ తను మామీద ఎలా సాగించుకునేదో అచ్చు తనమీద అలా సాగించుకుంటుంది హి హి హి.



భారతి

Monday, September 20, 2010

వినాయక నిమజ్జనం


వినాయకుడు నేను అంత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దేముడు, వినాయక చవితి వచ్చేంత వరకు గణేషుని ప్రతిష్టించి పిల్లలతో ఫూజ చేయించేంత వరకు చాలా బాగుంటుంది,

తరువాతే ప్రారంభమవుతుంది అసలు కథ వినాయకుడి కథ కన్నా వింతైనది వూరంతా వినాయకులే గణేషుని పేరుతో చందాలు వసూలు చేసి రోడ్డుకి అడ్డంగా పందిరేసి ప్రతిష్టించడం వరకు పర్లేదు, పొద్దున్నే మంత్రాలు బాగానే వినిపిస్తాయి. తరువాత మొదలవుతుంది సినెమా పాటల గోల అవి దాటామా,మూడో రోజు నుండి నిమజ్జనం పేరుతో జరిగే తంతు,

చావు డప్పులతో పిచ్చి గెంతులతో బాగ తాగేసి వూగిపోయే కుర్రకారుని చూసి భగవంతుడు ఎలా ఓర్చుకుంటున్నాడా అనిపిస్తుంది.

రాత్రంతా డప్పుల గోలే చిన్న పిల్లలు బి పి వున్న పెద్దవాళ్ళు పడే అవస్థ అంతా ఇంతా కాదు. ఇది వరకు మూడో రోజు పదో రోజు అని వుండెవి ఇప్పుడు ప్రతిరోజు నిమజ్జనమే.

ఒకరికి మించి ఒకరు పెట్టే విగ్రహాలు కొండంత దేముడికి కొండంత పూజ చేయగలమా, ఎందుకు ఎటికేడు విగ్రహాల సంఖ్య సైజు పెంచేస్తున్నారు.

పర్యావరణం కాలుష్యమమై పోతుంది, ఈ పెద్ద విగ్రహాల
వెల్లువలో జలమంతా కాలుష్యమమై పోతుంది,దెముడు భక్తితో పూజించమన్నాడు, అంతే కాని కాలుష్య సారంలొ ముంచమన్నడా.

ఫెద్ద విగ్రహాల తయారి నిషేదించాలంటె వాటి తయారీ లో ఎందరో బ్రతుకుతున్నారని నిస్సహయత ప్రదర్శిస్తుంది ప్రభుత్వం.
మనం మారాలి మన పిల్లలని మార్చాలి నిజమైన భక్తి ష్రద్దలంటె ఎంటొ వారికి నేర్పించాలి

ఏటా జరిగే నిమజ్జనాలలో పెద్ద విగ్రహాలతో పాటు నీట మునిగి చనిపోయే యువకుల తల్లిదండ్రుల మనశ్శాంతికై గణేషుని ప్రార్దిస్తూ, ఈ ఏడాది అపశ్రుతులు జరగొద్దని ఆశిస్తూ,




భారతి

Thursday, June 3, 2010

రెప్పచాటు స్వప్నం

చాలా సంవత్సరాల క్రితం నేను 'రెప్పచాటు స్వప్నం' అనే చైన్ సీరియల్ ఒకటి రాసాను, ఆంధ్రభూమి వీక్లీ లో, మొదటిభాగం నేను రాస్తే మిగితా భాగాలన్ని సాహితి మిత్రులందరు రాసారు, ఆ రోజుల్లొ ఆ విధానం చాలా విజయవంతం ఐంది. అలా సాహిత్య అభిలాష వున్న వాళ్ళు ఇప్పుడు నాలాగే బ్లాగు కూడా తప్పక రాస్తూ వుంటారని వూహిస్తున్నాను, ఎవరైన వుంటే చెప్పండి ప్లీస్. సాహిత్య అభిలాష వున్నవాళ్ళు ఖాళీగా వుండలెరు ఎదో ఒక విధంగా సాహిత్యాన్ని ఆస్వాదిస్థు వుంటారని ఆ రోజు భరణి కాంప్లెక్స్ లో కలిసిన మిత్రులెవరైనా వున్నారేమో అని నా ఆశ, ఉండి ఉంటె రిప్లై ఇవ్వండి బ్లాగులో కూడా అందరం కలిసి అలాంటిదేమైనా రాయాలని వుంది ఏమంటారు .

భారతి నాదెళ్ళ

Monday, April 5, 2010

నేను నాతో పాటు నా కర్ఫ్యూ


చాలా రోజులైంది నా బ్లాగు రాసి, రాద్దామనె అనుకుంటున్నా ఏం రాయాలో మెదడుకి అసలు అందుతేగా, సెక్యులరిజం లౌకికవాదం అని ఎన్ని సంవత్సరాల నుండి మనని మనం మభ్యపెట్టుకునే పదాలుగా మాత్రమే మిగిలిపోయాయి, కర్ఫ్యూ నీడలో పుట్టిన పాపాయికి భారత దేశంలో హైదరాబాదు లో పాలు ఎందుకు దొరకవో తెలుసా, పాలు లేక పాప ఏడ్చే ఏడుపుకి మనలో ఎవరి వద్దనైనా సమాధానం వుందా,ఎందుకు కొట్టుకుంటున్నారు ఎవరిని ఎవరు చంపుకుంటున్నారు,ఎవరు ఎవరిని రెచ్చకొడ్తే రెచ్చిపోయి సాటి మనిషి మీద కత్తి ఎత్తుతున్నారు, ఎవరో కుట్రలకి వీళ్ళు ఆయుధాలవుతున్నారు.

ఎందుకిదంతా జరుగుతుంది, మాయావతి కి డబ్బుల దండలు వస్తాయి, కాని ఆకలికి అలమటించే వాడికి సాయం చేయడానికి ఎక్కడా నిధులుండవు, సమస్యలే లేనట్లు సానియాషోయబ్ పెళ్ళి పెద్ధ సమస్య మన మీడీయాకి, అది మనకో గొప్ప న్యూస్, కాకపోతే ఏక్తా కపూర్ గారి ఆడవిలని సీరియల్స్ వుండనే వున్నాయి, అందులోనే మన సంస్కృతి చూసుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకుంటున్నాం, మనం సగటు జీవులం తెల్లారిలేస్తే ఏ అరాచకానికి గురికాకుండా రోజు గడిస్తే భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుని తెలుపుకుని పడుకుని మళ్ళి పొద్దునజీవన పోరాటానికి సిద్దమవుతున్నాం.

ఏం చేద్దాం ఎవరి చేతుల్లొ వుంది మన పరిస్థితులు మార్చగలిగిన మంత్రదండం. నాకు జవాబు దొరకకే ఇన్ని రోజులు బ్లాగు రాయలేదు.

మీకేమైన తెలిస్తే చెప్పండి , ప్లీజ్



భారతి

Thursday, March 4, 2010

సొగసు చూడతరమా






మొన్న శివరాత్రికి రాజమండ్రి చూడ్డానికి వెళ్ళాను, కొనసీమ అందాలు ఇప్పటికే అందరు వర్ణించి వున్నారు, నా కళ్ళతో కూడా ఒకసారి మీ అందరికి చూపిద్దామని, కడియపులంక పూల అందాలని ఆస్వాదిస్తూ ర్యాలి, దిండి రిసార్ట్స్ చూస్తు గోదావరి సముద్రుడిలో కలిసే అంతర్వేది వరకు వెళ్ళాను.




ఎటు చూసినా పచ్చదనమే, దూరంగాను దగ్గరగాను కనిపించే కొబ్బరి చెట్లు గోదారి లోని నీళ్ళన్ని తమ బోండాలలో నింపుకుని గర్వంగా తలలెత్తి పలకరిస్తూ వుంటాయి, ఇంక పంట పొలాలు చూస్తుంటే ప్రకృతి మాత తన అందాల బిడ్డని ఎత్తుకుని చిలకపచ్చ చీర కట్టి ఆతిధ్యానికి ఆహ్వానిస్తు మర్యాదలు చేసే కొనసీమ ఇల్లాలిలా అనిపించింది. చల్లని గాలి వింజామర ఐతే కొసరి కొసరి పనసపొట్టు కూరతో వడ్డించిన రాజోలు హోటల్ లోని భోజనాన్ని, ఆ వడ్డించిన వ్యక్తిని, ఇక్కడ రెస్టారెంట్స్ లో వేల కొద్ది బిల్ కట్టినా ఆ ఆతిద్యం ఆ రుచులు దొరుకుతాయా.





ఎంతైనా గోదావరి జిల్లాల వాళ్ళు చాలా మర్యాదస్తులు, వారి మర్యాద మనకి నేర్చుకుందామన్నా రాదు, మనిషిని గౌరవించడం లో వారికి వారే సాటి, మాటల్లో కొంత వెటకారమున్నా, మనుషులని ఆదరించడం వారికి బాగా తెలుసు.ఇక పాపికొండల నడుమ గోదారి అందాలు ఏమని వర్ణించగలంలే,నేను కృష్ణ శాస్త్రిని కానుగా , పాపికొండల నడుమ గోదారి హొయలు పదహరేళ్ళ పడుచుపిల్ల నడుము తిప్పుకుంటు చంకలో కడవతో నడిచిపోతునట్లు వుంటాయి, పచ్చని కొండలన్ని అమ్మాయి ఆకుపచ్చ లంగా వేసుకుని, గోదారి నీళ్ళేమో నీలిరంగు ఓణి లాగ తెల్లని మబ్బులు తెల్లని రవిక లాగ అద్బుతంగా గోదారి కన్యక చంకలో కడవెత్తుకుని కొనసీమ ప్రజల దాహార్తిని తీర్చడానికి వెళ్తున్నట్లు అనిపించింది.




ఇంత అందమైన ప్రక్రుతి లేకపొతే కవులకి కవిత్వం ఎలా వస్తుంది, అందుకేనేమో వంశీ గోదారి లేందే సినెమా తీయలేదు, విశ్వనాధుడు ఒక స్వాతి ముత్యం లాంటి అద్బుత కళా ఖండాన్ని తీయగలిగాడంటే గోదారి వుంది కనకే అని నాకనిపించింది.
ఒకసారి వెళ్ళేరంటె మీక్కూడా అనిపిస్తుంది.


భారతి

Monday, February 1, 2010

అయ్యో మన దేశవాళి వంకాయ ఏమైపోతుందో

గుత్తి వంకాయ కూరోయ్ కోరివండినానొయ్ అని మన ఎంకి నాయుడు బావకి ప్రేమతో వండి పెట్టిన వంకాయ, వంకాయ వంటి కూరయు పంకజముఖి వంటి భార్యయు వుండాలని కవులు రాసేవారు అంతలా మన జీవితాలలో మమేకమైన వంకాయ,ఎమవుతుందో ఏమో అని భయమేస్తుంది.

అగ్రరాజ్యమైన అమెరికా కి జబ్బు ఒకటుంది అదే తన నంబర్ ఒన్ స్థానం నుండి ఎప్పుడు పడిపోతానో అన్న భయం. అందుకే ప్రపంచ దేశాల బలాలేంటి బలహీనతలేంటి అని ఎప్పటి కప్పుడు పరిశోదించి నయానో భయానో ,భ్రమపెట్టో భయపెట్టో వాళ్ళ ఉత్పత్తుల్లన్నిటిని తన గుప్పెట్లొ పెట్టుకుని ప్రతి దానికి వాళ్ళ మీద ఆధారపడెలా చూసుకుంటుంది.

నేను పోయిన సవత్సరం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మాల్ లో కూరగాయలు చూసి ఓయబ్బో ఇంత పెద్ద వంకాయలు, టమాటొలు ఎంతలా నవ నవ లాడిపొతున్నాయో, తింటే వీటినే కదా కూరొండుకుని తినాలి, అని బోల్దంత ఉత్సాహ పడిపోయి మా చెల్లి వద్దంటున్నా వినకుండా అది కొను ఇది కొను అని కొనిపించి ఇంటికి తెచ్చి వండి తిని చూద్దును కదా, ఛ ఇంత దరిద్రమైన టేస్ట్ వీళ్ళంతా ఎలా తింటున్నారా అని ఆశ్చర్యపోయాను.

ఆహా ఏమి రుచి తినరా మైమరచి అంటు వుండాల్సిన వంకాయ నోట్లొ ఏదో మైనపు ముద్ద పెట్టుకున్నట్లు వుండేది, టమాటో రుచి పచి లేకుందా చప్పగా కండ లాగ వుండి ఎంతకి వుడికేది కాదు.పాలకూర పప్పు పసరు కంపు కొట్టేది. అకరికి ఆ పాలతో పెరుగు కుడా మన పెరుగులా గట్టిగా లెకుండ తేగుడు తేగుడు గా వుంటుంది. పాపం అక్కడ మనవాళ్ళంతా ఎలాగో అలవాటు పడి ఇండియా నుండి తెచ్చుకున్న పచ్చళ్ళతో ఎలాగో సర్దుకుపోతుంటారు.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే ఇంత దరిద్రమైన వంకాయలు మనకి కూడా అంటగట్టి మన దేశవాళి రకాలని మాయం చేసి వాటి పురుగు మందులతో సహా వాళ్ళమీద ఆధారపడేలా చేసుకొవాలని చూస్తోంది, ఎంతసేపూ అమెరికా వాడి ప్రాపకం కోసం ప్రాకులాడే మన ప్రభుత్వం పాపం అమెరికా బి.టి విత్తనాలు మనం కాకపోతే ఎవరు కొంటారు, అక్కడ తినేది మనవాళ్ళే కదా ఇక్కడ కూడా మనం తిని అమెరికా వాడికి లాభాలు చేకుర్చుదాం అని రైతులని ప్రాధేయపడ్తుంది.

ఆ బి.టి విత్తనం స్పెషల్ ఎంటంటే విత్తనాలు ఒక కంపని కి మాత్రమే పేటెంట్ వుంటుంది, వాళ్ళ దగ్గరె విత్తనాలు కొనాలి, రాయల్టి అంతా ఆ కంపని కే వెల్తుంది, దానికి వచ్చే చీడపీడలన్నింటికి ఆ కంపని సూచించిన మందులనే వాడాల్సి వుంటుంది, దానిలో నుండి మరుసటి పంటకు వాడుకోవడానికి విత్తనాలు రావు, వచ్చినా అవి రైతు వాడటానికి కాని , ఎవరికైనా ఇవ్వడానికి కాని అతనికి హక్కు లేదు. అలా చేస్తె సదరు అమెరికన్ కంపనీకి పరిహారం చెల్లించాల్సి వుంటుంది. దరిమిలా జరిగేది ఎంటంటే మన దెశవాళి రకాలు అంతరించి మనం అమెరికా వాడికి కప్పం కట్టుకుంటు వాడు పంపించిన విత్తనాలని కొనుక్కుని పండించుకుంటూ, వాడు మనపై రుద్దిన పేటెంట్ లకి మనం బలవుతూ బ్రతకాలి అది రుచి పచి లేని ఆ కూరగాయలు తింటూ బ్రతకాలి.

అసలు మనం ఇప్పుడు తినే రకాలకి మన బాల్యంలో మనం తిన్న రకాలకే చాలా తేడాలు వున్నాయి, అప్పటి పంటలలో వున్న పొషకాలు కాని, రుచి కాని ఇప్పటి వాటికి లేవు,మన పూర్వీకులు మనకన్నా ఆరొగ్యంగా, ద్రుఢంగా వుండెవారు వాళ్ళ ఆరోగ్యం శారీరక బలం మనకి లేదు, ఎన్నొ జబ్బులు తినే తిండి ములంగానే మనం ఎదుర్కొంటున్నాం.

ఇప్పుడు ఈ బి.టి విత్తనాలని వాడి ఎందరో పత్తి రైతులు తెగుళ్ళకి సరైన మందులు వాడలేక పంట నాశనమై చివరికి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పరిణామాలు చూసి కూడ మళ్ళీ బి.టి వంకాయ విత్తనాలని మనమీద రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్దం కావట్లేదు, ఎదో ఒక దిక్కుమాలిన ఒప్పందాలకి ముందు వెనక ఆలోచించుకోకుండా సంతకాలు పెట్టేది, ప్రజలని చంపుకుతినేది. ఎవడో లాభాపేక్షకి ఎవరినో బలిచేసెది.

ఆ అమెరికా వాళ్ళంతే పాకిస్తాన్ ,ఇండియా ఎప్పుడు శత్రుదేశాల్లాగుంటే తను ఆయుధాలమ్ముకోవచ్చు, వీళ్ళు కరువుతో అల్లాడుతుంతె తన తుక్కు దూగరం అంతా ఇక్కడికి డంప్ చేయొచ్చు. బుష్ పోయి ఒబామా వచ్చినా అంతే ఇంకో చ్లింటన్ వచ్చినా అంతే వాళ్ళకి కావల్సింది, ప్రపంచ దేశాల మీద అధిపత్యం, వాళ్ళ కాపిటలిస్టిక్ సమాజానికి సంపద. నేరుగా కొల్లగొట్టకుండా ఈ వేషాలు, మన పసుపు పై వాడికే పేటెంట్ కావాలి మన వేప పై నాదే పేటేంట్ మీరు వాడకూడదు అంటాడు,దీనిని సమర్దవంతంగా అందరు కలిసి ఎదురుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది, అనే నా భాధ మీతో చెప్తున్నా.

భారతి

Friday, January 29, 2010

వాఆఆఆవ్ చాలాబాగుంది







నీరో చక్రవర్తి గురుంచి మనమంతా విన్నాం కదా, రోం నగరం తగలబడుతుంటే చూస్తు ఫిడేల్ వాయించుకుంటు కూర్చున్నాడని మరి మన నాయకులు ఎమైనా తీసిపోయారా, అంతకన్న గొప్పవాళ్ళు ఉన్నారండి మన దగ్గర,
ఒక వైపు తెలంగాణా ఇవ్వమని, వద్దని రాష్ట్రమంతా రావణ కాస్టం లా రగిలిపోతుంది, 2 సార్లు చీఫ్ మినిస్టెర్ గా చేసిన వ్యక్తి తన వాళ్ళని ఎగదోసి ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు, తను మాత్రం నోరు విప్పడు, వచ్చినా నా మంచికే రాకపోయిన నా మంచికే కొట్టుకోనివ్వు చావనివ్వు, అంటు తమషా చూస్తు కూర్చున్నాడు, ఇంత రాజకీయం ఎవరికైనా తెలుసా, టీ. ర్ .స్ .వాళ్ళకన్నా మద్యలో కూర్చుని తెలుగుదెశం నాయకులు చేస్తున్న గొడవే ఎక్కువగా వుంది, వీళ్ళ కత్తి కి రెండువైపుల పదునే,ప్రతి విషయాన్ని తమకి సానుకూలంగా మార్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.


ఇదంతా కూడా వాళ్ళ నాయకుడు వెనక వుండి నడిపిస్తున్న తంత్రం లో భాగమే అన్నది జగమెరిగిన సత్యం, ఇంతకి ఈయన ఇంట్లో కూర్చుని ఏమి చేస్తున్నాడని అందరు తలబద్ధలు కొట్టుకుంటున్నారు, లాభం లేనిదే శెట్టీ వరదన పొడనీ, ఇంట్లొ వున్న చంద్రబాబు ఫామిలి రాజకీయాలు చక్కపెడ్తున్నాడని ఇప్పుడె తెలిసింది, ఇన్ని రోజులు పక్కన పెట్టిన జూనియర్ ఎన్. టి. ర్ రాజకీయాలో పనికి వస్తాడు అతని చరిష్మాని వినియోగించుకోవచ్చు అన్న దశలో నెత్తిమీదకెత్తుకుని, తెలుగు దేశం కి ప్రచారం చేయించుకున్నాడు, అప్పుడే జరిగిన ప్రమాదం లో అతను మంచం మీద వుండినా అక్కడి నుండీ కూడ టి. వి. లో ప్రచారం చేయించిన ఘనుడు.ఎన్.టి.ర్ తరువాతి హీరో అతని వారసుడు ఐన బాలక్రిష్ణ ని ఏకంగా వియ్యంకుడిని చేసుకుని నోరెత్తకుండా చేసాడు.


సినెమా ప్రపంచంలో ఎన్.టి.ర్ ఎదుగుతున్న క్రమం చూసాక ఇంక అతన్ని బయటకి పోనివ్వడం భావ్యం కాదని తెలుసుకుని, తన మేనకోడలి కూతురు 17 సంవత్సరాల పసిదానితో పెళ్ళి నిశ్చయం చేసాడు, జూనియర్ ఎన్.టి.ర్ కూడా దీని కోసమే ఎదురు చూస్తున్నాడు కనుక వాళ్ళ అమ్మకి గౌరవం దక్కించడానికి ఫామిలి లో కలిసి పోవాడానికి దీనికి మించిన అవకాశం దొరకదు కనుక ఒప్పుకుని వుంటాడు.


మంచి తరుణం మించిపోనీకు అంటు చంద్ర బాబు రాజనీతికి చిక్కుకున్న జూనియర్ కి వాళ్ళ తాతకి జరిగిన వెన్నుపొటు కాకుండా మంచి జరగాలని ఆశిద్దాం.

వాఆఆఆవ్ చాలాబాగుంది నారా వారి పెళ్లి సినిమా కదూ.

భారతి

Thursday, January 28, 2010

పరికిణి




తనికెళ్ళ భరణి మంచి రచయిత అని మనందరికి తెలుసు ఆయన రాసిన "పరికిణి" కవితల సంపుటి చదివారా మీరు? చిన్న చిన్న మాటల తోనే ఇంత అందంగా కవిత చెప్పొచ్చా అని అద్బుతంగా అనిపించింది. కవితలో సొగసు మాత్రమె కాదు పదాలతో పదనిసలు ఆయన సొంతం. మనని ప్రతి లైన్ సొంతం చేసెసుకుంటుంది. తెలుగు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అమ్మాయికి 11 ఏళ్ళ వయసు రాగానే పరికిణి ఓణి కట్టిస్తారు, ఎందుకంటే అమ్మాయికి అందాన్ని ఇచ్చేది పరికిణి నే కాబట్టి అలాంటి పరికిణి మీద భరణి చెప్పిన ,
పరికిణి కవిత మీకోసం....

దండెం మీద
ఇంద్రధనస్సుని పిండి ఆరేసినట్టుంది!
కొడిపెట్టంటి వయస్సుని
కప్పెట్టిన బుట్టల్లే ఉంటుంది!

పదుచుపాము ఒంటి మీద
పంచరంగుల కుబుసంలా ఉంటుంది!
షాక్ కొట్టే ఎలక్ట్రిక్ వైర్ మీద
వేసిన కవరింగులా ఉంటుంది!

కలల పడవలకు
కట్టినతెరచాపలాగా
ఐస్ ప్రూట్ మీద ఉండే
ఉల్లిపొర కాగితంలాగా

కొత్త ఆవకాయ జాడీమీద
కట్టిన వాసనలాగ
పిందెలకి దిస్టితగలకుండ
కట్టిన గుడ్డలాగ

మాదుర్యానంతా

దాచుకున్నతేనెపట్టులాగ
సరుకులన్ని వున్న తెరవని
కిరాణ కొట్టులాగ
శృంగార రసంలో నానేసి నేసిన
అపారదర్శకపు అద్భుత దేవతా వస్త్రం -పరికిణి!

డాబా మీద నాలుగు చెరగులూ
పరిచి కుర్రకారు గుండెల్ని"పిండి" వడియాలు పెట్టేసిన జాణ - ఓణి!

ఓణి- పరికిణీ తెలుగు కన్నెపిల్లకు అర్ధాంతన్యాసలంకారాలు

పంజాబి డ్రెస్సులొచ్చి పరికిణీల్ని మాయం చేశాయన్న దుగ్ద కొద్ది రాసానని చెప్పారు భరణి మీకు నచ్చితే ఆయన కవితలు ఇంకా వున్నాయి నా దగ్గర ఏమంటారు?

భారతి

Wednesday, January 13, 2010

తెలుగు దేశమంతా సంక్రాంతి


సంక్రాంతి అనగానే భోగిపళ్ళు, ముగ్గులు, అరిసెలు, హరిదాసులు, గంగిరెద్దులు, ఇంత ఆనందాన్ని కళని ఇంకే పండగ మోసుకొస్తుంది చెప్పండి.
అందమే ఆనందం అన్నారు కదా, ముగ్గులతో మామిడి తోరనాలతో అందంగా అలంకరించుకుని రావమ్మ మహాలక్ష్మి రావమ్మా అనే పాటని పెడ్తే ఘంటసాల గొంతులో మాధుర్యానికి మహాలక్ష్మి పొంగిపోయి అన్నా మనింటికొచ్చేయదా చెప్పండి.
అందుకే సంక్రాంతి అంటే అంత ఆనందం అందరికి, మగవాళ్ళని ఎవరిని కదిలించినా పెళ్ళైన కొత్తలొ సంక్రాంతి కి మా అత్తగారి ఊరిలో జరిగిన నాకు జరిగిన వైభోగం తిన్న పిండి వంటలు అంటూ మట్లాడని వాళ్ళు వుంటారా, అంటే సంక్రాంతి అతని జీవితం లోనే మరపురాని తీపి గుర్తుల్ని జీవితాంతం గుర్తుంచుకునేలా మిగిలిస్తుంది.
తరువాత జీవన గమనంలో ఎన్ని పండగలు వచ్చినా కొత్త అల్లుడికి మొదటి సంక్రాంతి మిగిల్చే తీపి అరిసెల గుర్తులే వేరు.
పట్టు పావడాల అమ్మాయిలు గొబ్బిళ్ళు ముగ్గులు పెట్టి చిలకపచ్చ పావడా నాది చూడూ అంటే, ఎరుపు రంగు ఓణి నాది చూడు అంటూ, వయ్యరాలు పోయె ఆ లంగా ఓణిల లోని సింగారాలని చూడడానికిఉన్న కళ్ళు సరిపోతాయా, అదే తెలుగు తనం లోని కమ్మదనం, తెలుగు ఆడపిల్ల ఇప్పుడంటే చుడిదార్ల లోకి దిగారు, కాని పండగ నాటి అమ్మాయిలు పావడాల్తో కనువిందు చేస్తారు.
ఏ దేశం లో ఊన్న,ఒక్క సారి మా ఊరు పోయిరావాలి,పంట చేలతో మాటాడి రావాలి,అమ్మ చేతి పిండివంటలు తినేసి రావాలి,అనుకోని తెలుగు వాడు వుంటాడా.
అదే తెలుగు సంక్రాంతి లో వున్న అందం అన్ని పండగలు ఆనందాన్ని పంచుతాయి, అదేంటో సంక్రాంతి ఆత్మీయతని పంచుతుంది అనిపిస్తుంది నాకు.
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.మనది తెలుగు జాతి, మనది తెలుగు సంక్రాంతి, సంక్రాంతి కి ప్రాంతీయ భెధాలు లెవు ఇంటింటా వస్తుంది, పసి పాపల బొసినవ్వులా ఎవరిని చూసినా పలకరిస్తుంది. మన సంస్క్రుతికి లేని తేడాలు మనకెందుకు చెప్పండి. అందరం కలిసి చేసుకుందాం.కలిసి బ్రతుకుదాం.
భారతి

Thursday, December 31, 2009

ను ను ను నువ్వా?

ను ను ను నువ్వా? అవును నువ్వే నువ్వే!!! అని నేను అనేది 2010 ని చూసి. నిన్న, మొన్నేగా 2009 అని రాయటం అలవాటు చేసుకున్నది? ఏంటి అప్పుడే వచ్చేసావ్ నువ్వు? నీదేముందిలే సడిచప్పుడు లేకుండా వచ్చేసి, వెళ్ళే ముందు మాత్రం ఏదో ఒక కోలాహలం లేదా కలహలం రేపెట్టి వెళ్ళిపోతావ్. కొత్తగా చెప్పుకోటానికి ఏముంది? షరమాములుగా, ఎండతో కాల్చేస్తావ్ లేదా చలితో చంపేస్తావ్, తుఫానుతో ముంచేస్తావ్ లేదా కరువుతో కాటేస్తావ్. ఈ సంవత్సరం ఏకంగా రాష్ట్రాన్నే పోటెత్తించావ్.

ఒక్క నీకోసం ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎదురుచూస్తారు నీకు తెలుసుకద.ఎవో కొత్త ఆశలతో ఆనందం వున్నా లేకపోయినా లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని నీకు స్వాగతం చెప్తారు. నువ్వోస్తావు కొత్తవెలుగులని విరజిమ్ముతూ, ఏంటో ఈ రొజుతో ప్రపంచమే మారిపోతుంది అనిపిస్తుంది. నిన్న లేని అందమెదో నేడు కలిగినే అని పాడుకొవాలని అనిపిస్తుంది.

ఆ తరువాత మొదలవుతుంది నీ విశ్వరూప సందర్శనం, గడచిన సంవత్సరం ఏం చేసావు, ఒక మైకెల్ జాక్సన్ ని ఒక రాజశెకర్ రెడ్డి ని నీతో తీసుకెల్లిపోయవు, స్వైన్ ఫ్లూ, డెంగ్యు అంటు అంతు పట్టని రోగాల్ని తెచిపెట్టి అందరిని పీడించావు.ఎంత మంది బలయ్యారు, నీకెంటిలే నువ్వు సవత్సరానికి ఒక మారు మళ్ళి మళ్ళి పుడ్తునే ఉంటావు, నీకెం తెలుస్తుంది జనాల బాధ. ఇప్పుడు ఛూడు మావాళ్ళందరు రాష్త్రం నాది నాది అని ఎలా కొట్టుకుంటున్నారో,ఇవన్ని నువ్వు తెచ్చిన మార్పులే కద. మమ్మల్ని అందరిని తోసెసుకుంటు నువ్వు ముందు కెళ్తూనే వుంటావు. అమెరికాలో ఆర్దికమాంద్యానికి ప్రపంచ దేశాలన్ని కుదేలై పోయాయి.

కాస్త బాగుపడ్తున్నాం అనుకునే సమయంలో ఒక సునామి లేదంటే ఒక వరదబీభత్సం ఏదో రకంగా నాశనమె తప్ప ఇంకేమయినా మిగిల్చావా ? వేడుకుంటున్నాం గడచిన కాలమే మంచిదనేలా చేయకు, 2010 లొ అయినా ప్రపంచ శాంతిని అందించి వినాశనాలని జరగనీకుండా మానవాళి మనుగడకు సహకరించు.

అయ్ బాబోయి నువ్వా ను ను నువ్వా మళ్ళి వచ్చెవా, మాకేం తెచ్చేవో అని మేము భయపడెలా చేయకు. 2011 లో అయినా నువ్వేనా మా నువ్వేనా, నీ రాక కోసం నిలువెల్ల కనులై మేమంత వేచేములే అన్నట్లు తీపి ఙ్నాపకాలని మిగుల్చు.

బ్లాగు మిత్రులందరికి నూతనసంత్సర శుభాకాంక్షలు.
--భారతి

Thursday, December 10, 2009

నాది నాది అంటావు ఏది నీది?

మనిషి ముందు నేను, తరువాత నా కుటుంబం అనుకుంటాడు. ఎందుకంటే బ్రతుకులోని అనుభూతిని స్వార్దంతో మేళవించి తనది అనుకునే ప్రతిదాన్ని నిర్మించుకోవాలని తపనపడ్తూ జీవితం సాగిస్తాడు. ఆ క్రమంలో, నా ప్రాంతం , నా దేశం, నా ఇల్లు, నాది నాది అంటూ, విశ్వంలో ప్రతి పదార్థాన్ని సొంతం చేసుకోవాలని తాపత్రయపడ్తూ బ్రతుకుతుంటాడు. అంత వరకు మానవనైజం అని సరిపెట్టుకుంటే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగివుండేవి కావు. నా జిల్లా, నాకంటే నువ్వెక్కువ ఉన్నావు అంటూ, ఒకరినొకరు చంపుకుంటూ బ్రతికేది ఎవరైనా, సంపూర్ణ ఆయుశ్శు ఉంటే 80 ఏళ్ళు.

ఒక మొక్కని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, దానికి ప్రాణం ఉంది కదా అక్కడే ఉంటుంది. పుట్టినప్పటినుండి ఎన్నో ఫలాలనిస్తుంది ఇతరులకే, తను తినదు. ఎన్నో పక్షులకి ఆశ్రయమిస్తుంది, ఏమి ఆశించదు. బ్రతికినంత కాలం, ప్రాణవాయువుని ఇస్తుంది. నాది అని ఏమైనా అడుగుతుందా? ఒకోటి దాదాపు 300 ఏళ్ళు బ్రతుకుతుంది. మనకి తోడుండటానికి, సూర్యుడు ఏమి ఆశించకుండ వెలుగు ఇస్తున్నాడు, గాలి నిన్ను డబ్బులేమి అడగకుండ ప్రాణవాయువుని ఇస్తుంది. మనిషి ఏమిస్తున్నాడు? బ్రతికిన కొన్ని రోజులకి గాను స్వార్ధంతో పర్యావరణానికి చేటు చేస్తూ, రాబోయే తరాల వారికి కాలుష్యాన్ని నింపుతూ, నాది నాది అని కొట్టుకు చస్తూ, కొన్ని రోజులకి భూమి అనే పదార్ధమే సృష్టిలో నుండి కనుమరుగయ్యేలా, మానవజాతి మొత్తం అంతరించిపోయేలా, చాలా జాగర్తలు తీసుకుంటున్నాడు. అసలు సమస్యలన్ని పక్కనపెట్టి లేని సమస్యలని సృష్టించుకుంటూ, కాలాన్ని అద్బుతంగ్అ వెళ్ళదీస్తున్నాడు. ఆలోచించిన వాళ్ళు, నాది నాది అంటూ మన ఇంటిని మనమే తగలబెట్టుకుంటున్నాం అని వారికి అర్దం అయ్యేలా చెప్పగలిగితే బాగుండును.

--భారతి

Thursday, November 19, 2009

తేనె వానలు పూల సోనలు


నేనెప్పుడు నా లోకం లోనె వుంటాను చుట్టూ పరిస్థితులని అంతగా పట్టించుకోనని నా మీద మా ఇంట్లో కంప్లైంట్.
ఎందుకు పట్టించుకోను చాలా పట్టించుకుంటాను, నేను నడిచే దారిలో పూచిన గడ్డిపూవు నన్ను మాత్రమే పలకరిస్తుంది నీకెందుకు కనిపించదు. ఇంటి పక్కనే వున్న మామిడి చెట్టు మీద కూసిన కోయిల గొంతు నాకు మాత్రమె వినిపిస్తుంది. ఆ మామిడి చెట్టు ఏ కాలం లో పూస్తుందో ఎన్ని రంగులు మారుస్తుందో ఆ లేత చిగుళ్ళు తిని కోయిల కంఠం ఎంత మధురంగ వుందో నాకు కోయిలకే తెలుసు.

ఎవరేం చేస్తున్నారు అని చెప్పుకునే గాస్సిప్స్ నాకెందుకు చెప్పు, వాన కురిస్తే ఎందుకు వాన అని నీకనిపిస్తుంటె తేనెల వానలా నాకనిపిస్తుంది.కార్తీకం లో గుళ్ళో దీపాలు పాపాలని కడుగుతాయని అందరు పెడ్తుంటే ఆ దీపాల వెలుగులో కార్తీక చంద్రుని కాంతి వెన్నెల సంవత్సరంలో ఏనాడు కనిపించని ఆ జాబిలి వెన్నెల నన్ను పలకరించి పోదామని నాకొసమే వచ్చిన అతిదిలా అనిపించి పలకరించి పరవశించి పోతాను.

ఎప్పుడూ వండుకు తినడంలో, ఆ టి.వి ప్రోగ్రాంస్ లో నాకేమి ఆనందం వుండదు. అల లాగ తేలివచ్చే పాట వింటు నా సారీ మీద డిసైన్ చేసుకుంటూ వుంటే అలౌకిక ఆనందం నాకు. విరబూసిన ఫూల సోనలు వాటి సోయగాలు ఏ మనిషి లోనూ నాకు కనిపించవు.

కబుర్ల మూటని ఒక్కసారి విప్పేనంటె అలా ప్రవాహం లా చెల్లితో మట్లాడటం ఇస్టం మా మాటల్లో లేనిదంటు ప్రపంచంలో వుండదెమో మరి. అంతలా వుంటాయి మాటలు మా ఇద్దరి మధ్య మరి నా చిన్నారి చెల్లి నా మది తెలిసిన నేస్తం కూడ కదా. అంత ఆనందం ఎక్కడా నాకు దొరకదు మరి ఇంక టైం ఎలా గడిచిందో
ఎలా తెలుస్తుంది నాకు.

మిట్టూరోడి కతలు చదువుకుంటూ రావి శాస్త్రిని తిరగేస్తూ మహానుభావుల బ్రతుకుపుస్తకాలు తెరిచి అందులో మునిగిపోతే అన్నం వండాలి అని మర్చిపోవడం నా తప్పా చెప్పండి. మీలాగ రాజకీయాలు చర్చిస్తూ డైలి న్యూస్ పేపర్ లో వచ్చే హత్యా కాండలు నేను చదవడం లేదంటే నేనేం చేయాలి.

లోకం పట్టదని కంప్లైంట్ నా మీద ఇంకో లోకం నాకు తెలియదు మీకు తెలిసినా చెప్పకండి ఎందుకంటే తేనెవానలు పూలసోనలు తప్ప నా మైండ్ కి ఇంకేం ఎక్కవు.
--భారతి

Friday, November 13, 2009

ఈ రోజుల్లో ప్రేమ (లవ్ ఆజ్ కల్)

ఈ రోజుల్లో ప్రేమ (లవ్ ఆజ్ కల్) అనే సినిమా చూసాను యంగ్ డైరెక్టర్ ఇంతియాజ్ ఆలి సినిమా ని కమర్షియల్ గా తీసిన సినిమా చూసి బయటకు వచ్చిన యువతకు మాత్రం మనసులొ చిన్న ఆలొచన ఐనా వచ్చేలా చేసాడు అనిపించింది.కథానాయకుడు జై అతని గర్ల్ ఫ్రెండ్ మీరా ఇద్దరు ఈ తరానికి చెందిన వాళ్ళు. ఒకరిని చూసి ఇంకొకరు చూసిన నిమిషాన్నే ఆకర్షణలో పడతారు. ఏముంది దాంతో డేటింగ్ మొదలెట్టి ఇద్దరిలో ఆకర్షణ ద్వార కలిగే ప్రతి ఫీలింగ్ ని తీర్చుకుంటారు. దానికి మించి ప్రేమ అనేది కూడా మనుషుల్లో వుంటుండి అని కుడా వాళ్ళకి తెలియదు. ఇద్దరు డిఫెరెంట్ కెరీర్ ఏర్పర్చుకొవలని వాళ్ళ వాళ్ళ కెరీర్ ఇంటెరెస్ట్ వేరె కనుక విడిపోయి ఎవరి దారిలొ వాళ్ళు ఫూచర్ వెతుక్కుంటు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు.విడిపోతు బ్రేకప్ పార్టి కూడా స్నేహితులకి ఇచ్చి అక్కడే ఇంకెవరైన జోడి వెతుక్కుంటారు. అదే ప్లేస్ లో వీర్ అనే పెద్దాయన కనిపించి వారి చినప్పటి ప్రేమ విషయం వారు కనీసం కలిసి మట్లాడుకునే వీలు కూడా లేకపోయినా వాళ్ళ ప్రేమ ఎలా సాగింది ఒకరి మీద ఇంకొకరికి వున్న నమ్మకం ధైర్యం తో ప్రేమని ఎలా బ్రతికించుకుని ఎన్ని సాహసాలు చేసి ఒకటయ్యింది చెప్తాడు. అదంతా జై కి ఫన్ని గాఅనిపిస్తుంది. అలాంటి ప్రేమ ఒకటి వుంటుంది అని కూడ నమ్మలేడుకొంత కాలానికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఇండియా వెళ్ళి మీరా ని కలుస్తాడు. ఇద్దరు చెరి ఒకరి ప్రేమలొ వుండి కూడా మళ్ళి దొంగతనంగ కలిసి గడుపుతారు. అప్పుడు మీరా తను వాళ్ళ బాస్ ని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించానని పెళ్ళికి రమ్మంటుంది. అప్పుడు కూడా ఒకరి మీద ఇంకొరికి ప్రేమ వుంది అని వాళ్ళకి అర్దం కాదు.తరువాత పెళ్ళి అయ్యాక మీరా కి, కావలసిన కెరీర్ లో సెటిల్ అయ్యాక జై కి ప్రేమ అంటె ఎంటో ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ అనెది ఎలా ఉంటుందని వీర్ చెప్పాడో అర్దం అవుతుంది మీరా భర్తని వదిలి మౌనంగా పని చేసుకుంటూ వుంటుంది జై వెనక్కి తిరిగి వచ్చి మీరా ని కలుస్తాడు.ప్రేమనెది ఎంత విలువైందో తెలియకుండ కూల్ ,కాసువల్ అనుకుంటు ప్రతి విషయాన్ని సాదారణంగా తీసుకుంటూ సహజమైన ఫీలింగ్స్ కొల్పోతున్నరన్నదే డైరెక్టర్ చెప్పారు.అవసరాలని మించిన అనుబంధాలు వున్నాయని తల్లి తండ్రులు వారి నెంతో ప్రేమించి పెంచితేనె వారు నేటి స్థితికి రాగలిగారని ప్రేమ అనేది ఒక ఆట వస్తువు కాదని అదొక అనుబందమని యువత తెలుసుకోవాలి.అప్పుడు కాని నిజమైన ప్రేమంటో వారికి తెలియదు ప్రేమ పేరుతో ఇన్ని దారుణాలు అమ్మాయిలని చంపేయటాలు జరగవు, ప్రతి విషయానికి ఒక విలువుంటుంది అని తెలిస్తేకాని యువతలో మానసిక వికాసం కలగదు.

Sunday, November 8, 2009

మన స్నేహితులు

జీవితం లో మనకు ఎందరి తోనో పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళందరి తో కూడ ప్రాథాన్యాన్ని బట్టి మనం అనుబందాలని పెంచుకుంటాం ముఖ్యంగా మనం స్నేహితులు అని ఫీలింగ్ తో వున్నవాళ్ళు వాళ్ళు ఏమి ఆశించి మనతో స్నేహంగ వుంటున్నారో కూడ గమనించకుండ వాళ్ళు మన స్నేహితులు అని ఫీలై పొతు లేని పోని ఇంపొర్టెన్స్ ఇచ్చేస్తూ బ్రతికేస్తుంటాం మెల్లగ వాళ్ళ ప్రవర్తన లో మార్పు గమనించి ఎందుకిలా జరిగింది అని ఏడుపు ఒక్కటి తక్కువగ భాధ పడుతూ మనమే ఏమైన తప్పు చేసామా అని ఓ ఆలోచిస్తు బుర్ర బద్దలు కొట్టుకుట్టువుంటాం.
కాని అక్కడ సీన్ వేరే వుంటుంది వాళ్ళు ఏదో ప్రయోజనాన్ని ఆశించి మనతో స్నేహం చేస్తారో ఆ ప్రయోజనం తీరిపోగానే మనతో మాట్లాడటం మానేస్తారు. లేదా మనతొ ఎం ప్రయోజనం లేదని అనిపించినా మానేస్తారు అది మనం గమనించలేక ఫీల్ అవుతాం. నేను చెప్పేదేంటంటె మనుషులు పలు రకాలు వాళ్ళ ఆలోచనలు వేరే వుంటాయి అనవసరమైన ఫీలింగ్స్ తొ బాధ పడేకన్న మనని మనం గౌరవించుకోవడం బెటర్
నాకు ఒకోసారి అనిపిస్తుంది వెళ్ళి చెడా మడా నాలుగు అడగాల్సినవి అడిగేయాలి అని అలా కూడ చేసి చూసాను శారద అని నా X ఫ్రెండ్ వుండేది మాది 10 ఇయర్స్ స్నేహం తను మాట్లాడిన మాట్లాడక పోయినా నేనె ఫోన్ చేసి మట్లాడతం ఇంటికి వెళ్ళి తనతో స్పెండ్ చేయడం నాకు ఎదైనా నచ్చితే తనకి కూడ తీసుకెళ్ళడం ఇద్దరం ఒకరి కోసం ఒక ఎమైనా చెస్తాము అన్నంత ఫీలింగ్స్ తొ (అఫ్కోర్స్ నేనే వుండెదన్నేమో అలా తనకి వుండక పోవచ్చు సేం ఫీలింగ్స్) వుండెదాన్ని. తను చీరల బిసినెస్స్ స్టార్ట్ చేసింది అల్లగే చిట్స్ బిసినెస్స్ కూడా మొదట్లో ఈ సారీ నీకొసమే వుంచాను అని ఇచ్చి నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఈ చిట్ లో నీ పేరు కూడా రాసాను డబ్బులు కట్టు అని కట్టించుకోవడం చేసింది నేను ఎంకరేజ్ గా వుంటుందని తనకి తోడ్పడ్డాను తరువాత తరువాత నాకు కొత్త చిట్ కట్టడం కస్టం, ఈ సారీ నాకు నచ్చలేదు అని చెప్పాను. అంతే తన ప్రవర్తనలో ఎంతో మార్పు ఫోన్ చేసిన వుండి లేదనిపించడం బజార్ లొ కనిపించినా చూడనట్లు తలతిప్పి వెళ్ళిపోవడం చేసింది ఏంటి 10 ఇయర్స్ గా ఈమెనా నా క్లోస్ ఫ్రెండ్ అనుకుని అంత డబ్బు కర్చుపెట్టాను అని బాధ పడ్డాను, ఒక సారీ ఇంకెవరితోను ఫ్రెండ్శిప్ పేరుతో బిసినెస్ చేయకు అని చెప్పాను తరువాత నా మనసు తేలిక పడింది. వాళ్ళు మనతో ఆటలాడుకుంటె మనం వెర్రి దద్దమ్మల్లా భాధ పడటం వేస్ట్ అని నా అభిప్రాయం
అలాంటి వాళ్ళ కోసం మన మనసుని గాయపరుచుకోవడం, నిజమైన స్నేహితులు వున్నట్లైతే వారిని కోల్పోకుండ చుసుకొవడం మనవిధి.
తీయనైన స్నేహన్ని కలుశితం కాకుండ అందులోని మాధుర్యం అనుభవించడం లోని ఆనందమేంటో మరో పోస్ట్ లో రాస్తాను.
ఎందరో స్నేహమూర్తులు అందరికి వందనాలు.

భారతి