Saturday, December 22, 2012

భగవంతుడా ఎందుకిలా చేసావు


ఢిల్లీ గగ్గోలు పెడ్తోంది. దేశమంతా ఉరి తీయాలి చంపేయాలి అంటూ ఆవేశంతో ఊగిపొతున్నారు. అవును చంపెయాలి ఎవరిని ద్రౌపది చీరలాగిన కౌరవులందరిని, సరె పాండవులు క్రిష్ణుడు కలిసి చంపేసారు, తరువాత ఆగిందా ఈ మృగ దారుణం. యాసిడ్ పోసారు ఎంకౌంటెర్ చేసేసాం. ఆగిందా లేదు. మలాలా చదువుకో కూడదు బయటకొస్తే చంపెస్తాం తాలిబాన్లు,వాళ్ళని ఆపేదెవరు,

దీనంతటికి కారణం అమ్మాయిల వస్త్రధారణ కారణం అంటారు కొంతమంది పెద్దమనుషులు.అంటే బురకాలు ధరించే అమ్మాయిలు కూడా బయటకు రావద్దు చదువుకోవద్దు అనే వాళ్ళని ఏమందాం .

పురాణ కాలం  నుండి ఇప్పటికి ఇదే సమస్య స్త్రీలని వేధిస్తుంటే ఎవరిని
తప్పుపడదాం. ఏమొ పురుషుడికి బలాన్ని స్త్రీలకి ఎదురుకోలేని బలహీన శరీరాన్ని ఇచ్చిన భగవంతుడినా

తల్లి కడుపునుండే వచ్చినా ఆడ శరీరం అనగానే అదే ద్రుష్టితో చూసే మగవాడి కళ్ళనా, నాలుగు రోజులు గగ్గొలు పెట్టి సరైన చర్యలు తీసుకోలేక అడపిల్లలకి రక్షణ కలిపించలేని సమాజాన్నా ప్రభుత్వాన్నా, ఎవరిని,అమ్మాయిలుగా పుట్టినందుకు ఈ శాపాలు భరించేదెలా.


జరుగుతున్న అన్యాయాలకి బయటకెల్లి అరవలేక ఇలా వెల్లబొసుకుంటున్నా నా భాధ.

 భగవంతుడా ఎందుకిలా చేసావు

Monday, December 17, 2012

స్నేహమా ఎక్కడున్నావు


స్నేహమా ఎక్కడున్నావు
భాధలో వెతికా
సంతోషంలో వెతికా
దుఖం లో వెతికా
కనిపించవేంటి


చెలియలికట్ట దాటే
దుఖం నీ కొరకేనా
మనసు తెరిచి చూస్తే
నీ రూపేనా
నాలోనే ఉన్నా
దూరంగా అనిపిస్తావు

ఎదురుగా కనిపించే ఏ మనిషిలో
నువ్వు కనిపించడం మానేసావు

నీ రూపు మారిపోయిందా
ప్లాస్టిక్ సర్జరి చేయించుకుని
నువ్వెళ్ళి
పోతే నెను
గుర్తుపట్టలేక పోయానా

మరో సారి నువ్వు నేనెరిగిన నేస్తంగా
స్వచ్చంగా కనిపిస్తావేమోనని
వెతుకుతున్నా