ప్రియురాలి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆకలి, దాహం ఉండవని కవులంటారు. కొంతవరకు అది నిజమేనేమొ. కాని ఆ ప్రియురాలు కాస్తా భార్య అయిపోగానే, మగవాడికి ముందు గుర్తు వచ్చేవి ఆకలి దప్పులే. వాటిని తీర్చుకోటానికి, రేయింబవళ్ళు కష్టపడటం మొదలెడతాడు. కుటుంబాన్ని నడిపిస్తూ లేక మోస్తూ, ఆడవారు యంత్రాల్లా తయారవుతారు. కష్ట సుఖాలు, కలిమి లేములు, వెలుగు నీడలు, ఆనందాతిశయాలు, ముక్కు చీదుతూనో, పకపక నవ్వేస్తూనో, మౌనంగా భరిస్తూనో గడిపేస్తారు. ఇది మనిషి వ్యక్తిగతం. సామాజికంగాచెప్పాలంటే, విద్య, పోటి, పోరాటం, ఆస్తి, అంతస్తు, అస్తిత్వం, అహం, ఆరాటం, కీర్తి, ప్రతిష్ట, గెలుపు, ఓటములు ఇంకా ఎన్నో. కాస్త అటు ఇటుగా, భావ సారూప్యాలతో, భాషా భేధాలతో, మోడ్రన్ గానో, మోటుగానో ఒక సగటు జీవితం, సగటు జీవితం ఏమిటి, ఏ మనిషి జీవితం అయినా దీనికి అతీతంగా సాగదని నా ప్రగాఢ విశ్వాసం.
సరే ఈ విశ్వాసానికి, ఈ టైటిల్ కి, ఈ రాతకి పొంతన ఎక్కడ అంటారా? ప్రియురాలి కళ్ళల్లోకి చూడటం గురించి చెప్తే, ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ప్రియురాలి కళ్ళల్లోకి చూస్తే బ్రతుకు సమరం మొదలవటమే కాక మళ్ళీ ఆ కళ్ళల్లోకి చూసే తీరికే దొరకదు. అలా చూడటంలో కష్ట నష్టాల గురించి మనం ఇప్పుడు మాట్లడుకోబోవటం లేదు. అలా చూడటం తో మొదలయ్యే బ్రతుకు సమరం గురించి, అలా రోజు చూడటంలో వున్న కష్టం గురించి. అదే తూరుపు నుంచి వచ్చే నులి వెచ్చని కిరణం, ప్రతి రోజు చూసినా ఎంతో అహ్లాదాన్ని కొత్తదనాన్ని ఇస్తుంది. అలాగే ఒక వెన్నెల కెరటం ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చి మనసుని మాయ చేస్తుంది. అదే మనిషికి, ప్రకృతికి ఉన్న తేడా. మనిషి కూడ ప్రకృతిలో భాగమే కదా అన్న వాదన తెచ్చినా, ప్రకృతి వైపరీత్యాల ప్రస్తావన తెచ్చినా ఇక్కడ నేను చెప్పాల్సింది వెనక్కి పోతుంది.
రాగ ద్వేషాలని, ఈర్శాసూయలని, చిన్నా పెద్ద తేడాలని, ధనిక పేద అంతరాలని, ఙాని అఙాని బేధాలని, కుల మత భేషజాలని పక్కకి నెట్టి ఆ ఉదయభానుని కెరటం పై మనసారా ద్రుష్టిని సారిస్తే భయాందోళనలు, చిరాకులు అంతగా కలగవని అనిపిస్తుంది, కలిగినా ఎక్కువ సేపు నిలవవని, మరుసటి రోజు దర్శనంతో మాయమై పోతుందని నా అభిప్రాయం. 'ఆదిత్య హృదయం' నాకు పూర్తిగా అర్థం కాదు కాని, అందులో ఎంతో విశేషముంది అని మాత్రం ఆ సూర్య భగవానుడిని చూడగానే అనిపిస్తుంది. ఆ దర్శనానికి ఎంతటి శక్తి ఉంది అంటే, పైన చెప్పిన తేడాలన్ని త్రుణీకరం అనిపిస్తాయి. ఎవరిని నొప్పించాలని అనిపించదు. ఎవరైనా మనలని నొప్పించినా వారి స్వభావం అంతేలే అని తేలిగ్గా తీసుకో గలుగుతాం. అయినా, ఒకరికి మన హృదయాన్ని గాయపరిచే హక్కు ఎక్కడిది? ఒకరు నొప్పించాలని చూసినా ముందు వెనక చూసుకోకుండా అమూల్యమైన మన హృదయాన్ని కలవర పెట్టుకుంటామా? అయినా సూర్యుని అంతటి మహా శక్తి ఎలాంటి భేషజాలకి పోకుండా, అందరిని సమ దృష్టితో చూస్తున్నప్పుడు, అనంత విశ్వంలో ఒక అణుమాత్రమే అయిన మనిషి భేషజాలకి పోవటం తగునా?
మరుసటి రోజు సూర్య దర్శనం గురించి మాట్లాడే ముందు, ఈ రాత్రి వెన్నెల సోయగం గురించి చెప్పుకోవాలి. పగలంతా జీవన సమరం చేసి అలసి పోతే, హాయిని పంచి మనసుని మాయ చేసేది ఆ వెన్నెల కెరటమే కదా? మన జీవన సమరాన్ని సమర్ధంగా నడపటానికి సూర్య చంద్రులు అంతగా కష్టపడుతుంటే, వాటిని గమనించనైనా గమనించకుండా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాంఘీక ముఖాలు(సోషల్ మాస్క్) ధరించి, నేను ధనికుడిని అని కొందరు, నేను తెలివైన వాడిని అని ఇంకొందరు, నేనో బిజీ పర్సన్ అని మరికొందరు, అవతలి వాడు చేతకానివాడనో, తెలివితక్కువ వాడనో, ఉపయోగంలేనివాడనో అనే అభిప్రాయంతో కొందరు, నీచ బుద్దితో కొందరు, చెడు అలవాట్లతో ఇంకొందరు, అసలు నాకేమి తెలియదు అనే అభిప్రాయంతో ఎందరో గడిపేస్తు ఉంటే, వాళ్ళని చూసి జాలి వేస్తూ ఉంటుంది. సూర్య చంద్రులు, ఒక రోజుని బాలన్స్ చేసుకున్నట్లు, మనిషి తన జీవితాన్ని బాలన్స్ చేసుకోలేక, ఈ కారణాలన్నీ చెప్పుకుంటూ ఉంటాడేమొ.
అందరూ చేరే మరుభూమి ఒకటే, అందుకే పరదాలు (ఇంటి కిటికీలకేసినవే కాకుండా, ముఖాలకి, మనసులకి వేసినవి కూడా) తొలగించి, ఓ తూరుపు కిరణం, ఓ వెన్నెల కెరటం మనపై సారనిస్తే, ఆ జీవన రీతే చాలా వైవిద్యంగా ఉంటుంది.
--విజయ

4 comments:
avunu, suryachandrulu ee jagati lo unna samasta praanakoti ni sama drushti tho choodalane manaki cheptunna, bhagavantudu manishi chuttu unchina maaye manishi ni adi gurtupattanivvadu...edo oka kshanam lo ila realise ainappudaina, manam totivaritho sakhyata ga bratikite ade padivelu...sahayam cheyyagaligina prati manishi, tana vantu sahayam chesinatlaite, suryachandrulanta kakapoyina, ee jagati ki edo okati chesina vaallamavutamu...
చాలా చక్కగా రాశారు. దీనినే నా పురోహిత భాషలో చెప్పాలంటే సంధ్యోపాసన అంటారు. రోజూ చేసే/చేయవలసిన ఆ సంధ్యావందనం లోని నిగూఢార్థం ఇదే. :)
హాయ్ విజయ గారు
మీరు బొమ్మలు చాలా చక్కగా పెడతారు. చాలా బాగా వ్రాసారు. సరదాగా ఒక మాట చెప్పనా! అమ్మ పెట్టింది కడుపు నిండా తినేసి తన కోసమే అలంకరించుకుని ఏకాంత ప్రదేసానికి వచ్చిన నవ యవ్వన జవ్వని (ప్రియురాలు) కళ్ళల్లో కి చూస్తూ (ఎక్కువ సమయం ఉండదు కదా) ఆకలి దప్పులు మరచి పోవచ్చు. పెళ్ళి అయ్యాక నెత్తి మీది కొప్పుతో, నైటీ ఒకటి తగిలించ్కొని (హడావిడిగా) మద్యాహ్న భానుడి లా ఎప్పుడూ ఎదురు గా ఉండే భార్యని కూర్చో పెట్టి కళ్ళల్లోకి చూడాలంటే ఎవరికి సాద్యం చెప్పండి.
కష్టం ఉన్నప్పుడే సుఖం ఆధ్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషీ సాద్యమైనంతవరకూ ఎదుటివారిని నొప్పించకూడదు అని అనుకుంటే అంతా ఆహ్లాదమే. కాని తొలి కిరణం నులివెచ్చని స్పర్స అనుభూతిని మనసారా ఆస్వాదించకుండానే ప్రచండ భానుని తీక్షణత కు గురి కాక తప్పదు, అప్పుడే
కదా మలి సంద్యలోని రమణీయత ఆస్వదించగలం . అన్ని ఉంటేనే జీవితం.
సుధ
సుధ, చిత్రాలు నచ్చినందుకు ధన్యవాదాలు. ప్రియురాలికి, భార్యకి వున్న తేడ భలే చెప్పారు. ప్రకృతిలో రమణీయత, ఆస్వాదించే వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు, మనిషికి, మనిషికి ఉన్న తేడాని, మనిషిలోని రమణీయతని కూడా అస్వాదిస్తారని నా అభిప్రాయం. అది ఇది కూడా పట్టని వాళ్ళు మన చుట్టూ ఎంత మందో కదా?
విజయ
Post a Comment