Wednesday, December 23, 2009
మెర్రి క్రిస్ట్మస్
అబ్బా నేను హిందూనే, ఐతే ఏం క్రిస్ట్మస్ చేసుకోకూడదా? మరి మనకి సౌభ్రాతృత్వం ఎక్కువ కదా? అన్ని మతాలని, సంస్కృతులని ఆదరించే అపురూపమైన నడవడికని మనకి మన సంస్కృతి నేర్పుతుంది కదా? పరమత సహనం మన సంస్కృతిలో ఒక భాగం కదా? మరైతే నేను 'ఈద్ ' సెలెబ్రేట్ చేసుకుంటానా అంటే? చేసుకుంటాను, నా చుట్టూ ముస్లిం స్నేహితులున్నప్పుడు. ప్రతి పండుగకి ఎంతో అర్థం, ఎంతో చరిత్ర, ఎన్నో సాంప్రదాయాలు ముడిపడి ఉంటాయన్నది నా అభిప్రాయమైతే, మెలేచ్చ సంస్కృతి అనకోడం కొందరికి పరిపాటి. ఆస్తికులై ఉండి కూడా, అటు వినాయుకుని పూజ కాని, ఇటు క్రిస్ట్మస్ గాని చేసుకోని వాళ్ళని ఏమందాం మరి?
ఒకప్పుడు కుటుంబాలు అన్ని కలిసి ఉండేవి, రోజు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ బ్రతికే వారు. వారికి ప్రత్యేకంగా ప్రేమికుల రోజు, తల్లి రోజు, తండ్రి రోజు, స్నేహితుల రోజు ఇలా అవసరం లేదు. కాని ప్రపంచం అంతా కుగ్రామంగా మరిపోయిన ఈ రోజుల్లో, కుటుంబ వ్యవస్థ చాలా మారిపోయింది. భార్యా ఇండియాలో, భర్త అమెరికాలో, కొడుకు జపాన్లో ఉంటున్న రోజులివి. పోని ఒకే ఇంట్లో వుంటున్నా, ఎవరి హడావిడి వాళ్ళది. ఆలాంటప్పుడు, భార్య, భర్తకి ప్రేమికుల రోజని ఓ చిన్న బహుమతి, ఓ ప్రత్యేక వంటకం చేస్తే తప్పేముంది. ప్రేమికుల రోజుతో వచ్చిన చిక్కల్లా, వృద్దులు, నడివయలు వాళ్ళు చేసుకోటం మానేసి, యువతీ, యువకలు మాత్రమే చేసుకుంటున్నారు. అది కేవలం మనకెందుకులే అని వృద్దులు, నడి వయసు వాళ్ళు వదిలేయటం మూలంగానే. ఒకసారి మనసుపెట్టి చూస్తే, ప్రేమికుల రోజులో ఎంతో విషయం కనిపిస్తుంది. అలాగే ముగ్గురి పిల్లల్ని కన్న తల్లి, యే ఒక్కరు దగ్గరలేక తల్లడిల్లుతున్న తల్లికి, మథర్స్ డే రోజు, చిన్న కానుక, ఓ ఆత్మీయమైన మాట మాట్లడితే, దాన్ని పర సంస్కృతిగా అభివర్ణించుకోటం ఎందుకు? మీడియా ఇంకా వ్యాపార సంస్థలు ప్రతీ అవకాశాన్నీ వాడుకుని తమ తమ లాభార్జనకు పోటిపడుతూనే ఉంటాయి, కాని మనం వివేకవంతులైతే, ఎవరి తాహతుకి తగ్గట్లు వాళ్ళు, పండుగని పండుగలాగానే జరుపుకుంటాము కాని పండుగని ఒక కాపిటలిస్టిక్ ఈవెంట్ గా చూడము. ఇలా ఎందుకంటున్నాను అంటే, ఈ మధ్య ఒక ఓటింగ్ పోల్ చూసాను, క్రిస్ట్మస్ సాంప్రదాయ పండుగకన్న, ఒక కాపిటలిస్టిక్ ఈవెంట్ గా మారిపోయింది అని.
ఏది ఎమైనా క్రిస్ట్మస్ తెచ్చే కోలాహలం, చిన్న చిన్న ఆనందాలు, అభినందనలు తెలిపే స్నిహితులు, తియ తీయని తీపి పధార్థాలు. కాంతులు విరజిమ్మే సిరీస్ బల్బులు వీటన్నిటిని ఎలా కాదనగలం? అందుకే అందరికి మెర్రి క్రిస్ట్మస్, మంచి మ్యూసిక్ వింటూ, చిన్నా పెద్దా అందరూ మంద్రంగా అయిదు నిముషాలన్నా డాన్స్ చేసి చూడండి, ఈ కులమతాల నషా కన్న ఎంతో అద్భుతంగా వుంటుంది ఆ ఫీలింగ్.
Santa Baby!!! Hurry down the chimney tonight and give me a pleasant smile on my face.
--Vijaya
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
క్రిస్మస్ వాతావరణానికి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కడ చూసినా క్రిస్మస్ స్టార్లూ, క్రిస్మస్ ట్రీలూ,ఎర్రని అలంకరణలూ, ఇవన్నీ భలే నచ్చుతాయి నాకు.ఇదివరలో లేని హడావుడి ఇప్పుడు క్రిస్మస్ కే కాదు ప్రతి పండక్కీ మామూలైపోయింది. నార్త్ లో మాత్రమే హడావుడి చేసే దీపావళి ఇప్పుడు హైద్ లో కూడా బోల్డంత వ్యాపారం చేసేస్తోంది. దీపావళికి బహుమతులిచ్చుకునే సంప్రదాయం ఇక్కడా మొదలైపోయింది.
ఏదైతేనేం, సంతోషాన్ని పంచే పండగ ఏదైనా, ఏ మతమైనా ఒకటే!
శాంటా ని ఒక వాస్తవ వ్యక్తిగా నమ్మే పిల్లలకోసమైనా బోల్డన్ని బహుమతులు తెచ్చి ఉంచి పొద్దున్నే "శాంటా తెచ్చాడు మీ కోసం" అని చెప్పి వాళ్ళ మొహంలో కనపడే ఆశ్చర్యానందాలను అనుభవించడానికైనా క్రిస్మస్ బహుమతులు కొంటాను నేను.
మీ టపా చాలా బావుంది.
విజయ గారు, బాగా రాశారు.
Happy Chritmas.
baagunnadanDee! Happu holidays and merry Christmas.
సునిత గారు, శిశిర గారు, సుజాత గారు, క్రిస్మస్ బాగ సెలెబ్రేట్ చేసుకున్నారా, అలాగే మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సుజాత గారు మీ మనసులో మాట చదివానండి నా భావాలు కూడ మీ భావాలతో చాలా కలుస్తాయి, ఎంత వరకు అంటె నామిని సుబ్రమణ్యం మిట్టురోడి కతలు చదివేంతవరకు.
Post a Comment