Thursday, January 28, 2010

పరికిణి




తనికెళ్ళ భరణి మంచి రచయిత అని మనందరికి తెలుసు ఆయన రాసిన "పరికిణి" కవితల సంపుటి చదివారా మీరు? చిన్న చిన్న మాటల తోనే ఇంత అందంగా కవిత చెప్పొచ్చా అని అద్బుతంగా అనిపించింది. కవితలో సొగసు మాత్రమె కాదు పదాలతో పదనిసలు ఆయన సొంతం. మనని ప్రతి లైన్ సొంతం చేసెసుకుంటుంది. తెలుగు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అమ్మాయికి 11 ఏళ్ళ వయసు రాగానే పరికిణి ఓణి కట్టిస్తారు, ఎందుకంటే అమ్మాయికి అందాన్ని ఇచ్చేది పరికిణి నే కాబట్టి అలాంటి పరికిణి మీద భరణి చెప్పిన ,
పరికిణి కవిత మీకోసం....

దండెం మీద
ఇంద్రధనస్సుని పిండి ఆరేసినట్టుంది!
కొడిపెట్టంటి వయస్సుని
కప్పెట్టిన బుట్టల్లే ఉంటుంది!

పదుచుపాము ఒంటి మీద
పంచరంగుల కుబుసంలా ఉంటుంది!
షాక్ కొట్టే ఎలక్ట్రిక్ వైర్ మీద
వేసిన కవరింగులా ఉంటుంది!

కలల పడవలకు
కట్టినతెరచాపలాగా
ఐస్ ప్రూట్ మీద ఉండే
ఉల్లిపొర కాగితంలాగా

కొత్త ఆవకాయ జాడీమీద
కట్టిన వాసనలాగ
పిందెలకి దిస్టితగలకుండ
కట్టిన గుడ్డలాగ

మాదుర్యానంతా

దాచుకున్నతేనెపట్టులాగ
సరుకులన్ని వున్న తెరవని
కిరాణ కొట్టులాగ
శృంగార రసంలో నానేసి నేసిన
అపారదర్శకపు అద్భుత దేవతా వస్త్రం -పరికిణి!

డాబా మీద నాలుగు చెరగులూ
పరిచి కుర్రకారు గుండెల్ని"పిండి" వడియాలు పెట్టేసిన జాణ - ఓణి!

ఓణి- పరికిణీ తెలుగు కన్నెపిల్లకు అర్ధాంతన్యాసలంకారాలు

పంజాబి డ్రెస్సులొచ్చి పరికిణీల్ని మాయం చేశాయన్న దుగ్ద కొద్ది రాసానని చెప్పారు భరణి మీకు నచ్చితే ఆయన కవితలు ఇంకా వున్నాయి నా దగ్గర ఏమంటారు?

భారతి

5 comments:

రవిచంద్ర said...

చాలా బాగుందండీ కవిత. ఇలాంటివి ఇంకా రాయండి.

Anonymous said...

నేను నా బ్లాగులో భరణి " పరికిణీ " కవితా సంపుటిని ని పరిచయం చేద్దామనుకుంటుడగానే మీరు రాశేసారు. ఫొటో భలేవుంది .
రవిచద్ర గారూ మీరు కవిత పైన మేటర్ చదివినట్టులేదు.

Unknown said...

చాలా బావుంది. మీ దగ్గర ఉన్నవి కూడా వ్రాయండి.

సుధ

చైతన్య said...

"కలల పడవలకు
కట్టినతెరచాపలాగా"

భలే వ్రాసారుగా!

ఇంకా మీ దగ్గర ఉన్న ఆయన కవితలు అన్నీ పోస్ట్ చేయండి.

Padmarpita said...

బాగున్నాయండి....మిగిలినవి కూడా పోస్ట్ లో పెట్టేయండి మరి.