నీరో చక్రవర్తి గురుంచి మనమంతా విన్నాం కదా, రోం నగరం తగలబడుతుంటే చూస్తు ఫిడేల్ వాయించుకుంటు కూర్చున్నాడని మరి మన నాయకులు ఎమైనా తీసిపోయారా, అంతకన్న గొప్పవాళ్ళు ఉన్నారండి మన దగ్గర,
ఒక వైపు తెలంగాణా ఇవ్వమని, వద్దని రాష్ట్రమంతా రావణ కాస్టం లా రగిలిపోతుంది, 2 సార్లు చీఫ్ మినిస్టెర్ గా చేసిన వ్యక్తి తన వాళ్ళని ఎగదోసి ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు, తను మాత్రం నోరు విప్పడు, వచ్చినా నా మంచికే రాకపోయిన నా మంచికే కొట్టుకోనివ్వు చావనివ్వు, అంటు తమషా చూస్తు కూర్చున్నాడు, ఇంత రాజకీయం ఎవరికైనా తెలుసా, టీ. ర్ .స్ .వాళ్ళకన్నా మద్యలో కూర్చుని తెలుగుదెశం నాయకులు చేస్తున్న గొడవే ఎక్కువగా వుంది, వీళ్ళ కత్తి కి రెండువైపుల పదునే,ప్రతి విషయాన్ని తమకి సానుకూలంగా మార్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
ఇదంతా కూడా వాళ్ళ నాయకుడు వెనక వుండి నడిపిస్తున్న తంత్రం లో భాగమే అన్నది జగమెరిగిన సత్యం, ఇంతకి ఈయన ఇంట్లో కూర్చుని ఏమి చేస్తున్నాడని అందరు తలబద్ధలు కొట్టుకుంటున్నారు, లాభం లేనిదే శెట్టీ వరదన పొడనీ, ఇంట్లొ వున్న చంద్రబాబు ఫామిలి రాజకీయాలు చక్కపెడ్తున్నాడని ఇప్పుడె తెలిసింది, ఇన్ని రోజులు పక్కన పెట్టిన జూనియర్ ఎన్. టి. ర్ రాజకీయాలో పనికి వస్తాడు అతని చరిష్మాని వినియోగించుకోవచ్చు అన్న దశలో నెత్తిమీదకెత్తుకుని, తెలుగు దేశం కి ప్రచారం చేయించుకున్నాడు, అప్పుడే జరిగిన ప్రమాదం లో అతను మంచం మీద వుండినా అక్కడి నుండీ కూడ టి. వి. లో ప్రచారం చేయించిన ఘనుడు.ఎన్.టి.ర్ తరువాతి హీరో అతని వారసుడు ఐన బాలక్రిష్ణ ని ఏకంగా వియ్యంకుడిని చేసుకుని నోరెత్తకుండా చేసాడు.
సినెమా ప్రపంచంలో ఎన్.టి.ర్ ఎదుగుతున్న క్రమం చూసాక ఇంక అతన్ని బయటకి పోనివ్వడం భావ్యం కాదని తెలుసుకుని, తన మేనకోడలి కూతురు 17 సంవత్సరాల పసిదానితో పెళ్ళి నిశ్చయం చేసాడు, జూనియర్ ఎన్.టి.ర్ కూడా దీని కోసమే ఎదురు చూస్తున్నాడు కనుక వాళ్ళ అమ్మకి గౌరవం దక్కించడానికి ఫామిలి లో కలిసి పోవాడానికి దీనికి మించిన అవకాశం దొరకదు కనుక ఒప్పుకుని వుంటాడు.
మంచి తరుణం మించిపోనీకు అంటు చంద్ర బాబు రాజనీతికి చిక్కుకున్న జూనియర్ కి వాళ్ళ తాతకి జరిగిన వెన్నుపొటు కాకుండా మంచి జరగాలని ఆశిద్దాం.
వాఆఆఆవ్ చాలాబాగుంది నారా వారి పెళ్లి సినిమా కదూ.
భారతి
9 comments:
భారతి గారు
మొత్తానికి చంద్రబాబుని ఫిడేలు వాయించేసారు కదా! చంద్రబాబు ఇంట్లో ఇన్ని రోజులనుండి ఏంచేస్తున్నారు అన్న ప్రశ్నకి సమదానం దొరికింది.రాజకీయనాయకులు ఖాళీ గా ఎందుకుంటారు ఏదో తమకి ఉపయోగపడేదే చెస్తూఉంటారు. అది తెలియని అమాయకులు ఏదో తమని ఉద్దరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్.టి.ఆర్ నిజ జీవితంలో కూడా హీరో కావాలని ఆశిద్దాం.
సుధ
మరీ అంత చిన్నపిల్లను పెళ్ళి చేసుకోవడమేవిటండీ...మాటలు నరికి తొయ్యమంటే తోస్తాడు. రాజకీయ ప్రయోజనాలకోసం ఇలా చెయ్యడం నాకేం నచ్చలేదు.
మొత్తానికి భలే చెప్పారు.
ఎవరూ తక్కువ కాదు! అందరూ అందరే! వావ్!
మీరన్నట్లు జూనియర్ గారు జాగ్రత్తగా ఉండాలి. అసలే తాత పోలిక కూడాను. :-)
@ భారతి , సుధ, సుజాత
మీరంతా జూనియర్ ఎన్టీఆర్ కు జాగ్రత్తలు చెప్పారు కానీ పదిహేడేళ్ళ లక్ష్మీ ప్రణతి గురించి మాట మాత్రంగానైనా ప్రస్తావించక పోవడం బాగోలేదు . ఈరోజుల్లో అంత చిన్న వయసులో , ఇంకా చదువుకుంటున్న దశలో పెద్దల చేతిలో పావులా మారింది ఆ అమ్మాయి. మన దేశం లో ఆడపిల్లల పరిస్థితికి , పిల్లల చదువులతో, వయసుతో, ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా పెద్దలు తమ ఇష్టా రాజ్యంగా కుదిర్చే పెళ్ళిళ్ళ పద్ధతికి ఇది అద్దం పడుతోంది. కోట్లాది ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళే ఇందులో భాగస్వాములు కావడం మరీ విషాదం.
జూ. రామారావు గారి కాబోయే మావగారికి ప్రైవేటు న్యూస్ చానెల్ వుందని విన్నాను. ఈ కోణం నించి కూడా ఆలోచించాలి . ఇంటర్ చదివే పిల్లకి పెళ్ళా ?
మొన్న ఎవరో అంటున్నారు దగ్గర్లో ఎన్నికలు లేవు. బాబు ఎందుకు తొందరపడ్డాడు పెళ్ళికి అని..
బాబా మజాకా!!
భారతి,
నిన్న ఆ వార్త చదవగానే నేను ఆలోచించింది ఆ పిల్ల గురించే! నా ఉద్దేశమైతే"నీకిష్టమా కాదా?" అని కూడా ఆ అమ్మాయిని అడిగి ఉంటారనుకోను.అడిగినా ఏం చెప్తుంది?
రవిచంద్ర ప్రస్తావించారు కదాని నేను మళ్ళీ రాయలేదు. ఇవాళ పేపర్లో చూశాను, మైనర్ పిల్లకు పెళ్ళి చేయడం చట్టవిరుద్ధమని వాళ్ళమీద ఫిర్యాదు కూడా రికార్డ్ అయిందట.
మేజర్ అయినా మనదేశంలో తన పెళ్ళిని తన ఇష్టప్రకారం నిర్ణయించుకునే హక్కు చాలామంది మగపిల్లలకే లేదు ఈ దేశంలో, ఇవాళ్టి రోజుల్లో! ఇక ఆడపిల్లల సంగతి చెప్పాలాండి?
సుజాత గారు,
అన్నింటికి చంద్రబాబు దగ్గర వివరణలు రడీ గానే వుంటాయి.
ఈ రోజు గ్రేట్ ఆంద్రా లో రాసారు ఆ అమ్మాయికి మార్చ్ లో 18 నిండుతాయని, తను జూనియర్ ని గాడంగా ప్రేమిస్తుందని రాసారు, చిన్నపిల్లలు సినెమా హీరోలని ప్రేమిస్తున్నామనుకోవడం సహజమే కదా, దాన్ని అపర చాణిక్యుడు ఇలా రాజకీయం చేసారు. చద్రబాబా మజాకాన.
కల్పన గారికి నామిని మీద మీ అభిప్రాయాలు చక్కగ తెలియచేసారు, నామిని అభిమానించే దానిగా నేను మీతో ఎకీభవిస్తున్నాను.
Post a Comment