Wednesday, February 17, 2010

How long will you live?


'టైం ' మాగజీన్లో ఒక ఇంటెరెస్టింగ్ ఏజ్ కాలికులేషన్ ఒకటి దొరికింది. ఫైన బొమ్మ క్లిక్ చేసి ఏజ్ లెక్క కట్టండి. అందులో ప్రశ్నలకి అందరి సమాధానాలు దాదాపు 'నో ' అనే ఉంటాయని అనుకుంటున్న. కాని అవన్నీ 'యెస్ ' చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. చూడండి మీరే.

చాలా ఏళ్ళు బ్రతకాలంటే హార్వార్డ్ రీసర్చర్స్ చెప్పేది ఒకటే మంత్రం. తక్కువ తినండి, ఎక్కువ ఎక్షర్‌సైస్ చేయండి అని. ఏంటో హార్వార్డ్ వాళ్ళు మరీ ఎక్కువ చెప్తారు. తిండి తక్కువైన ఎలుకలు ఎక్కువ కాలం బ్రతికాయట, తిండి ఎక్కువైన ఎలకులు త్వరగా చనిపోయాయటా. నన్నడిగితే హాపీగా అన్నీ తినేసి త్వరగా చచ్చిపోతే నష్టం ఎంటటా అని అంటాను. హాపీగా అన్నీ తినేసి, టపీమని చచ్చిపోతే బాగానే ఉంటుంది. కానీ అలా కాదే, మనం తినే తిండి బ్లడ్ గ్లూకోస్ లెవెల్, బ్లడ్ ప్రెషర్ లెవెల్, కొలెస్ట్రాల్ లెవెల్ అన్నీ పెంచేస్తుంది. మనమేమో ఎక్కువ తినేసి, ఎక్సర్‌సైస్ ఏమో అసలే చేయం. ఇంకా టపీ మని చావటం కాదు కాని ముక్కుతూ, మూలుగుతూ నానా కష్టాలు అనుభవించి కాని బాల్చి తన్నలేము. అందుకని కాలరీ రిస్ట్రిక్టెడ్ డయిట్ తీసుకుని, ఎక్షర్‌సైస్ చేయటం చాలా ముఖ్యమనిపిస్తోంది. కాని ఆచరణలో పెట్టటం మాత్రం చాలా కష్టం.

అన్నీ ఏమో కాని, మా గానపెసునని ఒకటి పాటించమని చెప్పాను. రాత్రి డిన్నర్లో కార్బో హైడ్రేట్స్ తగ్గించి, పడుకోబోయె ముందు కొంచెం పాలు తాగమని. మరీ ప్రోటిన్లు, కాల్షియం, విటమిన్ B, ఇంకా ఇతరత్రా పొషకాలు పాలులో తప్ప ఎందులోను దొరకవు. చక్కగా నిద్ర కూడా పడుతుంది. ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత, తన ఆరోగ్యం కాపాడుకోవల్సిన బాధ్యత కూడ ఉంది కదా? అందుకే ఇది ఒక్కటి అచరించమని గట్టిగా చెప్పెసా నేను మాత్రం. ఎవరు కనపడినా ‘Got milk ?’ అని అడిగి మరీ, పాలని ప్రొమోట్ చేసేస్తున్నా నేను.

Wish you all Low Calories, Good Exercise to both mind and body and some milk to strengthen your aging bones.

--విజయ

4 comments:

సుజాత వేల్పూరి said...

నేనూ అంతే! హాయిగా తిని,(మీరన్నట్లు నూనె తక్కువున్నవే లెండి) !
వీలైనంత పని చేస్తాను.(శారీరక శ్రమతో)!
అంతే కాదు, తిండి, శ్రమ ఇవే కాదు. మానసికోల్లాసం చాలా ముఖ్యమని నమ్ముతాను నేను. సంగీతం, సాహిత్యం, సహాయం ఈ మూడూ నా జీవితం నుంచి పక్కకు జరక్కుండా చూసుకుంటాను!ఈ మూడూ ఎప్పుడూ మనసుని సంతోషంగా ఉంచడానికి ఎంతో తోత్పడతాయి.

ఇష్టమైన పనులు చేయడం..అనేది అన్నింటికంటే మంచి ఎక్సర్ సైజండీ! ఏ పనైనా సరే ఇష్టంగా చేస్తే మానసికంగా ఆటోమాటిగ్గా చచ్చినట్లు ఆరోగ్యంగా ఉంటాం!

Anonymous said...

అందులో ఎక్సర్సైజు,స్మోకింగు తప్పించి మిగిలినవి అన్నిటికీ ఎస్సే.సైకిలి తొక్కడం రాదు కాబట్టి నడకే.మరి అది ఎక్సర్సైజులోకి వస్తే అన్నిటికీ ఎస్సే!
మా అమ్మగారు 95 సంవత్సరాలు బ్రతికారు.అయినా ఈ రోజుల్లో బయటకు వెళ్తే ఇంటికి వస్తామో రామో భరోసా లేనప్పుడు, ఇవన్నీ ఎందుకమ్మా ? !

విజయభారతి said...

సుజాత గారు మీ ప్రణళిక బాగుందండి. ఆరోగ్యంగా, ఆనందంగా వుండటం కన్న కావల్సిందేముంది?

ఫణి బాబు గారు, మీరు అన్ని 'యెస్ ' చెప్పగలిగిన స్థితిలో ఉన్నందుకు అభినందనలు. ఇక బయటకి వెళ్తే ఇంటికి వస్తామో రామో అన్న సందిగ్ధం భారతంలో వున్నంతగా ఏ దేశంలోను ఉండదేమో. భారతీయులందరు అభినందనీయులు ఎందుకంటే ప్రతి ఒక్కరు వీరాభిమన్యులే.

Apparao said...

thanks for sharing