మా ఇంట్లో, మా గానపెసూనాంబకి, అప్పుడే పుట్టిన మా పెద్ద దూడకి మధ్య భలే అవినాభావ సంబంధం ఉండేది. ఒకరంటే ఒకరికి అవ్యాజమైన ప్రేమ. తన వెనకాలే మా చిన్నక్క, నేను ఉన్నాకూడా, మా పెద్ద దూడ మీద, గానపెసూనాంబకున్న సొదరి ప్రేమ తరగలేదు. మా పని బుడ్డాడు, గేదెల ఆలనా పాలనా చూసుకుంటా ఉంటే, మా పెద్ద దూడ పని మాత్రం తనే చూసుకునేది. ఆ తరువాత చిన్న దూడ పుట్టినా కూడా పాపం దాన్ని ఎవరు గారబం చేయలేదు. కనీసం మా పెద్ద దూడకి కట్టినట్లు కాలికి ఒక మువ్వ, మెళ్ళో ఒక చిన్న గంట కూడ ఎవరు కట్టలేదు. అయినా అది పాపం అమాయకపు చూపులతో భలే అందంగా ఉండేది. ఐతే మా చిన్న దూడ మగదట, అందుకని మా నాన్నారు ఎవరో వ్యవసాయదారునికి అమ్మేసారు దాన్ని. మేతకెళ్ళిన గేద, దాని దూడ ఒకోసారి ఇంటికి వచ్చేవి కావు. మా గానపెసూనాంబే వెతకటానికి వెళ్ళేది. అవి ఇంటికి రావటం మర్చిపోయి, కోటగట్టు దగ్గర చక్కగ గడ్డిమేస్తా ఉండేవి. మా పెద్ద దూడ, గానపెసూనాంబని చూడగానే, ఒంటికాలితో లగెత్తుకుంటూ, ఒకరకంగా పళ్ళికిలించుకుంటూ మరీ ఇంటికొచ్చేది. మా పెద్ద దూడంటే ఎంత ఇష్తమున్నా కూడా, అది పులుముకున్న బురదని మాత్రం గానపెసూనాంబ అస్సలు కడిగేది కాదు. మా చిన్నక్కకి, నాకు కొబ్బరి పీచు ఇచ్చి, తను నీళ్ళ పైపు పట్టుకుని నిలుచునేది. మాకు దొరికిందే చాన్స్ అని, దూడని ఆ తరువాత దాని తల్లిని కూడా బాగా రుద్దేసే వాళ్ళం, ఆ తరువాత మా అమ్మొచ్చి గానపెసూనాంబకి కొన్ని చీవాట్లేసి, కొబ్బరి పీచుతో కాకపోయినా, దానికి సరిసమానంగా బరకగా ఉండే సున్నిపిండితో మమ్ముల్నిద్దరిని తోమేసేది.
ఇలా మా గానపెసూనాంబ, మా పెద్ద దూడతో కాలక్షేపం చేస్తా ఉంటే, మా చిన్నక్కేమో కోళ్ళతో కాలక్షేపం చేసేది. పొద్దున్నే లేచి గంప కింద కోళ్ళని వదలటం, సాయంత్రం అయ్యేసరికి వాటన్నిటిని గంపకింద ముయ్యటం, అవి ఎక్కడెక్కడ గుడ్లు పెట్టాయో వెతుక్కుని తేవటం అన్ని తనే చేసేది. సాయంత్రం అయ్యిందంటే కోళ్ళ వెనకాల మా చిన్నక్క పరిగెట్టే చిత్రం చాలా పసందుగా ఉండేది. మా కళ్ళ ఎదుటే గుడ్లు, కోడి పిల్లలుగా అవటం చాలా అశ్చర్యంగా ఉండేది మా అక్కలకి. నాకు మాత్రం ఆడుకోటానికి కొత్త బొమ్మలు దొరికినట్లు సంతోషపడిపోయే దాన్ని. నాకు ఉహ తెలిసాక చేయలేదు కాని, అంతకు ముందు మాత్రం, కొడిపిల్లల్తో ఆడినంత సేపు ఆడి, ఆ తరువాత కొన్నిటిని తొక్కి, గొంతు పిసికేసేదాన్ని అని అమ్మ చెప్పేది. అందుకే అందరు నన్ను చిన్ని రాక్షసి అంటారు మరి. మా మవయ్య ఎప్పుడైనా మా ఇంటికి వస్తే, కోడిని కోసి మా అమ్మతో వండించుకునే వాడు. భోజనం ముందర కూర్చుని మా చిన్నక్క ఎందుకు ఏడ్చేదో మా కెవ్వరికి అర్థం అయ్యేది కాదు. చాల కోళ్ళు హతం అయ్యాక గాని చెప్పలేదు, తనకి, తన కోళ్ళని అలా కూరచేసేయటం బాధగా ఉందని. ఆ బాధతో తను చాలా ఏళ్ళు కోడి కూర ముట్టుకోలేదు.
మా అమ్మ వాకిలి చిమ్ముతూ, మా నాన్నరు గడ్డివాము దగ్గర, మా పని బుడ్డాడు గేదల దగ్గర, మా గానపెసూన దూడల దగ్గర, మా చిన్నక్క కోళ్ళ దగ్గర, పొద్దు పొద్దుటే పనిచేస్తూ ఉంటే, అరుగు మీద కూర్చుని వీళ్ళందరిని చూట్టం చాల బాగుండేది. పనులన్ని అయ్యాక, లోపలకెళ్ళి, పాలు, వెన్న, మీగడలు అమ్మకి తెలియకుండ నేను తింటా ఉంటే ఇంకా బాగుండేది. మా పెదనాన్నగారి బొత్తం నేను ఒకసారి మింగేస్తే, డాక్టరు రెండు రోజులు పచ్చి కోడుగుడ్డు తాగిస్తే అది విరోచనంలో జారిపోతుందని చెప్పారట. ఇక నేను ఎలాగు తాగుతున్నానని, ఇంట్లో గుడ్లు పుష్కలంగా ఉన్నాయని, మా అమ్మ, ఏకంగా ఏడదిపాటు నా చేత పచ్చిగుడ్డు తాగించేసింది. ఎంత అన్యాయమో కదా? దొంగచాటుగా తిన్న పాలు మీగడలే కాని, బలవంతంగా తాగిన పచ్చిగుడ్డ్లే కాని, నన్ను అడ్డంగా కాకుండా, నిలువుగా పెంచేసి, మా అమ్మ నన్ను, అడ్డ గాడిద అని కాకుండా, నిలువు గాడిద అని తిట్టేలా చేసాయి. అది నా విషాద గాధ ఐతే, మా చిన్నక్క పాలిట మా మావయ్య యమకింకరుడు. ఇక గానపెసూన దూడ చాలా ఏళ్ళే మా ఇంటిల్లిపాదికి పాలు ఇచ్చింది. జబ్బు చేస్తే దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే కంటతడి కూడా పెట్టుకుంది. ఆసుపత్రి నుంచి వచ్చి మా గానపెసూనాంబని చూస్తూ ప్రాణం విడిచింది. ఇక దానితో పాటే, మా ఇంట్లో పాడి అంతరించిపోయింది. అలాగే మా అనందాలకి కూడా గండిపడింది.
--విజయ

5 comments:
భారతీ,
మొత్తం బ్లాగ్గులో నాకు నచ్చిందేమిటంటే-మీ ఇంట్లోవాళ్ళందరూ నీకు పెట్టిన పేరు !!
(all in fun!)
చాలా బాగా రాసారండి,కొన్నేళ్ళ క్రితం మా నాన్న గారు కూడా ఇదే అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని "గొడ్డుప్రాణం" అనే కథ రాసారు.
nice
గానపెసూనాంబ = ? చెల్లి?
భలే సరదాగా ఉన్నాయండి మీ కబుర్లు...
welcome back after long back
keep writing
sri
Post a Comment