Friday, October 1, 2010

భయం గుప్పెట్లో మనం

మనం భారతీయులం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో పుట్టాము, మన పూర్వికులు చాలా కష్టాలు పడ్డారు, ఆంగ్లేయొలు వచ్చి మనని ౨౦౦ ఏళ్ళకుపైగా పరిపాలించారు, మహాత్ముని పుణ్యమా అని వచ్చిన స్వాతంత్ర్యాన్ని, మితి మీరిన స్వేచ్చగా అనుభవిస్తూ ఎవరికి వాళ్ళు మా ఇష్టం, మా మతం, మా ప్రాంతం , మా భాష అంటూ విభజించాలని ఎవరికి వాళ్ళు అధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు,

దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు, అయోధ్య లో రామమందిరాన్ని కట్టించమని రాములవారు అడిగారా, రక్తపుటేరులు పారించి శవాల గుట్టలమీద మసీదు కూలగొట్టి రామ మందిరం కట్టారు, ఈ రోజు దేశమంతా భయం గుప్పెట్లో వుంది,
నీ పక్కవాడే నీకు శత్రువు ఐపోతాడు, హిందు ముస్లిమ్ భాయి భాయి నినాదమ్ మంట కలుస్తుంది, బెటాలియన్ల కొద్దీ పోలిసులు మీరు తప్పకుండా కొట్టుకోండి, అని చెప్పకనే చెప్తున్నట్లు కనిపిస్తుంది,

ఇది తెల్లారితే కె సి ఆర్ బెదిరిస్తున్నాడు, డిసెంబర్ తరువాత అటు చీమని ఇటు కూడా కదలనివ్వనని, అంతర్యుద్దం తప్పదని, సామాన్య ప్రజలకి పొద్దున లేస్తే బ్రతుకు బండి నడిపించడానికి ఎన్నో సమస్యలు, ఒక వైపు ధరలు ఇంకో వైపు వరదలు, తెల్లారితే పాలు దొరకవు నీళ్ళు రావు, కూరల ధరలకి రెక్కలొచ్చాయి, ఎలారా భగవంతుడా రోజు గడిచేది అని బ్రతుకుబండి లాగే సామాన్యులకి రోజుకో అదనపు సమస్య, చదువుకోమని పట్నం పంపించిన కొడుకు తెలంగాణా కోసం శవమై పోయాడని తెలిసిన తల్లి తండ్రులకి ఈ సో కాల్డ్ రాజకీయనాయకులు ఏం న్యాయం చేయగలరు.

ఎట్టకేలకు న్యాయమూర్తులు సమన్యాయం తీర్పు ఇచ్చారు, అలాగే తెలంగాణా విషయం లో కూడా సరైన న్యాయాన్ని జరిపించగలిగిన శక్తి శ్రీ క్రిష్ణ కమిటీకి వుండాలని దానికి ప్రజలందరు కట్టుబడి వుండాలని, ఈ భయం నీడ నుండి బయట పడీ పిల్లలందరు చక్కగా చదువుకోవాలని ఆశిద్దాం.

భారతి

2 comments:

Anonymous said...

Well said.

నీహారిక said...

భారతి,
నిన్న నేను కూడా ఇదే కోరుకున్నాను. అసలు కలిసిఉన్నవాళ్ళు విడిపోతే ఎలా ఉంటుందో పాకిస్థాన్ ను చూసి కూడా నేర్చుకోవడం లేదు.కె సి ఆర్ కి తన భార్య గానీ,వాళ్ళ కొడుకులు కానీ కూతుర్లు గానీ విడిపోతే ఎలా ఉంటుందో ఆలోచిస్తే బాగుండును.