Saturday, February 19, 2011

'ప్లీస్ వినొద్దు ' -ఈ తరనికి నచ్చే ఒక మ్యూసిక్ ఆల్బం



'నువ్వోకల కరగలేని ఓ మంచు ముక్కలా, నువ్వోకల మరువలేని ఓ తీపి బాధలా' అంటూ అశ్విన్ పాలపర్తి 2008 లో అందరి ముందుకు ఒక ప్రైవేట్ ఆల్బంతో ముందుకు వచ్చినప్పుడు అది విని చాలా అబ్బురపడ్డాను. ఆంధ్రా బీటిల్స్ లా వున్నాయే అనుకున్నాను. సినీ సంగీత హోరులో ఆ ఆల్బం చల్లని పిల్లగాలిలా వచ్చి వెళ్ళిపోయింది. మరి ఆ గాలి ఎందరిని తాకిందో తెలియదు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ 'ప్లీస్ వినొద్దు ' -యు గెట్ అడిక్టెడ్ అంటూ మళ్ళీ ఒక ఆల్బం రిలీస్ చేసాడు తను. మెలొడి, రాక్, హిప్-హాప్, పాప్ అన్ని కలిసిన ఒక మిక్సిడ్ ఆల్బం ఇది. అంటే పూర్తిగా ఈ తరం కోసమే కంపోస్ చేసిన ఆల్బం. మొత్తానికి వెరైటీ ట్యూన్స్ తో చాలా బాగుంది. తెలుగులో సినీ సంగీతానికి ఉన్న ప్రాచుర్యం, పుబ్లిసిటి అంతా ఇంతా కాదు. వాటన్నిటిని దాటి ఇది శ్రోతల చెవులలో పడాలంటే అశ్విన్ చాలా శ్రమించాల్సిందే. ' ఏ మాయ ఛేసావే' చాలా రొజులు విన్నాను, ఇంకా వింటున్నాను. దాని తరువాత నాకు పెద్దగా నచిన ఆల్బం లేదు. ఇదిగో ఇప్పుడు ఇది వింటూ టైం పాస్ చేస్తాను ఇంకొన్ని రోజులు. ఒక్కోపాటకి http://www.plzvinaddu.com/సైట్లో ఇచ్చిన థీం ఇంకా ఆ థీం కి వేసిన బొమ్మలు చాలా బాగున్నాయి. ఇక ఇందులో పాటల విషయానికి వస్తే, ప్రతి పాట ఏరి కోరి కూర్చినట్లు ఉన్నాయి. ఆశ్విన్ పడిన కష్టం స్పష్టంగా తెలుస్తుంది. సంగీతం ఫ్రెష్ గా ఉంది.
1) 'వందేమాతర గీతం ఆగదులే... జై జై మంటూ జయహాసాలే' అంటూ కేదరనాథ్ పరిమి రాసిన గీతం, యువతని హుషారుగా ఉత్తేజం చేస్తే, నా లాంటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ని దేశభక్తి పారవశ్యంలో ముంచేస్తుంది. ఇందులోని కొన్ని సంస్క్రుత పదాలు మాత్రం నాకు అర్థం కాలేదు. గీతం, సంగీతం రెండు బాగున్నాయి, కేదరనాథ్ ఇంకొంచెం కష్టపడి ఉంటే ఆంధ్రులందరి 'స్టాండింగ్ ఒవేషన్ ' దక్కి ఉండేదేమో.
2)'నీ నవ్వుని చూడాలని..చూస్తూనే ఉండాలని ' ఇండియన్ ఐడల్ శ్రీరాం గొంతు విన్న ప్రతి ఒక్కరికి తమ నెచ్చెలి నవ్వు గుర్తు వచ్చేలా...మాయ రాగావేశంలో ముంచేస్తుంది. ఈ పాట బ్యాక్ గ్రౌండ్ మూజిక్ వింటునే ఉండాలనిపిస్తుంది.
3)'వెలిగే దీపం' అంటు క్రిష్ణ చైతన్య గురువు మీద రాసిన గీతం బాగుంది . చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. కాని విని మర్చిపోతాము.
4) 'ప్లీస్ ప్లీస్ వినద్దు ప్లీస్ ' హిప్-హాప్ లో సాగుతుంది. ఇది ఆల్బం టైటిల్ సాంగ్. ఈ పాటకి చార్మి డాన్స్ చేస్తే ఎలా వుంటుంది అన్న ఊహ కలిగింది. వాయిస్ చాలా హుస్కీగా గమ్మత్తుగా ఉంటుంది.
5) 'గోదావరి ' జీవితాన్ని, గోదావరితో ముడివేస్తు అష్విన్ రాసిన పాట భలే నచ్చేసింది. నిజంగానే జీవితం నదిలా పారుతూ వుంటుందిగా, వెనక్కి వెల్లలేదుగా. గోదారి జీవితానికి ఇచ్చే సందేశం చాలా బగుంది.
6)'చల్లగాలి ' ఇది మెలోడియస్ సోలో సాంగ్ అనుకున్నాను కాని మధ్యలో చాలా ఫాస్ట్ గా సాగిపొతుంది ఇప్పటి యువతలా. మళ్ళీ కాసేపు నెమ్మదిగా సాగుతుంది. చల్లగాలిని ప్రియురాలితో పోల్చి ప్రియురాలిని పిలవటం బాగుంది.
7)' అందాల వెన్నెల కన్నుల ' రాప్ లో ఉంటుంది. రాప్ నాకు పెద్దగ నచ్చదు. రాప్ అంటే నా వుద్దేశ్యంలో మాట్లాడుకునే పదాలనే పాటగా పాడేస్తారు. సో రాప్ ఇష్టపడే వాళ్ళకి ఇది బానే వుంటుంది. కాని సంగీతం రిపిటీటివ్గ ఉండి నాకు బోర్ కొట్టేసింది.
8) 'ఏ రోజున చూసానో ' ఇది ఒక స్వీట్ రొమాన్స్. మధురంగా వుంది వినటానికి. 1980స్ పాట విన్నట్టుగ వుంటుంది.
9) అశ్విన్ రా సాంగ్: రాగావేశం కొంచెం తగ్గింది. ఇంకా వైబ్రంట్ గా ఉండి ఉంటే బాగుండేది
వెరైటీ కోరుకునే సంగీత ప్రియులని తప్పకుండా ఆకట్టుకుంటుంది.
If you want to feel the fresh breeze of music you got to listen to these tunes and appreicate Ashwin's efforts to bring it to us. ఈ ఆల్బం itunes లో దొరికేస్తోంది.
విజయ

2 comments:

Mr.Perfect Literature said...

mee review baagundi, enni saarlinaa re view cheyaalani undi, mee blog lo raasina lenin centre books shop vyakti naaku kooda baga telusu. aayana daggara nenu konni amoolyamina books konnanu. rendu pustakaalyte " nizam gaa naa adrustam naa kanta paddayi" . thank god. meeto nenu maatlaadali, kindly accept this.

kedarnath parimi, lyricist & physicist

గిరీష్ said...

nice review