Monday, March 6, 2017

కాలమా మారిపోకే...

కాలమా మారిపోకే...
గాయాలెన్నో రేపుకుంటూ
మనసుకి మందే వేసుకుంటూ
ఎవరినో కలిపేస్తూ
ఇంకెవరినో విడదీసేస్తూ

నిన్న లేనిదేదో ఇవాళ ఇచ్చేస్తూ
ఇవాళ ఉన్నదేదో రేపు లాగేసుకుంటూ
నిషబ్ధాన్ని సృష్టిస్తూ
అంతలోనే చిటికెల సందడి చేసుకుంటూ

కాలమా సాగిపోకే...
నన్ను గమనించనట్టు
నాతో నీకు పనిలేనట్టు
ఉషా కిరణాలని ఛేదిస్తూ
నిషి రాత్రులని సృష్టిస్తూ

మరచిన ఆనందమేదో అందిస్తూ
లేని భయమేదో చూపిస్తూ
ఒకోసారి ఆశేదో నింపేస్తూ
మరోసారి నిరాశలో ముంచేస్తూ

కాలమా..
వెను తిరిగి గతాన్ని చూడవు
ముందెళ్ళి భవిష్యత్తుని తాకవు
నీ గమనం నిరాడంబరం
నిన్నర్ధం చేసుకోలేని
మనిషి జీవన గమనం ఎంతో అయోమయం

--విజయ

No comments: