Saturday, June 30, 2012
Friday, May 11, 2012
మరవలేని సౌరభాలు
నాకు మొక్కలు పూలు పూయటమే తెలుసు. కాని ఈ దేశంలో చెట్లు పూలు పూస్తాయి. విరగబడి మరీ పూస్తాయి. వెళ్ళే దారంతా పూ దారే. అటు ఇటు పూల చెట్లు చూస్తూ, మంద్రంగా పాట వింటూ, మెల్లిగా కారు నడపటం భలే సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు గుల్ దస్తా తెచ్చి ఇంట్లో పెట్టుకుని మరీ పూలని తదేకంగా చుస్తూ ఉంటాను. నాలాంటి వాళ్ళు గడ్డి పూలని కూడా విడిచిపెట్టరు. ప్రతి కొమ్మలో పూలని వెదుకుతు, ప్రతి రెకులొ అందాన్ని వెతుకుతూ తిరిగెస్తూ వుంటాను. ఇక్కడి పూల సొబగులు ఎంత చెప్పినా తక్కువే. అదో అద్భుత పూల ప్రపంచం. ఇన్ని వేల పూలు, ఎన్నో రంగుల్లో నా చుట్టూ ఉన్నా, నాకేమో సన్నజాజులు, మల్లెలు, మరువాలే గుర్తొస్తూ ఉంటాయి. వాటి సౌరభం వీటికెక్కడిది అనుకున్నాను. ఒక్కసారిగా మా అమ్మ, ఇంకా తను పెంచిన మల్లెలు, మరువాలు, రాధా మనోహరాలు, మాలతి లతలు గుర్తు వచ్చాయి. మా అమ్మ పట్టు లంగాలు వేసి, జడ కుప్పెలు వేసి, బొలేడు పూలు మా జడల్లో తురుమేది. మేము జింక పిల్లల్లా చెంగు చెంగున తిరుగుతూనే ఉండే వాళ్ళం. ఈ మధ్య అమ్మ గుర్తు వస్తే వయసు మీరుతున్న అమ్మ, అరోగ్యం దెబ్బ తిన్న అమ్మ, ఇంక తొందర్లొ మమ్ముల్ని విడిచి వెల్లిపొతుందేమొ అన్న బాధ ఎక్కువైపోయి కళ్ళు నీరు కమ్మేస్తున్నాయి. మా చిన్నిది కూడా ఒక బొండు మల్లెలా ఉంటుంది. అప్పుడప్పుదు పట్టులంగా కూడా వేసుకుంటుంది. కాని, మల్లెలు జడ గంటలు తీరని కోరికే. ఈ నేపద్యంలో నాకు కూడా కంచిపట్టు చీర కట్టుకుని, జడ నిండా మల్లెలు పెట్టుకోవాలనిపించింది. అయ్యో జడ లేదే? మల్లెలు అంతకన్నా లేవు. పాశ్చాత్య వస్త్ర ధారణకి అలవటు పడిపోయి, కంచిపట్టు చీర కట్టుకుంటే అరువు తెచ్చుకున్నట్లుగా అనిపించింది. పెద్ద జడ లేదు, జడలో మల్లెలు లేవు ఇంకేమి లాభం? అలంకారం నాకు పెద్దగా అతికినట్లు అనిపించలేదు. ఐనా చీర చుట్టేసుకున్నాను. అప్పటి బాపు బొమ్మలు ఇప్పుడు అసలు వున్నారా అనుకున్నాను. భారతంలో యే మూలో వుండి వుంటరులే. కాని, ఇప్పుడేమో అందరు మోడ్రన్ మహాలక్ష్ములే. యే కాలానికి అదే అందమేమో అనుకున్నాను. మొత్తానికి నేను బాపు బొమ్మలా లేనని మూతి విరిచేసి, అటు ఇటు కాని హ్రుదయంతోని ఎందుకురా ఈ వేదన నీకు అనుకుంటూ మళ్ళీ జీన్స్ తగిలించేసుకున్నాను.
--విజయ
Monday, March 26, 2012
వింటూనే ఉండండి www.radiokhushi.com with RJ VIMAL
ఇవాళ ఉదయం లేస్తూనే రేడియో లో విమల్ గొంతు ప్రవాహాంగా వినిపించింది. నా చెవులని నేను నమ్మలేకపోయాను. ఒక్కసారి కళ్ళు నులుముకుని జుట్టు వెనక్కి అనుకుని మరీ విన్నాను. అవును అది విమల్ ' radiokhushi.com first ever live from New Jersey with RJ Vimal ' అని జెట్ జోష్ గా చెప్తున్నాడు. నా పెదవుల పై ఒక చిన్ని నవ్వు, నా కళ్ళల్లో ఓ చిన్న మెరుపు. 'Yes he is Vimal and he is doing the program'. నేనెప్పుడు అనుకోలేదు. విమల్ తో న్యూ జెర్సీ తెలుగు రేడియో కల సాధ్యం చేయొచ్చు అని. కాని నా ప్రయత్నం ఆపలేదు. అది ఈనాటికి నిజమైంది. జెట్ జోష్ లో విమల్ గొంతు అలా వస్తూనే ఉంది నేను లేచి నా పనులు పూర్తి చేసుకుంటూనే ఉన్నాను. విమల్ కి చాలా ఎనర్జి. ఎక్స్ప్రెస్ లా వెళ్ళిపోతూనే ఉన్నాడు కొంచెం స్పీడ్ తగ్గించమని చెప్పాలి అని అనుకున్నాను. Vimal ' I am living my dream once again and my Radio days are back ' అని రేడియో లో చెబుతున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. నాకు ఒక్కసారిగా గుజారిష్ చిత్రంలో Ethan Mascarenhas గుర్తు వచ్చేసాడు. విమల్ కూడా అలాగే ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేయగలగాలి అని కోరుకున్నాను. విమల్ వాయిస్ ఇంకా కామెంటరీ రెండు కూడా మోనొటనీ నీ పోగొట్టి హూషారు పెంచుతాయి. అందులో పొద్దు పొద్దున్నే , RJ Vimal says good morning, good evening, good afternoon to all the folks across the globe ఆంటూ మంద్రంగా చెప్పగానే నిద్ర మత్తు వదిలి హుషారు వచ్చేసింది నాకు. ప్రోగ్రాం స్కెడ్యూల్స్ ఇంకా చేస్తూనే ఉన్నాడు. పబ్లిసిటి కోసం కూడా భారి ఎత్తున సన్నాహాలు చేస్తున్నాడు. తన ప్రయత్నాలు అన్ని విజయవంతం అయ్యి అందరు ఆదరించే రేడియో కార్యక్రమాలు ఎన్నిటినొ తాయారు చేసి మన అందరి ముందుకు వస్తాడని నా ఆశ. నాకు కూడ ప్రతి ఆదివారం 'Coffee with Karan' టైపులో 'అమ్ములుతో అరగంట ' అనే ప్రోగ్రాం చేయాలని ఉంది. ప్రొగ్రాం ఎలా ఉంటే బాగుంతుందో మీరందరు నాకు సలహా ఇస్తే ఇంకా బాగుంటుంది.It is surely a good start in the morning to listen to Vimal's jet speed, high energy voice which boosts our energies too.
మీ ఆనందం కోసం వింటూనే ఉండండి http://www.radiokhushi.com/ with RJ Vimal Live from New Jersey USA North East from morning 7:00am to 9:00am EST
Send your comments, requests via facebook or phone call.
www.radiokushi.com/jersey and www.facebook.com/radiokhushi
7-9AM EST and 4:30 to 6:30 PM IST
--విజయ
Tuesday, February 14, 2012
Monday, January 23, 2012
నా డెయిరీ లో ఒక ఉదయం
కిటికి తెర తీసి బయట ప్రపంచాన్ని చూట్టానికి, వెచ్చటి వెల్వెట్ బ్లాంకెట్ అలానే చుట్టేసుకుని లేచి కూర్చున్నాను. రాత్రి అంతా మంచు కురిసిందేమో, తెల్లటి మంచు వెండి కొండలై మెరిసిపోతోంది. ఇంకా మంచు పూలుగా పడుతూనే ఉంది. సూర్యుని కిరణాలు తగిలి ఇంకా మెరిసిపొతోంది. ఒక బ్లూ జే పక్షి అలా ఎగురుతూ వెళ్ళింది. నా కళ్ళు దాని వెనకాలే తిరిగాయి. అబ్బా నేను ఒక విహంగం ఐపోతే అని అనిపించింది. నా అంత పెద్ద విహంగం ఆకాశంలో ఎగిరితే చుట్టానికి అంత బాగోదులే అని సరిపెట్టుకున్నాను. ఐనా ఆ బ్లూ జే కి వెల్వెట్ బ్లాంకెట్ లేదు కదా, పాపం దానికి చలి వెస్తుందేమొ దాని జీవితం కన్న నా జీవితమే బెటర్ అని కూడా అనుకున్నాను. మరో వైపు నుంచి ఒక ఉడుత వచ్చింది దొంగ చూపులు చూస్తూ. దాన్ని చూడగానే 'ఉడతా ఉడతా ఊచి, ఎక్కడకెళ్ళావు ఊచి ' అని అడిగేసా, అదేమొ బెదురుగా చూస్తూ తుర్రుమన్నది. పక్కింటి బిల్లీ తన కుక్కని (తప్పు కుక్కని కుక్క అనకూడదు, వాళ్ళ బాయ్ ని) తీసుకుని బయటకి వచ్చాడు. మళ్ళీ నాకు 'కుక్క కావాలి ' అనే పాట గుర్తు వచ్చింది. విశ్వాసంగా, ఆటలాడుతూ ఒక చిన్ని శునకం ఇంట్లో తిరుగుతూ ఉంటే బానే ఉంటుంది, కాని మరి దాని వెనకాల ఉండే పని మాటేమిటి అని అనిపించి ఆ ఆలోచనని విరమించుకున్నాను. ఇంతలో, నా ఆలోచనలతో తనకేం పనిలేనట్లు, ఒక నల్లని కారు సర్రున దూసుకు పోయింది. అంతేలే, ప్రపంచానికి నాతో పని ఏంటి అనుకున్నాను. అయినా ఇంత చిన్ని కిటికిలో నుంచి చాలా ప్రపంచమే కనిపిస్తోంది.బిజినెస్ మాన్ సినిమా చూసిన మహాత్యం ఏమో (దేవుడిని అది కావాలి ఇది కావాలి అని అడగటమే తప్ప, నువ్వు ఎలా ఉన్నావు దేవుడా అని ఒక్కరు అడగరు అని డయిలాగు) శివయ్యా, కేవలం పులి చర్మంతో ఆ కైలాసంలో అంత మంచులో ఎలా ఉంటున్నావయ్యా అని అనుకున్నాను. పైగా మిసెస్ శివ తో తాండవం కూడా చేస్తూ ఉంటాడు అంత చలిలోను. పాపం మిసెస్ శివ కి కూడా వెల్వెట్ బ్లాంకెట్ ఉండదు, పైగా శివుడు డాన్సు కి రమ్మంటే 'నో ' కూడా చెప్పలేదు. నేనైతే, ' నో వే హోసే ' అని చాలా ఈజిగా చెప్పేయగలను. తనకన్నా నా జీవితమే మెరుగు అని ఇంకోసారి అనుకున్నాను.
ఒకసారి విశ్వం మీద అనుమానం వచ్చింది. నాకు ఇక్కడ ఇంత అందంగా కనిపిస్తున్నా, ఇంకెక్కడో ఎవరికో సునామి చూపిస్తూ ఉంటుందేమో అని. పోవే నువ్వొట్టి మోసకారివి, ఎప్పుడు ఒకేలా ఉండవు, అందరికి ఒకేలా కనిపించవు అని తిట్టేసుకున్నాను. ఈ భూమి, ఆ మాటకొస్తే ఈ విశ్వం అందరి సొత్తు కదా? అందరు సమాన హక్కులతో పుట్టలేదా? అదంతా ఏమో కాని, everyone has right to live productive life అని అనిపించింది. 'సర్వే జనా సుఖినో భవంతూ ' అని మనసారా ఆ వెంకన్నకి దండం పెట్టుకున్నాను.
--విజయ
Saturday, December 31, 2011
Thursday, December 22, 2011
Happy Holidays
Whenever I play ‘Jingle Bells’ on my car stereo, I feel the spirit to spread the holiday cheer. Yeah, it is wonderful!Nothing feels painful and impossible and everything looks like a winning game. I started feeling happy for small things. The town Santa stopped by at our home and I was cheered up like a baby (of course, the baby was scared of Santa’s costume). I feel that no one can spoil my cheer and others are cheered up as well when they spot the spark in my face.
The Christmas decorations outside are so exciting. The town had nice decorations as well. When I go to the school for my fiddle, I rock on the roads as I feel the town made the decorations just for me. I wish to have open sleigh ride. Uh Oh,I do not think there are electric sleigh rides, I am not allowed to take a horse sleigh ride as it hurts the horse. Anyway, I just move on in my sedan. I am not that good of a fiddler but I still do little fiddle and diddle (who cares if that is awful or awesome, it is still a cheer up). A small grin on my face and a little drizzle on my skin, it reminds me of Natasha’s song, ‘Feel the rain on your skin’. Do we have time to feel the rain on our skins? Yes, of course we do have time. We just do not observe the tiny little moments and rush with our lives.
I got a book ‘Learning to Dance in the rain’ as Christmas gift from one of our VPs. The book is all about simple truths. The writing on the book says, ‘Life is not about waiting for the storm to pass…It’s about learning to Dance in the rain!’ Isn’t it wonderful ????
Tomorrow I’ll put on a red sweater with tulip brooch, a black skirt and a reindeer antlers to work. Yes it is allowed tomorrow… Tap my left feet and tap my right feet…..tap tap tap..…Let’s dance in the rain…Happy Holidays and Merry Christmas.
--Vijaya
Subscribe to:
Posts (Atom)



