మా శ్రీను భవానిల దీపావళి భలే బ్రైట్ అండ్ షైన్
భవానికి కాల్ చేస్తే చెప్పింది, ఆకాంక్ష వాళ్ళింట్లో దివాలి పార్టీ అంట, అందరు బ్రైట్ అండ్ షైన్ గా రావాలని. అలా చెప్పటమే కాదు, అందరూ రెడ్ కలర్ చీరలు వేసుకుంటే బాగుంటుంది అని కూడా ఇన్విటేషన్లో రాసారట. అందరూ రెడ్ కలర్ చీరలు వేసుకుంటే మరీ బ్యాండు మేళంలా వుంటుందేమో అనిపించింది నాకు. ఐనా మా భవాని కుందనపు బొమ్మ, అందులో రెడ్ సారీ వేసుకుంటే అధిరిపోదూ అనుకుని ఊరుకున్నా. వచ్చిన చిక్కల్లా శ్రీనుతోనే. బ్రైట్ అండ్ షైన్ అంటే శ్రీను ఏమి వేసుకుంటాడబ్బా అని అలోచిస్తూ వుండగానే శ్రీను వచ్చాడు.
భవాని శ్రీనుని అడుగుతోంది, బ్రైట్ అండ్ షైన్ గా వుండాలట, జీన్స్, టీ షర్టు వదిలి, కనీసం కుర్తా, ఫైజామా అయినా వేసుకుంటే బాగుంటుందేమో అని. ఆ మాట వింటూనే, అబ్బా అవన్నీ బ్రైట్ అండ్ షైన్ గా వుండని వాళ్ళ కోసం, ఇక్కడ ఆల్రెడి నేనే పెద్ద బ్రైట్ అండ్ షైన్ అని ఒక డైలాగ్ వదిలాడు. ఇంక అంతే భవాని ఫక్కున నవ్వి, అయితే శ్రీను నువ్వు ఏమి తొడుక్కొకుండానే పార్టీ కి వచ్చెస్తావా అని. ఆ మాట విని ఇంకా అందరం ఘొల్లున నవ్వేసాం.
పార్టీ కి ఎవరికి తోచిన విధంగా, వాళ్ళా వాళ్ళ స్టైల్స్ లో అందరూ భలే బ్రైట్ అండ్ షైన్ గా దిగిపోయారు. ఎన్నో రకాల తినుబండారాలతో, పిల్లలతో, చీరలు, నగలతో పార్టీ నిజంగానే బ్రైట్ అండ్ షైన్ అనిపించింది. కాని అక్కడ అనుకోని ఒక కాంటెస్ట్ పెట్టి శ్రీనుని ఓడించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. అందులో భాగంగా, శ్రీను అత్తగారి పుట్టిన తేదిని అడిగి మరీ ఓడించేసారు గాని, లేకపొతే, ఆ బ్రైట్ నెస్ ని తట్టుకోవడం ఎవరి తరం అయ్యేది కాదు.
నిజం చెప్పొద్దూ, కాంటెస్ట్ ఓడిపోయినా కూడా, మా శ్రీను, భవానిలే బ్రైట్ అండ్ షైన్. వాళ్ళ మనసులతో, హాస్యంతో చుట్టూ వున్న వాళ్ళందరిని బ్రైట్ అండ్ షైన్ చేసేస్తారు.
1 comment:
good post, baagundi...meeku, mee friends ki inka ilanti bright and shine deepavallu chala undalani korutu...
Post a Comment