నాకు సంగీత పరిఙ్ఞానం అంతగా లేకపోయినా, ఐరిష్ ఫోక్ మ్యూసిక్ నుంచి, పాకిస్తాన్ సూఫీ మ్యూసిక్ వరకు అన్నీ వినేస్తూ వుంటాను. బాలమురళి గారి 'పలుకే బంగారమాయెనా ' క్లాసికల్ ఎంత ఇష్టంగా వింటానో, బియాన్సి 'ఆల్ ద సింగిల్ లేడిస్ ' హిప్ హాప్ అన్నా కూడా అంతే సరదా పడతాను. సంగీతం మహా సముద్రం, అందులో తేలియాడే అదృష్టం మనందరిది.
'ఏక్ నిరంజన్ ' సినిమాలో కంగనా రౌనత్, నా గుండెల్లో గిటారు మోగించలేకపోయినా, ఈ వీడియో లో మియా రోస్ మాత్రం 'వాట్ వుడ్ క్రిస్మస్ బి లైక్, వితట్ యు హియర్?' అంటూ నా గుండెల్లో గిటారు మోగించేసింది. ఆ అందం చందం, సునిశితమైన హావ భావాలు, శ్రావ్యమైన పాట, అన్నిటికి మించి ఆహ్లాదకరమైన చిత్రీకరణ, కొద్ది నిముషాల సేపు నన్ను కట్టి పడేసాయి. సింగిల్ ఇన్స్ట్రుమెంట్, సోలో మెలోడీస్ అంటే నాకు మరీ ప్రాణం. సంగీత విద్వాంసులకి, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న మియా రోస్ స్వంత కంపోసిషన్లో లోటుపాట్లు వినిపించవచ్చేమో కాని, నాకు మాత్రం ఈ అమ్మాయి గుండెల్లో గిటారు మోగించేసింది. మోగించటమే కాదు, నేను ప్రిపేర్ అయిపోయాను, వచ్చే సమ్మర్, మయామి బీచ్ లో, అలలను చూస్తూ, 'నువ్వో కల, అలలా నాలోపల, నీలా ఇలా ఎవరూ లేరే ఎలా?' అని పాడేసుకోవాలని. మా గానపెసూనాంబ ప్రభావంతో పాట ఎలగొలా నేను పాడెస్తాను గాని, గిటార్ రాదే ఎలా అని ఆలోచిస్తున్నా ప్రస్తుతం. టు టు టు టూ!!!!!
--విజయ
4 comments:
మీరు గమనించారో లేదో.. గుండెల్లో గుఇటారు చరణమో/అనుపల్లవో వింటుంటే..నాకు స్వర్నకమలం సినిమాలో, ఆకాశంలో ఆశల హరివిల్లు పాటలో "నాకోసం నవరాగాలే.. నాట్యమాడెనులే" అన్న పాట గుర్తొచ్చింది. ఇంటికొచ్చి విందునుగదా..స్ట్రెయిట్ లిఫ్ట్.
అలాగే.. ఏక్ నిరంజన్ టైటిల్ సాంగ్ కూడా "సబ్సె బడా రుపైయ్య" అని పాత సాంగ్ నుండి ఇన్స్పైర్ద్.
బుడుగు గారు గమనించలేదండి. ఇప్పుడు మననం చేసుకుంటే అనిపిస్తోంది. 'పా' హింది సినిమాలో కూడా, ఇలయరాజ మళ్ళీ 'ఆకాశం ఏ నాటిదో, అనురాగం ఆ నాటిది ' హిందిలో రికంపోస్ చేసారు, వినే ఉంటారు మీరు.
Nice Song! thanks for sharing... Mia Rose's 'Hold me now' and 'Just Us' మాత్రమే తెల్సు నాకు.. 'All the single ladies' మాత్రం చాలా నచ్చేసింది!
btw, మీరు సమ్మర్ లో మయామి బీచ్ కి రావాలనే ఆలోచనని ఇంకోసారి పరిశీలించండి.. బీచ్ లో ఉన్నట్టుండదు.. పెనం మీద కూర్చున్నట్టుంటుంది.. just a small suggestion :-)
నిషిగంధ, మరిచిపోయాను. లాస్ట్ క్రిస్ట్మస్ కి డిస్నీ వస్తేనే అక్కడి ఎండ కష్టంగా అనిపించింది. ఇంకా సమ్మర్లో ఎలా రాగలను మయామికి. ఈస్ట్ కోస్ట్ బీచెస్ బానే ఉంటాయి కాని, నీళ్ళెప్పుడు చల్లగానె ఉంటాయి, అది ఇష్టం ఉండదు నాకు.
Post a Comment