Saturday, December 26, 2009
రక్షించు దేముడా మీడియా నుండి
మన మీడియా చేస్తున్న అరాచకం ఏలా ఎదుర్కొవాలో నాకేం అర్దం కావట్లేదు. అతి సర్వత్ర వర్జియేత్ అని పెద్దలు ఊరికే చెప్పలా, దూరదర్శన్ వున్నప్పుడు ఎప్పుడూ పాలు చేలేనా పందుల పెంపకమేనా అని ఏడ్చెవాళ్ళం . ఇప్పుడు ఈ టి వి, ఆ టి వి అని 20 చానెల్స్ వచ్చాయి. అందులో కొన్ని 24 గంటలు న్యూస్ చానెల్స్.
కుక్కమూతి పిందెల్లా పుట్టుకొచ్చిన ఈ చానెల్స్ రేటింగ్ పరుగులో మనం ఎంతగా బలైపొతున్నమో తల్చుకుంటే ఏడుపు వస్తుంది.
ప్రతిదాన్ని ఎంతగా వక్రీకరిస్తే అంత స్పెషల్ న్యూస్, ఎ. బి .ఎన్
చానల్ వాడు గవర్నెర్ రాసక్రీడలు చుపించాడూ, సరే అది సమ కాలీనం లో జరిగిన విషయం చూపించారు, దానికి బదులుగా ఎన్. టి .వి కి విషయమేమి దొరకలేదు, జాతిపిత గాంధి, మొదటి ప్రధాని జవహర్ లాల్ మొదలుకుని ఇప్పుడున్న రాహుల్ గాంధి ల ప్రేమ కహానిలన్ని వారిని అగౌరవంగా చిత్రీకరిస్తు పసి పిల్లలకు సైతం అర్దమయ్యేలా చానల్ లో చూపించాలా, అది అంత అవసరమా, మా 'చిన్నూ' కి మహత్మా గాంధి ఎంత గొప్పవాడో మన దెశానికి స్వాతంత్రం ఎలా తెచ్చాడో చెప్పి ఆయన మీద పెంచిన గౌరవం ఇలాంటి న్యూస్ తో అంతం అవదా, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే కద.
ఆ మహానుభావులు మంచి వాళ్ళు కాదు అని చిత్రీకరిస్తున్న ఇలాంటి చీడపురుగు జర్నలిస్ట్ లని ఏం చేయాలి టి. వి చూడటం మానేయండి అంటారు అంతేనా.
పసి పిల్లలు ఎదైనా తప్పు చేస్తే యాగి యాగి చేస్తారు రేపు ఆ పిల్లల జీవితం ఏమవుతుంది అని కూడ ఆలోచించరు, కరడుగట్టిన మోసగాళ్ళని తీవ్రవాదుల్ని ముసుగులేసి చూపిస్తారు,
ఇప్పుడు జరుగుతున్న ఈ భీబస్తకాండకి స్వార్ద రాజకీయనాయకులెంత కారణమో వాళ్ళని మోస్తు తిరుగుతూ ప్రతి వాడి నోటి దగ్గర మైక్ పెట్టి వాళ్ళ అడ్డమైన వాదనల్ని ప్రజలకి చేరవేస్తు ప్రజలని రెచగొట్టడం లో మీడియా పాత్ర తక్కువేం కాదు.
ఎంత మందికి ఇది మంచి ఇది చెడు అని విశ్లెషించునే వివేకం వుటుంది, అలాంటి అమాయకమైన విద్యార్దులని, ప్రజలని తప్పుదారి పట్టించడంలో మీడియా దే పెద్ద పాత్ర.
లాభం లేదు వీళ్ళ నోరు మూయించాలి నిన్న హై కోర్ట్ న్యూస్ నిలిపివేయండి, అని ఆర్డర్ చేసినట్లుగా మిగితా వాళ్ళందరికి కూడా బంధనాలు వేయాలి. రేటింగ్ పిచ్చిలో పడి కొట్టుకుపోతున్న మీడీయా ముక్కుకు తాడు వేయాల్సిందే.
నాకు పాలు చేలు చాలు, ప్రశాంతంగా బ్రతకనిస్తే చాలు,
రక్షించు దేముడా ఈ కుహానా రాజకీయనాయకుల నుండి, ఈ మీడియా గ్రద్దల నుండీ నన్ను నా దేశ ప్రజలని రక్షించు.
-భారతి
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
సుబ్బరంగా కేబుల్ కనెక్షన్ తీసేసి... ఓ యాంటెన్నా పెట్టుకుంటే సరి... ఒక్కొసారి నాకు ఇలానే అనిపిస్తుంది. మైండ్ హ్యాపి.. మని సేవింగ్..
అయ్యాయ్యో ఎంత కష్టం వచ్చిపడిందండి మనందరకీ. పాపం దూరదర్శన్‌వారు మనకు ఎంతవరకు కావాలో అంతవరకే చూపిస్తుంటే, గోల గోల చేసి వాళ్ళమీద జోకులు వేసి ఏడిపించి అసలు వాళ్ళు చేసేది జర్నలిజమే కాదు అని తీవ్ర విమర్శలు చేసి, ఇప్పుడున్న 24 గంటల వార్తా చానెల్సును నెత్తిన పెట్టుకుని, ఎదురు డబ్బుఇచ్చి మరీ చూస్తున్నాం కదూ. అనుభవించాలి మరి. ఒక్క పని చేస్తే సరిపోతుంది, అందరూ కలసి. అదేమిటంటే, కేబుల్ వాడిని రోజులో ఒక్క అరగంటసేపు రాత్రి 9.00-9.30 సమయంలో మాత్రమే ఏదో ఒక న్యూస్ చానెల్ను వదలాలి. మిగిలిన సమయాలలో, మీరన్నట్టు పాలు చేలు, పిండి వంటలు, వెంకటేశ్వరా చానెల్, చాగంటి వారి పురాణాలు, మల్లాది వారి (చెవులు గళ్ళడిపోయే)పురాణ కథనం చూపిస్తే బాగుంటుంది.
మన చేతుల్లోనే ఉందండి అంతా. చేతులో ఉన్న పని చెయ్యలేక అవస్త పడిపోతున్నాం. వాడెవడో చూపించేస్తున్నాడని. ఏం కేబుల్ కనెక్షను పీకించేసి, ఇంటిమీద మళ్ళి దూరదర్శన్ అంటిన్నా పెట్టుకో కూడదూ అందరూ.
మనకి నచ్చని విషయాల పట్ల నిర్లిప్తత (మన రక్తంలోనే ఉన్నది, లేకపోతే 2000 సంవత్సరాలు బానిసలుగా ఎందుకు విదేశీ దురాక్రమణదారుల కింద బ్రతుకుతాము)కొంత తగ్గించుకుని, ఈ చానెళ్ళ వాళ్ళు చెత్త ప్రసారం చేసినప్పుడల్లా, ఒక ఈ మైలో లేక ఒక్క అర్ధ రూపాయి వెచ్చించి ఒక కార్డో ప్రతి వాళ్ళు వ్రాసిపడేస్తుంటే, వాళ్ళు ఇలా బరితెగించి పొయ్యేవాళ్ళా? మనం ఈ పని చెయ్యనన్నాళ్ళూ, మనని గొర్రెల్లాగానే ఈ మీడియాకూడ పరిగణిస్తుంది.
అవును మీడియా ప్ర్రాబల్యం చాల ఎక్కువ అవుతున్నది. మీడియా మీది తప్పని సరిగా ( ఇలాంటి విషయాలలో ) నియంత్రణ ఉండాలి .చానల్స్ , పత్రికలు తమకున్న స్వేఛ్చ ని దుర్వినియోగం చెసుకుంటున్నాయి.
ఇది ప్రతి ఒక్కరు ఆలోచించలిసన విషయం.వదిలేస్తే దేవుడు కూడా రక్షించలేడు.
సుధ
మన రాజకీయ నాయకులు ఈ మధ్యన చేస్తున్న ప్రసంగాలు గురించి ఎవరూ మాట్లాడరే? Our electronic media as well as political leaders are beyond 'economic repairs'
శివగారి సూచనలు అనుసరణీయం
నేనందుకే కేబుల్ టీవీ తీయించి వేశాను. ఇప్పుడు దూరదర్శన్ లో కూడా మంచి కార్యక్రమాలు వస్తున్నాయి.
ప్రతీ వ్యక్తిలోనూ మంచీ చెడూ ఉంటాయి. మనం చెడునే చూస్తూ ఉంటే వారిలో ఎంత మంచి ఉన్నా మనకు కనపడదు. మహాత్మా గాంధీ లాంటి వారి విషయంలోనూ, పెద్దలయందు మనం వినయంతో వారి జీవితంలొని మంచిని మాత్రమే స్వీకరించి, తప్పు అనుకున్నది ( ఉందో లెదో నాకు తెలియదు.) ప్రేమతో మన్నించ గలిగితే మన జీవనం సుగమం అవుతుంది. నేటి పిల్లలకి ముఖ్యంగా నేర్పవలసిన లక్షణం ఇది.
చేతి నిండా పని ఉంటె టీవీ చూసే తీరికే ఉండదు కదా?
Post a Comment