ను ను ను నువ్వా? అవును నువ్వే నువ్వే!!! అని నేను అనేది 2010 ని చూసి. నిన్న, మొన్నేగా 2009 అని రాయటం అలవాటు చేసుకున్నది? ఏంటి అప్పుడే వచ్చేసావ్ నువ్వు? నీదేముందిలే సడిచప్పుడు లేకుండా వచ్చేసి, వెళ్ళే ముందు మాత్రం ఏదో ఒక కోలాహలం లేదా కలహలం రేపెట్టి వెళ్ళిపోతావ్. కొత్తగా చెప్పుకోటానికి ఏముంది? షరమాములుగా, ఎండతో కాల్చేస్తావ్ లేదా చలితో చంపేస్తావ్, తుఫానుతో ముంచేస్తావ్ లేదా కరువుతో కాటేస్తావ్. ఈ సంవత్సరం ఏకంగా రాష్ట్రాన్నే పోటెత్తించావ్.
ఒక్క నీకోసం ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎదురుచూస్తారు నీకు తెలుసుకద.ఎవో కొత్త ఆశలతో ఆనందం వున్నా లేకపోయినా లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని నీకు స్వాగతం చెప్తారు. నువ్వోస్తావు కొత్తవెలుగులని విరజిమ్ముతూ, ఏంటో ఈ రొజుతో ప్రపంచమే మారిపోతుంది అనిపిస్తుంది. నిన్న లేని అందమెదో నేడు కలిగినే అని పాడుకొవాలని అనిపిస్తుంది.
ఆ తరువాత మొదలవుతుంది నీ విశ్వరూప సందర్శనం, గడచిన సంవత్సరం ఏం చేసావు, ఒక మైకెల్ జాక్సన్ ని ఒక రాజశెకర్ రెడ్డి ని నీతో తీసుకెల్లిపోయవు, స్వైన్ ఫ్లూ, డెంగ్యు అంటు అంతు పట్టని రోగాల్ని తెచిపెట్టి అందరిని పీడించావు.ఎంత మంది బలయ్యారు, నీకెంటిలే నువ్వు సవత్సరానికి ఒక మారు మళ్ళి మళ్ళి పుడ్తునే ఉంటావు, నీకెం తెలుస్తుంది జనాల బాధ. ఇప్పుడు ఛూడు మావాళ్ళందరు రాష్త్రం నాది నాది అని ఎలా కొట్టుకుంటున్నారో,ఇవన్ని నువ్వు తెచ్చిన మార్పులే కద. మమ్మల్ని అందరిని తోసెసుకుంటు నువ్వు ముందు కెళ్తూనే వుంటావు. అమెరికాలో ఆర్దికమాంద్యానికి ప్రపంచ దేశాలన్ని కుదేలై పోయాయి.
కాస్త బాగుపడ్తున్నాం అనుకునే సమయంలో ఒక సునామి లేదంటే ఒక వరదబీభత్సం ఏదో రకంగా నాశనమె తప్ప ఇంకేమయినా మిగిల్చావా ? వేడుకుంటున్నాం గడచిన కాలమే మంచిదనేలా చేయకు, 2010 లొ అయినా ప్రపంచ శాంతిని అందించి వినాశనాలని జరగనీకుండా మానవాళి మనుగడకు సహకరించు.
అయ్ బాబోయి నువ్వా ను ను నువ్వా మళ్ళి వచ్చెవా, మాకేం తెచ్చేవో అని మేము భయపడెలా చేయకు. 2011 లో అయినా నువ్వేనా మా నువ్వేనా, నీ రాక కోసం నిలువెల్ల కనులై మేమంత వేచేములే అన్నట్లు తీపి ఙ్నాపకాలని మిగుల్చు.
బ్లాగు మిత్రులందరికి నూతనసంత్సర శుభాకాంక్షలు.
--భారతి
6 comments:
kaalam antene kontha santosham, kontha kalakalam...2010 lo anni santoshakaramaina vaartale undali anukovatam koncham atyashe aina, ala korukovadam lo tappu ledu lendi...
anyways, let us all welcome the new year with open arms and pray GOD that HE gives us the strength to overcome difficulties and the sanity of mind to enjoy the happy times...Happy New Year to all...
అవును,2009 అంత దిక్కుమాలిన ఏడాదిని ఇంతవరకూ చూడలేదు. రాష్ట్ర ప్రజల్ని రెండుగా చీల్చేసిన ఏడాదిగా దీన్ని నేను అసహ్యించుకుంటున్నాను. ఈ కొత్త ఏడాది ఏం తెస్తుందో చూడాలి! చూస్తున్నాం కోటి ఆశలతో కొత్త ఊహలతో!
ainaa prati eaDaadi kottagaa santoeshamgaa jarupukunToonae unTaamukadaa! Wish you a happy new year.
నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html
భారతి గారికి, విజయ గారికి
ఈ సంవత్సరం మీకు మరుపు లేని మధుర స్మృతులను మిగుల్చుతుందని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలతో
సుధ
సునిత గారికి, సుధ గారికి, సుజాత గారికి మనపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2010 మరిన్ని మంచి విషయాలు మనందరం పంచుకుంటూ మన స్నేహాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.
Post a Comment