గుత్తి వంకాయ కూరోయ్ కోరివండినానొయ్ అని మన ఎంకి నాయుడు బావకి ప్రేమతో వండి పెట్టిన వంకాయ, వంకాయ వంటి కూరయు పంకజముఖి వంటి భార్యయు వుండాలని కవులు రాసేవారు అంతలా మన జీవితాలలో మమేకమైన వంకాయ,ఎమవుతుందో ఏమో అని భయమేస్తుంది.
అగ్రరాజ్యమైన అమెరికా కి జబ్బు ఒకటుంది అదే తన నంబర్ ఒన్ స్థానం నుండి ఎప్పుడు పడిపోతానో అన్న భయం. అందుకే ప్రపంచ దేశాల బలాలేంటి బలహీనతలేంటి అని ఎప్పటి కప్పుడు పరిశోదించి నయానో భయానో ,భ్రమపెట్టో భయపెట్టో వాళ్ళ ఉత్పత్తుల్లన్నిటిని తన గుప్పెట్లొ పెట్టుకుని ప్రతి దానికి వాళ్ళ మీద ఆధారపడెలా చూసుకుంటుంది.
నేను పోయిన సవత్సరం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మాల్ లో కూరగాయలు చూసి ఓయబ్బో ఇంత పెద్ద వంకాయలు, టమాటొలు ఎంతలా నవ నవ లాడిపొతున్నాయో, తింటే వీటినే కదా కూరొండుకుని తినాలి, అని బోల్దంత ఉత్సాహ పడిపోయి మా చెల్లి వద్దంటున్నా వినకుండా అది కొను ఇది కొను అని కొనిపించి ఇంటికి తెచ్చి వండి తిని చూద్దును కదా, ఛ ఇంత దరిద్రమైన టేస్ట్ వీళ్ళంతా ఎలా తింటున్నారా అని ఆశ్చర్యపోయాను.
ఆహా ఏమి రుచి తినరా మైమరచి అంటు వుండాల్సిన వంకాయ నోట్లొ ఏదో మైనపు ముద్ద పెట్టుకున్నట్లు వుండేది, టమాటో రుచి పచి లేకుందా చప్పగా కండ లాగ వుండి ఎంతకి వుడికేది కాదు.పాలకూర పప్పు పసరు కంపు కొట్టేది. అకరికి ఆ పాలతో పెరుగు కుడా మన పెరుగులా గట్టిగా లెకుండ తేగుడు తేగుడు గా వుంటుంది. పాపం అక్కడ మనవాళ్ళంతా ఎలాగో అలవాటు పడి ఇండియా నుండి తెచ్చుకున్న పచ్చళ్ళతో ఎలాగో సర్దుకుపోతుంటారు.
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే ఇంత దరిద్రమైన వంకాయలు మనకి కూడా అంటగట్టి మన దేశవాళి రకాలని మాయం చేసి వాటి పురుగు మందులతో సహా వాళ్ళమీద ఆధారపడేలా చేసుకొవాలని చూస్తోంది, ఎంతసేపూ అమెరికా వాడి ప్రాపకం కోసం ప్రాకులాడే మన ప్రభుత్వం పాపం అమెరికా బి.టి విత్తనాలు మనం కాకపోతే ఎవరు కొంటారు, అక్కడ తినేది మనవాళ్ళే కదా ఇక్కడ కూడా మనం తిని అమెరికా వాడికి లాభాలు చేకుర్చుదాం అని రైతులని ప్రాధేయపడ్తుంది.
ఆ బి.టి విత్తనం స్పెషల్ ఎంటంటే విత్తనాలు ఒక కంపని కి మాత్రమే పేటెంట్ వుంటుంది, వాళ్ళ దగ్గరె విత్తనాలు కొనాలి, రాయల్టి అంతా ఆ కంపని కే వెల్తుంది, దానికి వచ్చే చీడపీడలన్నింటికి ఆ కంపని సూచించిన మందులనే వాడాల్సి వుంటుంది, దానిలో నుండి మరుసటి పంటకు వాడుకోవడానికి విత్తనాలు రావు, వచ్చినా అవి రైతు వాడటానికి కాని , ఎవరికైనా ఇవ్వడానికి కాని అతనికి హక్కు లేదు. అలా చేస్తె సదరు అమెరికన్ కంపనీకి పరిహారం చెల్లించాల్సి వుంటుంది. దరిమిలా జరిగేది ఎంటంటే మన దెశవాళి రకాలు అంతరించి మనం అమెరికా వాడికి కప్పం కట్టుకుంటు వాడు పంపించిన విత్తనాలని కొనుక్కుని పండించుకుంటూ, వాడు మనపై రుద్దిన పేటెంట్ లకి మనం బలవుతూ బ్రతకాలి అది రుచి పచి లేని ఆ కూరగాయలు తింటూ బ్రతకాలి.
అసలు మనం ఇప్పుడు తినే రకాలకి మన బాల్యంలో మనం తిన్న రకాలకే చాలా తేడాలు వున్నాయి, అప్పటి పంటలలో వున్న పొషకాలు కాని, రుచి కాని ఇప్పటి వాటికి లేవు,మన పూర్వీకులు మనకన్నా ఆరొగ్యంగా, ద్రుఢంగా వుండెవారు వాళ్ళ ఆరోగ్యం శారీరక బలం మనకి లేదు, ఎన్నొ జబ్బులు తినే తిండి ములంగానే మనం ఎదుర్కొంటున్నాం.
ఇప్పుడు ఈ బి.టి విత్తనాలని వాడి ఎందరో పత్తి రైతులు తెగుళ్ళకి సరైన మందులు వాడలేక పంట నాశనమై చివరికి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పరిణామాలు చూసి కూడ మళ్ళీ బి.టి వంకాయ విత్తనాలని మనమీద రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్దం కావట్లేదు, ఎదో ఒక దిక్కుమాలిన ఒప్పందాలకి ముందు వెనక ఆలోచించుకోకుండా సంతకాలు పెట్టేది, ప్రజలని చంపుకుతినేది. ఎవడో లాభాపేక్షకి ఎవరినో బలిచేసెది.
ఆ అమెరికా వాళ్ళంతే పాకిస్తాన్ ,ఇండియా ఎప్పుడు శత్రుదేశాల్లాగుంటే తను ఆయుధాలమ్ముకోవచ్చు, వీళ్ళు కరువుతో అల్లాడుతుంతె తన తుక్కు దూగరం అంతా ఇక్కడికి డంప్ చేయొచ్చు. బుష్ పోయి ఒబామా వచ్చినా అంతే ఇంకో చ్లింటన్ వచ్చినా అంతే వాళ్ళకి కావల్సింది, ప్రపంచ దేశాల మీద అధిపత్యం, వాళ్ళ కాపిటలిస్టిక్ సమాజానికి సంపద. నేరుగా కొల్లగొట్టకుండా ఈ వేషాలు, మన పసుపు పై వాడికే పేటెంట్ కావాలి మన వేప పై నాదే పేటేంట్ మీరు వాడకూడదు అంటాడు,దీనిని సమర్దవంతంగా అందరు కలిసి ఎదురుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది, అనే నా భాధ మీతో చెప్తున్నా.
భారతి
4 comments:
మరి ఇలాంటి పనికిమాలిన ఒప్పందాన్ని వెనుకేసుకొచ్చేవాళ్ళ వాదనేమిటో కూడా చెప్పారు కాదు.
ఎన్ని పేపర్లు తిరగేసినా బి.టి. విత్తనాలని వెనకేసుకొచ్చే వాళ్ళ వాదన ఒకటే, ప్రస్తుతం రైతులు చాల హానికారమైన పురుగుల మందును జల్లి అనారొగ్యం పాలు అవుతున్నారు, దాన్ని 70% వరకు తగ్గించవచ్చు దిగుబడి పెంచవచ్చు అని. కాని దానికి ఫుల్ ప్రూఫ్ స్టడీస్ ఏమి లేవు. పైగా భి.టి. విత్తనాలూ ఉపయోగించినా, 30% వరకు వేరే క్రిమిసంహారక మందులు జల్లవలసిందే. అదీ కాకుండా, బి.టి పత్తితో ఆల్రెడి మన రైతులు తెగ జబ్బులు అనుభవించి ఉన్నారు. పత్తి దిగుబడి పెరిగిన దాఖలాలు పెద్దగా లేవు. బి.టి విత్తనాలు సమర్దించే వాళ్ళు వినిపిస్తున్న మరొక వాదన ఏమిటి అంటే, వండిన తరువాత, వంకాయలో బి.టి ప్రోటిన్ అనవాళ్ళు కూడా ఉండవని. మరి ఆ వాదనని సమర్దించుకుందాం అనుకుంటే, బి.టి పత్తి మొక్కలు తిని చనిపొయిన గొర్రెలు, ఇతర పశువుల మాటేమిటి? రేపు మొక్కజొన్న, గోధుమ, వరికి కూడా ఇదే గతి పట్టిస్తారు కదా?
నిజమే , ఒకప్పుడు వున్న రుచి , ఇప్పుడు కూరగాయల లో వున్న రుచి ఇప్పుడు లేదు . పైగా ఈ సంకర జాతి కూడా వస్తే ఇక పస్తే .ప్రస్తుతానికిపస్తు నుండి బతికిపోయాము .
భలే వంకాయండి భారతి గారు ... చూస్తే వండుకొని ఆరగించాలనిపిస్తోంది.
Post a Comment