Monday, February 8, 2010

కాప్సికం బుర్జి

కాప్సికం బుర్జి అని టైటిల్ పెట్టి, తెల్ల వంకాయ అంటుంది ఏంటా అని అనుకోవద్దు. ఈ రోజు తెల్ల వంకాయలు దొరికాయి మాకు. దాన్ని టొమటో (తెలుగులో రామ ములక్కాడ అంటారనుకుంటా టొమాటోని) తో కలిపి కూర వండేసి, చపాతిలు చేసేసాను. ఇంకా ఎమైనా చేయాలనిపించి, 'కాప్సికం బుర్జి' మొదలెట్టాను. నాకు వంటల్లో శ్రద్ధ తక్కువే, అయిన ఎందుకనో దీని గురించి రాయలనిపించింది.

కావాల్సిన పదార్ధాలు:
2 - మద్యస్థంగా ఉన్న ఉల్లిపాయలు
2 - అంతే పరిమాణం ఉన్న కాప్సికం
1 - స్పూన్ జీలకర్ర, దనియాల పొడి
1/2 - స్పూన్ కారం
1 - స్పూన్ ఉప్పు లేక రుచికి సరిపడ
4 - స్పూన్స్ మంచి నీళ్ళు
4 - వంట నూనె చిన్న గరిటెడు
4 - స్పూన్స్ సెనగపిండి

తయారు చేయు విధానం:
ముందుగా సెనగపిండిని మంచి వాసన వచ్చేవరకు సన్నని సెగ మీద వేయించాలి. వేయించిన సెనగపిండికి, కాస్త ఉప్పు, కారం, జీలకర్ర పొడి, దనియాలపొడి కలిపి పక్కన పెట్టాలి. ఫ్రై పాన్లో నూనె వేసి, ఉల్లిపాయలు, కాప్సికం కలిపి వేయించాలి, అది వేగిన తరువాత, శెనగపిండి మిశ్రమం జల్లాలి. అది కలిసిన తరువాత, నాలుగు స్పూన్ల నీటిని జల్లి, తడి పోడిగా ఫ్రై చేయాలి. ఇష్టమున్న వారు నిమ్మరసం కూడా జల్లుకోవచ్చు.

కొద్దిపాటి తేడాలతో పై వంటకాన్నే ' మిర్చి బుర్జి ' లా కూడా చేసుకోవచ్చు. కాప్సికం బదులు బజ్జి మిరపకాయలు వాడాలి. జీలకర్ర, దనియాల పొడి బదులు వాము పొడి వేసుకోవాలి. ఎలా చేసుకున్నా ఈ రెండు రకాల బుర్జీలు భలే పసందుగా ఉంటాయి. మరో పోస్ట్లో 'మేరిగోల్డ్' బిస్కట్స్ తో చాలా ఈజీగా అయిపోయే డిసర్ట్ ఎలా చేసుకోవాలో రాస్తాను. ఇప్పటికి ' మిర్చి బుర్జి ' చేసి, తినేసి రండి.

--విజయ

2 comments:

మధురవాణి said...

నేను ట్రై చేసి చూస్తానండీ ఇది. Thanks for the recipe :)

satya said...

దీన్ని మహరాష్ట్రీయులు "జుంకా" అంటారు.రొట్టెలకి సూపర్ కాంబినేషన్.
ఇదే మసాలాని మిరపకాయల్లో కూరితే "భర్లేలీ మిర్చీ" తయ్యార్.