Monday, April 5, 2010

నేను నాతో పాటు నా కర్ఫ్యూ


చాలా రోజులైంది నా బ్లాగు రాసి, రాద్దామనె అనుకుంటున్నా ఏం రాయాలో మెదడుకి అసలు అందుతేగా, సెక్యులరిజం లౌకికవాదం అని ఎన్ని సంవత్సరాల నుండి మనని మనం మభ్యపెట్టుకునే పదాలుగా మాత్రమే మిగిలిపోయాయి, కర్ఫ్యూ నీడలో పుట్టిన పాపాయికి భారత దేశంలో హైదరాబాదు లో పాలు ఎందుకు దొరకవో తెలుసా, పాలు లేక పాప ఏడ్చే ఏడుపుకి మనలో ఎవరి వద్దనైనా సమాధానం వుందా,ఎందుకు కొట్టుకుంటున్నారు ఎవరిని ఎవరు చంపుకుంటున్నారు,ఎవరు ఎవరిని రెచ్చకొడ్తే రెచ్చిపోయి సాటి మనిషి మీద కత్తి ఎత్తుతున్నారు, ఎవరో కుట్రలకి వీళ్ళు ఆయుధాలవుతున్నారు.

ఎందుకిదంతా జరుగుతుంది, మాయావతి కి డబ్బుల దండలు వస్తాయి, కాని ఆకలికి అలమటించే వాడికి సాయం చేయడానికి ఎక్కడా నిధులుండవు, సమస్యలే లేనట్లు సానియాషోయబ్ పెళ్ళి పెద్ధ సమస్య మన మీడీయాకి, అది మనకో గొప్ప న్యూస్, కాకపోతే ఏక్తా కపూర్ గారి ఆడవిలని సీరియల్స్ వుండనే వున్నాయి, అందులోనే మన సంస్కృతి చూసుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకుంటున్నాం, మనం సగటు జీవులం తెల్లారిలేస్తే ఏ అరాచకానికి గురికాకుండా రోజు గడిస్తే భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుని తెలుపుకుని పడుకుని మళ్ళి పొద్దునజీవన పోరాటానికి సిద్దమవుతున్నాం.

ఏం చేద్దాం ఎవరి చేతుల్లొ వుంది మన పరిస్థితులు మార్చగలిగిన మంత్రదండం. నాకు జవాబు దొరకకే ఇన్ని రోజులు బ్లాగు రాయలేదు.

మీకేమైన తెలిస్తే చెప్పండి , ప్లీజ్



భారతి

2 comments:

sairam said...

ప్రజలలో చైతన్యం రావాలి,
ఎవరి బ్రతుకు కోసం వాడు ప్రాకులాడకుండా,
అందరి కోసం మనందరం బ్రతికితే..
ఆ రోజే వస్తే.. పసి పాపలనుండి..
ముసలి వాల్ల వరకు అందరి జీవనం బాగుంటుంది.

Vinay Datta said...

good post.