పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న ఈ ఫోటోని చాలా మందే చూసి ఉంటారు. ఇది 1994 ఫోటో , కాని అప్పటికి, ఇప్పటికి దార్ఫూర్, సూడాన్ లో పరిస్థితి పెద్దగా మారలేదు. ఈ ఫోటో తాలుకు ఙాపకాలు సదా తనని వెంటాడుతున్నయని, ఫోటోగ్రాఫర్ 'కెవిన్ కార్టర్ ', తనని తాను అంతం చేసుకున్నాడట (పులిట్జర్ ప్రైజ్ అందుకున్నాక). ఈ ఫోటో పై నా స్పందన నేను రాసుకున్నాను. మీ అందరి స్పందన చూడాలని ఉంది. మీలో కలిగే ఆవేదనకిగాని, ఆలోచనలకిగాని, కర్తవ్య నిర్వహణ ఏంటి అనే భావనకిగాని అక్షర రూపం ఇచ్చి, కవితగా కాని, హైకూగా గాని, నాతో, ఇంక ఈ బ్లాగు చదివే అందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
8 comments:
పరిస్థితులెలా ఉన్నా పుట్టించేది మానవుడేగ
ఏ స్థితిలో వున్న ఆహారాన్నైనా తినడం మానవుగా డేగా
పరిస్థితులెలా ఉన్నా పుట్టించేది మానవుడేగ
ఏ స్థితిలో వున్న ఆహారాన్నైనా తినడం మానవుగా డేగా
కరిగిపోయింది ఇంకో పసి దీపం ఆ కలికి
గొడ్డైన పసి గుడ్డైనా తేడా ఏముంది రాబందు ఆకలికి
తిండి లేక ఒకరు - తిండి కోసం ఇంకొకరు
కడుపు నిండినవాడికి ఎన్నో సమస్యలు.. కడుపు నిండని వాడికి ఒకే ఒక సమస్య ..అదే ఆకలి సమస్య
ఆకలి బాధ తెలిసినవాడు
ఆహారంగా మారుతున్నాడు.
V.S.Raju
తేట గీతి:
శవమిదియని తలచి వచ్చె సంతసమున
కాల్లు, చేతులు, కాయము కదులుటఁగని
మదిన సంశయమ్ముఁగలుగ మనుజునకును
దవ్వున నిలిచె రాబందు దయనుగల్గి!!
వాసు మీరు చెప్పింది చాలా బాగుంది అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చెప్పినట్లు తిండి లేక ఒకరు తిండి కోసం ఒకరు ప్రతి ప్రాణికి తిండి కావాలి అని చిన్న పదం లొ బాగ చెప్పారు
గురు సత్యనారాయణ గారు ఏకంగ పద్యమే చెప్పరు మీ భాష పటిమకు మీరు స్పందించిన తీరుకు వందనాలు.
మనసున్న ప్రతి ఒక్కరు స్పందించారు, రేపు ఈ ఫీచర్ మీద మా స్పందన ఎలావుందో చూడండి.
Post a Comment