నాకు తెలిసి మంచి చెడు రెండే అనుకున్నా ఈ లోకంలో...
ఎప్పుడైనా రెండింటిలో ఒకటి ఎన్నుకోవచ్చనుకున్నా..
కానీ, ఏ పార్టీ కరపత్రం చూసినా నాకు కనిపించేవి
హింసా రాజకీయాలు, పదవీ వ్యామోహాలు
ఒకరిని మించి ఒకరు నిలబెట్టుకోలేని వాగ్దానాలు
పరస్పర దూషణలో దుర్భాషలు
ఒకరి దుర్మర్గాన్ని ఇంకొకరు బయటపెట్టడాలు
దొరికినంతా దోచి స్విస్ బాంకులో దాచటాలు
పేదవాడి ఓటు కోసం దీనంగా పడిగాపులు
ఎవరో అన్నట్లు..
నేతలంతా రాత్రి బారు, పగలు దర్బారు..!
ఇందుకేనా పరపీడన పరాయణత్వం వదిలించుకున్నదని
వీళ్ళ చేతుల్లోనా నా జన్మభూమి ఉన్నదని
నిశ్చేష్టనై నిలుచుని చూస్తున్నా
ఓటెవ్వరికని ఆలోచిస్తున్నా..!
--విజయ
1 comment:
Post a Comment