నేనెప్పుడు నా లోకం లోనె వుంటాను చుట్టూ పరిస్థితులని అంతగా పట్టించుకోనని నా మీద మా ఇంట్లో కంప్లైంట్.
ఎందుకు పట్టించుకోను చాలా పట్టించుకుంటాను, నేను నడిచే దారిలో పూచిన గడ్డిపూవు నన్ను మాత్రమే పలకరిస్తుంది నీకెందుకు కనిపించదు. ఇంటి పక్కనే వున్న మామిడి చెట్టు మీద కూసిన కోయిల గొంతు నాకు మాత్రమె వినిపిస్తుంది. ఆ మామిడి చెట్టు ఏ కాలం లో పూస్తుందో ఎన్ని రంగులు మారుస్తుందో ఆ లేత చిగుళ్ళు తిని కోయిల కంఠం ఎంత మధురంగ వుందో నాకు కోయిలకే తెలుసు.
ఎవరేం చేస్తున్నారు అని చెప్పుకునే గాస్సిప్స్ నాకెందుకు చెప్పు, వాన కురిస్తే ఎందుకు వాన అని నీకనిపిస్తుంటె తేనెల వానలా నాకనిపిస్తుంది.కార్తీకం లో గుళ్ళో దీపాలు పాపాలని కడుగుతాయని అందరు పెడ్తుంటే ఆ దీపాల వెలుగులో కార్తీక చంద్రుని కాంతి వెన్నెల సంవత్సరంలో ఏనాడు కనిపించని ఆ జాబిలి వెన్నెల నన్ను పలకరించి పోదామని నాకొసమే వచ్చిన అతిదిలా అనిపించి పలకరించి పరవశించి పోతాను.
ఎప్పుడూ వండుకు తినడంలో, ఆ టి.వి ప్రోగ్రాంస్ లో నాకేమి ఆనందం వుండదు. అల లాగ తేలివచ్చే పాట వింటు నా సారీ మీద డిసైన్ చేసుకుంటూ వుంటే అలౌకిక ఆనందం నాకు. విరబూసిన ఫూల సోనలు వాటి సోయగాలు ఏ మనిషి లోనూ నాకు కనిపించవు.
కబుర్ల మూటని ఒక్కసారి విప్పేనంటె అలా ప్రవాహం లా చెల్లితో మట్లాడటం ఇస్టం మా మాటల్లో లేనిదంటు ప్రపంచంలో వుండదెమో మరి. అంతలా వుంటాయి మాటలు మా ఇద్దరి మధ్య మరి నా చిన్నారి చెల్లి నా మది తెలిసిన నేస్తం కూడ కదా. అంత ఆనందం ఎక్కడా నాకు దొరకదు మరి ఇంక టైం ఎలా గడిచిందో
ఎలా తెలుస్తుంది నాకు.
మిట్టూరోడి కతలు చదువుకుంటూ రావి శాస్త్రిని తిరగేస్తూ మహానుభావుల బ్రతుకుపుస్తకాలు తెరిచి అందులో మునిగిపోతే అన్నం వండాలి అని మర్చిపోవడం నా తప్పా చెప్పండి. మీలాగ రాజకీయాలు చర్చిస్తూ డైలి న్యూస్ పేపర్ లో వచ్చే హత్యా కాండలు నేను చదవడం లేదంటే నేనేం చేయాలి.
లోకం పట్టదని కంప్లైంట్ నా మీద ఇంకో లోకం నాకు తెలియదు మీకు తెలిసినా చెప్పకండి ఎందుకంటే తేనెవానలు పూలసోనలు తప్ప నా మైండ్ కి ఇంకేం ఎక్కవు.

--భారతి
5 comments:
:)
hi
nenu ee blogu ku krotha
mi abhivyaktikarana chala bagundi
naakkuda anipistundi chalasarlu
miku lagane
మీ రచన చాలా బావుంది ..ప్రకృతి లో జీవించు ..ప్రకృతి తో జీవించు...ఇదే
మన అందరి జీవన విధానమైనప్పుడు ఎంత తృప్తి తో జీవిస్తామో అని అనిపించేటట్లు రాశారు...భావుకత బహు బాగా మెండుగా నిండుగా కలవారి జీవితాలెప్పుడూ ఆనందంలొ అలా అలలాగా తేలియాడుతూనె ఉండాలని ఆశిస్తూ అభిలషిస్తూ......
వంశి గారు మీ స్పందనలకు ధన్యవాదాలు ఎంత ప్రకృతి లో మమేకమై జీవించాలని వున్నా మన చుట్టు జరిగే వికృతుల నుండి తప్పించుకోవడం మనిషి కి సాధ్యం కావట్లేదు కదా.
"కబుర్ల మూటని ఒక్కసారి విప్పేనంటె అలా ప్రవాహం లా చెల్లితో మట్లాడటం ఇస్టం మా మాటల్లో లేనిదంటు ప్రపంచంలో వుండదెమో మరి. అంతలా వుంటాయి మాటలు మా ఇద్దరి మధ్య మరి నా చిన్నారి చెల్లి నా మది తెలిసిన నేస్తం కూడ కదా. అంత ఆనందం ఎక్కడా నాకు దొరకదు మరి ఇంక టైం ఎలా గడిచిందో
ఎలా తెలుస్తుంది నాకు."
నాది కూడా నా చెల్లెలితో ఇదే అనుబంధం. చాలా బాగా రాశారు. మీలోని భావుకతకు నా జోహార్లు.
Post a Comment