Thursday, September 13, 2012

Saturday, September 8, 2012

స్నేహమేరా జీవితం


ఎవేవో కారాణాల చేత మనం కొందరి స్నేహితులకి దూరం అయిపోతాం. నిజమైన స్నేహితులు మనల్ని మన స్నేహాన్ని గుర్తు పెట్టుకుని కలవటానికి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి ప్రయత్నమే నా స్నేహితురాలు పద్మ చేసి, ఇదు ఏళ్ళ తరువాత, నన్ను ఈ మధ్యే కలిసింది. తనకి ఒక పాప మానస. ఆ చిన్నిది ఎప్పుడో పసిగా ఉన్నప్పుడు నన్ను చూసింది. మళ్ళీ ఇదు యేళ్ళ తరవాత కూడా నన్ను కొంచెమైన మరిచిపోలేదంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళమ్మ నిరంతరం నన్ను గుర్తు చేస్తూ ఐనా ఉండాలి లేదా నేను ఆ పసి మనసులో చెరగని ముద్ర ఐనా వేసి ఉండాలి. ఏది ఏమైన ఆ చిన్నిదాని మనసులో నాకు చోటు ఉండటం నాకు చాలా అనందం కలిగించింది. వాళ్ళని చూడగానే నా కళ్ళళ్ళో ఏదో మెరుపు, నా పెదవులపై చిన్ని నవ్వు. ఏమి ఇచ్చినా కొనలేని ఆనందం అది.

నాకు మా గాన పెసూనతోనే అవినాభావ సంబంధం అనుకున్నాను. కాని అంతటి చనువు, అంతటి చొరవ నాకు పద్మతోను ఉంటుంది. తన స్నేహానికి కండిషన్స్ ఉండవు అదే నాకు బాగా నచ్చే విషయం తనలో.నేను నేనులా ఉండొచ్చు తనతో.    ఫాషన్, చదువులు, ఉద్యోగాలు, వంటలు, సినెమాలు, పుస్తకాలు, వ్యాపకాలు, వ్యవహారాలు, పిల్లలు, తల్లి తండ్రులు, మనషులు మనస్తత్వాలు ఇలా ఎన్ని విశయాలైన, ఎంత సేపైనా అనర్ఘలంగా, మాట్లాడుకోగలం కాకపోతే టైమె దొరకదు.

ఇంక ఎలాగు అందరం కలుద్దామని నిష్చయం చేసుకున్నాక, ఇంట్లో కన్నా పలు ప్రదేశాలు తిరుగుదామని అనుకున్నాము. ఇక అదో పెద్ద ప్రహసనం ఐపోయింది. ఒకరికి వీలు దొరికినప్పుడు ఇంకొకరికి దొరకదు. పద్మ వాళ్ళతో పాటు, మా విమ్మిగాడూ, వాడి స్నేహితులు బాబీ, విశాల్ కూడా మాతో రావటానికి రెడి అయ్యారు. ఇక్కడ ప్రాబ్లెం లేనిది ఒక్క పద్మకే. మిగితా అందరికి చాలా చాల లింకులు పనులు వున్నాయి. నెల రొజుల ముందైన ప్లాన్ చేయాలి. నాకు అసలు సెలవ లేదు, పద్మ వాళ్ళ ఆయనెమొ రెండూ రోజుల ముందే తిరుగు ప్రయాణం కావాలన్నారు, మానస యేమొ నా స్కూల్ అంటుంది, పద్మ వాళ్ళ నాన్నగారేమో నన్ను ఇండియా ఎప్పుడు పంపిస్తున్నావ్ అమ్మాయ్ అని ఆదుగుతారు. పద్మ వాళ్ళ తమ్ముడేమో, నేను బిసినెస్ త్రిప్ వెల్తూన్నాను, నేను తిరిగి వచ్చాక నాన్నని ఇండియా పంపిద్దామే అని ఆంటారు, మా అయనేమో నాదేముంది మీరంతా ముందు ప్లాన్ చేసుకొండి అంటారు, అసలు విషాల్ కి, బాబి కి మా ట్రిప్ లో వాళ్ళు కూడా ఉన్నారన్న సంగతి వాళ్ళకె తెలియదు, వాళ్ళ టైం కూడా మేమే నిర్ణయించేసాము. మొత్తానికి ఒక వారం రోజులు కూర్చుని టైం టేబుల్ వేసాము. నయాగర, న్యూయార్క్, అట్లాంటిక్ సిటి తిరిగేసాము. అసలు ఆ ఉత్సాహానికి అంతు లేదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఎంటంటే, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అని. ఈ రోజుల్లో అందరు బిజీనే. ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి. నిజం చెప్పాలంటే నాకు క్షణం తీరక ఉండదు. ఉంటే అసలు నాకు తోచదు. ఐనా నాకు బిజీ అనేది అసలు నచ్చని పదం. నీకు నచ్చక పోతే మాకేంటట అని అనేసుకోమాకండి కాస్త అలోచించండి మీ బిజి కాస్త తగ్గించుకుని అవతలి వాళ్ళతో కలిసి చూడండి, ఏదైన కొత్తదనం ఉంటుందేమో.

--విజయ