Wednesday, January 13, 2010

తెలుగు దేశమంతా సంక్రాంతి


సంక్రాంతి అనగానే భోగిపళ్ళు, ముగ్గులు, అరిసెలు, హరిదాసులు, గంగిరెద్దులు, ఇంత ఆనందాన్ని కళని ఇంకే పండగ మోసుకొస్తుంది చెప్పండి.
అందమే ఆనందం అన్నారు కదా, ముగ్గులతో మామిడి తోరనాలతో అందంగా అలంకరించుకుని రావమ్మ మహాలక్ష్మి రావమ్మా అనే పాటని పెడ్తే ఘంటసాల గొంతులో మాధుర్యానికి మహాలక్ష్మి పొంగిపోయి అన్నా మనింటికొచ్చేయదా చెప్పండి.
అందుకే సంక్రాంతి అంటే అంత ఆనందం అందరికి, మగవాళ్ళని ఎవరిని కదిలించినా పెళ్ళైన కొత్తలొ సంక్రాంతి కి మా అత్తగారి ఊరిలో జరిగిన నాకు జరిగిన వైభోగం తిన్న పిండి వంటలు అంటూ మట్లాడని వాళ్ళు వుంటారా, అంటే సంక్రాంతి అతని జీవితం లోనే మరపురాని తీపి గుర్తుల్ని జీవితాంతం గుర్తుంచుకునేలా మిగిలిస్తుంది.
తరువాత జీవన గమనంలో ఎన్ని పండగలు వచ్చినా కొత్త అల్లుడికి మొదటి సంక్రాంతి మిగిల్చే తీపి అరిసెల గుర్తులే వేరు.
పట్టు పావడాల అమ్మాయిలు గొబ్బిళ్ళు ముగ్గులు పెట్టి చిలకపచ్చ పావడా నాది చూడూ అంటే, ఎరుపు రంగు ఓణి నాది చూడు అంటూ, వయ్యరాలు పోయె ఆ లంగా ఓణిల లోని సింగారాలని చూడడానికిఉన్న కళ్ళు సరిపోతాయా, అదే తెలుగు తనం లోని కమ్మదనం, తెలుగు ఆడపిల్ల ఇప్పుడంటే చుడిదార్ల లోకి దిగారు, కాని పండగ నాటి అమ్మాయిలు పావడాల్తో కనువిందు చేస్తారు.
ఏ దేశం లో ఊన్న,ఒక్క సారి మా ఊరు పోయిరావాలి,పంట చేలతో మాటాడి రావాలి,అమ్మ చేతి పిండివంటలు తినేసి రావాలి,అనుకోని తెలుగు వాడు వుంటాడా.
అదే తెలుగు సంక్రాంతి లో వున్న అందం అన్ని పండగలు ఆనందాన్ని పంచుతాయి, అదేంటో సంక్రాంతి ఆత్మీయతని పంచుతుంది అనిపిస్తుంది నాకు.
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.మనది తెలుగు జాతి, మనది తెలుగు సంక్రాంతి, సంక్రాంతి కి ప్రాంతీయ భెధాలు లెవు ఇంటింటా వస్తుంది, పసి పాపల బొసినవ్వులా ఎవరిని చూసినా పలకరిస్తుంది. మన సంస్క్రుతికి లేని తేడాలు మనకెందుకు చెప్పండి. అందరం కలిసి చేసుకుందాం.కలిసి బ్రతుకుదాం.
భారతి

5 comments:

Anonymous said...

భారతి గారు

'సంస్కృతి కి లేని తేడాలు మనకెందుకు ' చాలా బాగా వ్రాసారు.
మీకు, మీవారందరికి మా సంక్రాంతి శుభాకాంక్షలు.

సుధ

Rao S Vummethala said...

Chakkani maata cheppaaru.
Kudos to u.
Sankraanti Subhakaakshalu.

మధురవాణి said...

అందమైన సంక్రాంతి పండుగ గురించి చాలా అందంగా చెప్పారు. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

చిలమకూరు విజయమోహన్ said...

భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు.

Anonymous said...

మకర సంక్రాంతి – మీకందించాలి నూతన క్రాంతి!