Tuesday, November 3, 2009

మా అక్కగారి రోటి మేకర్ భంగపాటు

మా అక్కగారి రోటి మేకర్ భంగపాటు

ఆ జిం ట్రైనర్ ఎందుకు చెప్పాడో అన్నం తినొద్దు రోటిలే తినమని కాని, ఈ బ్లాగుకి శ్రీకారం చుట్టాడు.

అనుకున్నదే తడవుగా సీతని తీసుకుని వెళ్ళి మరీ రోటి మేకర్ తెచ్చేసింది. కాదులే, యుట్యూబ్ లో ఒక డెమో చూసి, సీత వాళ్ళ ఇంట్లో వున్న రోటి మేకర్ ఎలా పనిచేస్తోందో కనుక్కుని, సేల్స్ మాన్ ని సవాలక్ష ప్రశ్నలు అడిగి మరీ కొన్నది.

ఆఫిసు నుంచి ఇంటికి వచ్చి, రోటి మేకర్ ఉన్నదనే ధీమాతో టీవి ముందు అలాగే రెండు గంటలు కూర్చుండిపోయింది. ఇక మొదలైంది రోటి మేకర్ తో అక్కగారి తంటాలు. ఎంత ప్రయత్నించినా అందులొ అప్పడాలే వస్తున్నాయి కాని ఎంతకి రోటిలు మాత్రం రావటం లేదు. వెంటనే సేల్స్ మాన్ కి కాల్ చేసేసింది. వీలు చుసుకుని నేను పర్సనల్ గా వచ్చి డెమో చూపిస్తాను మేడం అని చెప్పి పెట్టేసాడు వాడు. వాడు వచ్చే దాక వెయిట్ చేయలి కాబొలు అనుకుంటు దిగలుపడి కుర్చుంది. ఇక ఆగలేక దాన్ని అమ్మకిస్తే ఎలాగైనా సక్సెస్ చేస్తుంది అని అలోచించి, రోటి మేకర్ పంపిస్తున్నాను ట్రై చేసి చూడు అని కాల్ చేసి చెప్పేసింది. ఇంకేముంది అమ్మ ఇంటిల్లిపాదికి సరిపడా ఒకొక్కరికి నాలుగు రోటిల చొప్పున పిండి కలిపి రెడీగా పెట్టుకుంది రోటి మేకర్ కోసం ఎదురు చూస్తూ. మళ్ళీ అంతే అప్పడాలు వస్తున్నాయి కాని రోటిలు మాత్రం ససేమిరా రాను అంటున్నాయి. అమ్మ వెంటనే కాల్ చేసేసింది. ఇందులొ వేస్తే అప్పడాలు వస్తున్నాయి కాని రోటిలు రావతం లేదే అని. రోటిలు తిందామని వెయిట్ చేసి చేసి మా నాన్న ఇక ఉత్కంఠ భరించలేక లేచి వెళ్ళిపొయారు.

ఇంక అక్కకి పట్టరాని కోపం వచ్చేసింది. రోటి మేకర్ బానే వుంది అని చెప్పిన సీత మీద, యుట్యూబ్లో డెమో చూపించిన పిల్ల మీద, అది అంటగట్టిన సేల్స్ మాన్ మీద అందరి మీద భళ్ళున కొపం వచ్చేసి ఎవరి మీద కన్స్యూమర్ ఫోరంలో కేస్ వెద్దామా అంటు అలొచిస్తు కూర్చుంది.

5 comments:

Vennela kona said...

రొటి మేకర్ లొ రొటి లు అప్పడాలు లా కాకుండా మామూలుగా రావలీ అంటే పిండిని బాగా ఎక్కువ వాటర్ తొ తడపాలి.బాగా చేతులకి పిండిని అంటుకునేట్టు కలిపితే అప్పుడు బాగా వస్తాయ్

విజయభారతి said...

వెన్నెల

మీరు చెప్పినట్లు ట్రై చేసి చుదలి మరి ఎలా వస్తాయో, ఇప్పటికైతే ఫ్లాప్ షో నే.

swarna said...

hi
i am new to this blog
mi anbhavam nannu alochinchela chestondi
endukante nenu kuda chala utsahanga unnanu roti maker konadaniki

విజయభారతి said...

Swarna, Vennela gave a tip. See if that works for you. My mom is an expert in making rotis, still the maker wasn't successful for her. Think before you buy.

మాలా కుమార్ said...

ఈ రోటీ మేకర్ నాకూ పని చెయలేదండి . హాయిగా చేతుల తో చేసుకోవటమే బెస్ట్ అని డిసైడ్ అయిపోయాను .