Monday, November 16, 2009

భూమి కోరని మనిషి


(స్పందనలు తెలిపిన అందరికి మా ధన్యవాదాలు. ఒకే చిత్రానికి ఎన్ని రకాలుగా స్పందిస్తామో కదా? స్పందన ఏదైన, ఆవేదన ఒకటే అనిపించింది. ఈ రోజు పోస్ట్ లో మా ఇద్దరి స్పందనలు)

నాలుగో ఇజం

ఆకలికి నీ ప్రాణం పోతువున్నా
కాకులు నీకై కాపు కాస్తూవున్నా
ఫోటోలు తీసి అవార్డులు
పొయెట్రీలు రాసి పొగడ్తలు పొందే ఆసాములే కాని...
ఏ ఇజం నిన్ను కాపాడగ వచ్చేను?
కాపిటలిజం ...
నీకుంటే తిను, లేకుంటే నా దగ్గర కొను అంటే
కమ్యూనిజం ...
నాకు నిండి నాకే నీకు, లేకుంటే పక్కవాడిని అడుగు అంటే
సోషలిజం ...
అమ్మ ఉంటె గుక్కెడు పాలు తాగు, లేకుంటే భూమి గుండెల్లో దాగు అంటే
ఏ ఇజం నిన్ను కాపాడుతుందని?
ప్రాణమున్న ప్రతి ప్రాణికి ఆకలుంటుందన్న నిజం నీకు తెలిస్తే...
ఆశగ చూస్తున్న ఇంకో ప్రాణికి నువ్వు ఆకలి తీరిస్తే
అదే రియలిజం
నాకు తెలిసిన నాలుగో ఇజం

--విజయ

1 comment:

Unknown said...

కవిత చాలా బాగుంది.. ఇలాగె రాస్తూ ఉండండి...