Friday, November 13, 2009

ఈ రోజుల్లో ప్రేమ (లవ్ ఆజ్ కల్)

ఈ రోజుల్లో ప్రేమ (లవ్ ఆజ్ కల్) అనే సినిమా చూసాను యంగ్ డైరెక్టర్ ఇంతియాజ్ ఆలి సినిమా ని కమర్షియల్ గా తీసిన సినిమా చూసి బయటకు వచ్చిన యువతకు మాత్రం మనసులొ చిన్న ఆలొచన ఐనా వచ్చేలా చేసాడు అనిపించింది.కథానాయకుడు జై అతని గర్ల్ ఫ్రెండ్ మీరా ఇద్దరు ఈ తరానికి చెందిన వాళ్ళు. ఒకరిని చూసి ఇంకొకరు చూసిన నిమిషాన్నే ఆకర్షణలో పడతారు. ఏముంది దాంతో డేటింగ్ మొదలెట్టి ఇద్దరిలో ఆకర్షణ ద్వార కలిగే ప్రతి ఫీలింగ్ ని తీర్చుకుంటారు. దానికి మించి ప్రేమ అనేది కూడా మనుషుల్లో వుంటుండి అని కుడా వాళ్ళకి తెలియదు. ఇద్దరు డిఫెరెంట్ కెరీర్ ఏర్పర్చుకొవలని వాళ్ళ వాళ్ళ కెరీర్ ఇంటెరెస్ట్ వేరె కనుక విడిపోయి ఎవరి దారిలొ వాళ్ళు ఫూచర్ వెతుక్కుంటు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు.విడిపోతు బ్రేకప్ పార్టి కూడా స్నేహితులకి ఇచ్చి అక్కడే ఇంకెవరైన జోడి వెతుక్కుంటారు. అదే ప్లేస్ లో వీర్ అనే పెద్దాయన కనిపించి వారి చినప్పటి ప్రేమ విషయం వారు కనీసం కలిసి మట్లాడుకునే వీలు కూడా లేకపోయినా వాళ్ళ ప్రేమ ఎలా సాగింది ఒకరి మీద ఇంకొకరికి వున్న నమ్మకం ధైర్యం తో ప్రేమని ఎలా బ్రతికించుకుని ఎన్ని సాహసాలు చేసి ఒకటయ్యింది చెప్తాడు. అదంతా జై కి ఫన్ని గాఅనిపిస్తుంది. అలాంటి ప్రేమ ఒకటి వుంటుంది అని కూడ నమ్మలేడుకొంత కాలానికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఇండియా వెళ్ళి మీరా ని కలుస్తాడు. ఇద్దరు చెరి ఒకరి ప్రేమలొ వుండి కూడా మళ్ళి దొంగతనంగ కలిసి గడుపుతారు. అప్పుడు మీరా తను వాళ్ళ బాస్ ని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించానని పెళ్ళికి రమ్మంటుంది. అప్పుడు కూడా ఒకరి మీద ఇంకొరికి ప్రేమ వుంది అని వాళ్ళకి అర్దం కాదు.తరువాత పెళ్ళి అయ్యాక మీరా కి, కావలసిన కెరీర్ లో సెటిల్ అయ్యాక జై కి ప్రేమ అంటె ఎంటో ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ అనెది ఎలా ఉంటుందని వీర్ చెప్పాడో అర్దం అవుతుంది మీరా భర్తని వదిలి మౌనంగా పని చేసుకుంటూ వుంటుంది జై వెనక్కి తిరిగి వచ్చి మీరా ని కలుస్తాడు.ప్రేమనెది ఎంత విలువైందో తెలియకుండ కూల్ ,కాసువల్ అనుకుంటు ప్రతి విషయాన్ని సాదారణంగా తీసుకుంటూ సహజమైన ఫీలింగ్స్ కొల్పోతున్నరన్నదే డైరెక్టర్ చెప్పారు.అవసరాలని మించిన అనుబంధాలు వున్నాయని తల్లి తండ్రులు వారి నెంతో ప్రేమించి పెంచితేనె వారు నేటి స్థితికి రాగలిగారని ప్రేమ అనేది ఒక ఆట వస్తువు కాదని అదొక అనుబందమని యువత తెలుసుకోవాలి.అప్పుడు కాని నిజమైన ప్రేమంటో వారికి తెలియదు ప్రేమ పేరుతో ఇన్ని దారుణాలు అమ్మాయిలని చంపేయటాలు జరగవు, ప్రతి విషయానికి ఒక విలువుంటుంది అని తెలిస్తేకాని యువతలో మానసిక వికాసం కలగదు.

3 comments:

sri said...

ప్రేమ చాలా విచిత్రమైన పదమిది. వినంగానే చాలా పరిచయం ఉన్నట్లుగా ఎవడికి వాడు ఫీల్ అవుతూ ఒక రకమైన ట్రాన్స్ కి లొనవుటడు. వాస్తవానికి వచెటప్పటికి నిజాన్ని ఎవిధంగా తీసుకొవా లొ తెలియక తికమక పొతారు.. సమకాలీన లవ్ కి కొ(న్ గొత మేనింగ్స్ ఇస్తున్నాఇ నేటి సినీమాలు, సీరియల్స్..
అమ్మాయలతొ పరిచయం అవ్వడమె ఒక గొప్ప టాస్క్ ఓ 15 సంవత్సరాల మునుపు, కనీ ఇప్పుడు కనిపించంగా నే, అయ్ లవ్ యు అనకపో తే జీవితం లొ అచీవర్ కానే కారు. ఇదీ నేటి కల్చర్.
మీరు చుసిన సినీమా నేను కూడా చూడ్డం జరిగింది.
ప్రెంజట్ ట్రెండ్ కి తగ్గట్టుగానే మూవీ ఉన్నా గుడ్డి లొ మెల్ల, ఇండియాలొ పబ్లిల్క్ మైండ్ సెటప్ (ఒల్ద్) త్రడిషన్స్ ని వదల లెదని బొక్ష్ అఫీసు కలక్ష్న్స్ చెపుతున్నాయ్.
మన సమాజం లొ ప్రెసెంట్ జనరైషన్ ఫ్రీడమ్ని కోరుకొంటున్నారు, పబ్ కల్చర్ ని ఫాలొ అవుతూ ఎంజొయ్ ( వాల్ల పరిదీలొ ) చేస్థూ, మారెజి విషయం లొ మాత్రం కమిట్ మెంట్ అచార, సాంప్రదాయలకి మొగ్గు చూపడం కాస్త ఊరట..
ప్రతీ విషయానికి ఒక విలువ ఉంటుందని తెలిస్తె కానీ యువత లొ మనొవికాసం కలగదు అని.... దీనికి బీజం తల్లీతండ్రుల దగ్గర పడాలి,,, లెదా మరల వివెకానందుడు రావాలి.
ప్రస్తత యువతలొ నిర్లక్ష్యం, నిర్లజ్జ, బాద్ద్యాతారాహిత్యం, స్వార్ధం గమనిస్తున్న నాకు, మీ రివ్యూ చివరి వాక్యం నా చేత ఇలా రాయించింది.

Anonymous said...

love aaj kal ante translation "prema ivaala repu' anukuntaa

విజయభారతి said...

love aaj kal అంటే love now-a-days అంటే 'ఈ రోజుల్లో ప్రేమ' కరెక్ట్ ట్రాన్స్లేషన్ అని నా అభిప్రాయం